నిశబ్ద నిస్వార్థ వీరుడు..! అతడి సాయానికి సెల్యూట్‌ చెప్పాల్సిందే..

Published on Wed, 07/29/2026 - 12:36

ఎలాంటి ఫలాప్రేక్ష లేకుండా నిస్వార్థంగా చేసేవాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఒక్కొక్కరి ఒక్కో పద్ధతి. కొందరు దానధర్మాలు చేస్తే..ఇంకొందు సేవా మార్గం ఎంచుకుంటారు. అలాకాకుండా రోజువారీ సాదాసీదా విషయాల్లో తన వంతుగా సహాయ సహకారాలు అందించాలని భావించడమే గ్రేట్‌ అనుకుంటే..అందుకోసం సమయం కేటాయిస్తూ..నిస్వార్థంగా సేవ చేయడం అంటే మాటలు కాదుకదా..!. అలాంటి సేవతత్పతరతనే అందిస్తున్నాడు ఈ వ్యక్తి.

ఆ మహానుభావుడే ముంబైకి చెందిన నరేంద్ర పాటిల్‌. లోకల్‌రైళ్లుపై ఆధారపడే ముంబై వంటి నగరాల్లో రైల్వే స్టేషన్‌లో ఎలాంటి గందరగోళ పరిస్థితి ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అలాంటి చోట గమ్యం తెలియక ఇబ్బంది పడుతున్నవాళ్లకు దారిచూపుతాడు ఆయన. చాలా ఓపిగ్గా నవ్వుతూ వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..మార్గనిర్దేశం చేస్తుంటాడు. సింపుల్‌గా చెప్పాలంటే మానవ సూచికగా అభివర్ణించొచ్చు. 

ఆయన ప్రతిరోజూ దాదర్‌ వంతెనపై రెండు గంటలు నిలబడి, గందరగోళానికి గురైన రైలు ప్రయాణికులను సరైన ప్లాట్‌ఫారమ్‌లకు మార్గనిర్దేశం చేస్తారు. ముఖ్యంగా ఎక్కడ ఎక్కాలో లేదా మారాలో తెలియని ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరేలా సాయం అందిస్తారు. అందుకోసం రోజు రెండు గంటలపాటు అక్కడ ఉంటారు. పాటిల్ ఉదయం 9:30 నుండి 11:30 గంటల మధ్య అక్కడ నిలబడి ప్రయాణికులకు గైడెన్స్‌ ఇస్తుంటారు. 

ఉదయం రద్దీ తగ్గిన తర్వాత, పాటిల్ కూడా ఎవరినీ ఏమీ అడగకుండా తన పని ప్రదేశానికి వెళ్ళిపోతాడు. ఆయన ఏమి ఆశించకుండా నవ్వుతూ చేస్తారు ఈ పనిని. కొందరు ప్రయాణికులు ఆయన్ను గుర్తుపట్టి చేయి ఊపి వెళ్లిపోతుంటారు కూడా. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అలాంటి నిశ్శబ్ద వీరులకు పెద్ద సెల్యూట్ అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: హ్యాట్సాఫ్ మేడం..! ఆ ఐడియాకి మాటల్లేవ్‌ అంతే..)

 

#

Tags : 1

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)