Breaking News

ఇంజనీర్‌ గ్రాడ్యుయేట్‌ కాస్తా.. ర్యాప్‌ సింగర్‌గా ప్రభంజనం..

Published on Fri, 06/13/2025 - 09:58

ఆకులందు అణిగిమణిగి ఉండే అడవి పాటను భళ్లుమనే దీపాల నగర వేదికల మీదకు తెచ్చింది మాహి. మహరాష్ట్ర ఆదివాసీ తెగకు చెందిన ఈ యువ గాయని  తన రాప్‌ సింగింగ్‌ని పేరు కోసమో కీర్తి కోసమో కాక అడవి కోసం, పర్యావరణం కోసం ఆయుధంగా మార్చింది. మాహి చెప్పేది ఒకటే – దేశంలో ఎవరు ఎక్కడ ఉండాలో కొందరు నిర్ణయించారు. ఎక్కడకు చేరాలో మనం నిశ్చయించుకుంటే చాలు అని. మాఝీ నిర్ణయం ప్రకారం ఆమె పాట సరిహద్దులు దాటుతోంది.

‘నేను మీకు వినోదం అందించడానికి రాలేదు. నా జాతికి ప్రాతినిధ్యం వహించడానికి వచ్చాను’ అంటుంది మాహి. 27 ఏళ్ల ఈ ర్యాప్‌ సింగర్‌ ఆదివాసీల జీవితాన్నే పాటగా మార్చి లైవ్‌ షోస్‌ చేస్తూ ఆదరణ పొందుతోంది. ఎడతెగని వచనాన్ని పాటలా పాడే ‘ర్యాప్‌’ లో మన దేశం నుంచి మురికివాడల పిల్లలు కూడా షైన్‌ అయ్యి పేరు సంపాదించారు.  ఇప్పుడు అడవి నుంచి వచ్చిన మాహి వంతు. ‘మా ఆదివాసీల గురించి నేను పాడకపోతే ఇంకెవరు పాడతారు’ అంటుంది మాహి.

గిరిజన కోయిల
మాహి పూర్తి పేరు మధుర యశ్వంత్‌ ఘనె. అయితే ర్యాపర్‌గా మాహి.జి పేరుతో గుర్తింపు పొందింది. ఈమె సొంత ఊరు మహరాష్ట్రలోని వరంగుషి. వీళ్లంది మహదేవ్‌ కోలి అనే గిరిజన తెగ. తండ్రి బస్‌ కండెక్టర్‌గా పని చేస్తుంటే తల్లి గృహిణి. ‘మా తెగలో ఎవరూ బడికి వెళ్లరు. 

వెళ్లినా మధ్యలోనే మానేస్తారు. అందుకే మా అమ్మా నాన్నా నా చదువు కోసం ముంబై వలస వచ్చారు’ అంటుంది మాహి. ముంబైలో తమ్ముడితో కలిసి ఇంజనీరింగ్‌లో చేరిన మాహి అక్కడే స్టూడెంట్స్‌ పాడే ర్యాప్‌ సాంగ్స్‌ను మొదటిసారి వింది. అయితే ఆమెకు పాడటం రాదు, బాణీ కట్టడం అంతకన్నా రాదు. కాని అప్పుడప్పుడు కవిత్వం రాసేది. కాని కోవిడ్‌ వచ్చాక ఆమెలోకి గాయని బయటకు వచ్చింది.

అడవి పాట ఇచ్చింది
కోవిడ్‌ వచ్చినప్పుడు ముంబై మూగబోయింది. ఆ సమయంలో నగరం మంచిది కాదని మాహి కుటుంబం అడవిలోని సొంత పల్లెకు వెళ్లి ఉండిపోయింది. ‘అక్కడకు వెళ్లాక మా వాళ్ల జీవితం నాకు కొత్తగా అర్థమైంది. వారు కోవిడ్‌ కాలంలో కూడా హాయిగా జీవిస్తున్నారు. వారు ప్రకృతి ఒడిలో ఉన్నారు. ఆశ లేదు. పరుగు లేదు. ఎవరికీ హాని చేయరు. అడవిని కాపాడి మేలు చేస్తారు. కాని వీరి గురించి ఎవరూ మాట్లాడరే. అడవుల్లో గిరిజనులు ఉన్న ఊసే ఎవరికీ ఉండదే అనిపించింది. అలా మొదటి పాట తన్నుకొని వచ్చింది. ఆ పాటే ‘జంగిల్‌ చా రాజా’. 2019లో ఈ పాట బయటకు రాగానే నాకు గుర్తింపు వచ్చింది’ అంటుంది మాహి.

హక్కుల కోసం పాట
మాహి తన పాటలో సామాజిక స్పృహ ఉండాలని కోరుకోవడం ఆమెకు గౌరవాన్ని తెచ్చింది. జేఎన్‌యూ స్టూడెంట్స్‌ ప్రత్యేకంగా ఆహ్వానించి మాహి షో నిర్వహించడంతో మాహి  పాటల్లోని రాజకీయ స్పృహ మరింతగా పదును తేలింది. ఇక మాహి పాటలు వరుసెత్తాయి. రైతుల సమస్యలు, కుల వివక్ష, క్వీర్‌ కమ్యూనిటీ హక్కులు, గ్రామీణ జీవనం, స్త్రీల సంఘర్షణ ఆమె సాట వస్తువులయ్యాయి. 

‘కనిపించే వాటిని చూస్తూ కూడా అంధుడిగా మారకు’... ‘ఎవరి చెమటతో నీ ఇల్లు పూర్తవుతుందో వారు ఏ ఠికానా లేకుండా తిరగడాన్ని చూడు’... ‘బేటీ బచావు కబ్‌ తక్‌... ఎందుకు ఆడపిల్లను కాపాడాలి... కాపాడాల్సిన అవసరమే లేని సమాజాన్ని నిర్మించలేమా’... ఇలా ఉంటాయి ఆమె పాటల్లోని లైన్లు.మాహి ఇంకా చాలా పేరునూ గుర్తింపునూ పొంనుంది. ఎందుకంటే ఆమె పాటలో అర్థం, ఆగ్రహం ఉన్నాయి. అవి పాటను సజీవం చేస్తాయి. 

(చదవండి: తొమ్మిదేళ్లకే గజ్జె కట్టి... ఏకంగా మిస్‌ వరల్డ్‌ 2025లో..)

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)