Breaking News

నాడు ఎన్నో పతకాలు కొల్లగొట్టిన ఒలింపియన్‌..ఇవాళ ఓలా డ్రైవర్‌గా..!

Published on Mon, 12/30/2024 - 16:42

ఒకప్పుడూ ఒలింపిక్‌ క్రీడాకారుడిగా ఎన్నో పతకాలను కొల్లగొట్టి దేశాన్ని గర్వపడేలా చేశాడు. కానీ నేడు అదే వ్యక్తి సాధారణ క్యాబ్‌ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. తన అథ్లెటిక్‌ కెరీర్‌కి స్పాన్సర్లు లేకపోవడంతో కెరీర్‌కి స్వస్తి పలికి.. క్యాబ్‌ డ్రైవర్‌గా మారాడు. లింక్డ్‌ఇన్‌ పోస్ట్‌లో ఫోటోతో సహా ఈ విషయం వైరల్‌ అవ్వడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. 

ముంబైలోని ఒక సాధారణ క్యాబ్‌ రైడ్‌ వ్యవస్థాపకుడు ఆర్యన్‌ సింగ్‌ కుష్వా కారణంగా ఈ ఘటన వెలుగు చూసింది. ఆయన లింక్డ్‌ ఇన్‌పోస్ట్‌లో తన ఓలా డ్రైవర్‌ పరాగ్‌ పాటిల్‌ మాజీ ఒలింపియన్‌ అని, అంతర్జాతీయ అథ్లెటిక్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి అని వెల్లడిచారు. పరాగ్‌ ట్రిపుల్ జంప్, లాంగ్‌ జంప్‌ ఈవెంట్‌లలో రెండు స్వర్ణాలు, 11 రజతాలు, మూడు కాంస్య పతకాలతో అద్భుతమైన రికార్డుని కలిగి ఉన్నాడని అన్నారు. 

అయితే అతనికి సరైన స్పాన్సర్‌లు లేకపోవడంతో అథ్లెటిక్‌గా కెరీర్‌ని సాగించడం కష్టమైందని చెప్పారు. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో కుటుంబాన్ని పోషించేందుకు ఇలా ఓలాడ్రైవర్‌గా మారాడని, అతనికి మద్దతిచ్చేలా ఎవ్వరైనా స్పాన్సర్‌లు ముందుకు రావాలని క్యాబ్‌ యజమాని కుష్వా పోస్ట్‌లో కోరారు. 

అంతేగాదు తన డ్రైవర్‌తో కలిసి దిగిన ఫోటోలని కూడా కుష్వా జోడించడంతో నెటిజన్లను ఈ పోస్ట్‌ ఎంతగానో ఆకర్షించింది. అస్సలు మనదేశంలో క్రీడాకారులు కెరీర్‌ని ముగించిన తర్వాత లైఫ్‌ని లీడ్‌ చేయడానికి చాలా కష్టపడుతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది. దేశానికి కీర్తి తెచ్చిపెట్టిన వారికి కనీస మర్యాదగా వారికి తగిన జీవన భృతి అందిచాలని ఒకరూ, మరొకరూ క్రౌడ్‌ ఫండింగ్‌తో అతడికి స్పాన్సర్‌లు దొరికేలా సాయం చేయలని పిలుపునిస్తూ పోస్టులు పెట్టారు. 

(చదవండి: ఆ చిత్రాలు జ్ఞాపకాల చీరలు..!)

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)