Breaking News

ఉద్యోగులు లేట్‌గా వస్తే ఫైన్‌ : పాపం బాస్‌కే చుట్టుకుంది! ట్విస్ట్‌ ఏంటంటే!

Published on Fri, 06/21/2024 - 16:22

ఉద్యోగులు సమయాన్ని కచ్చతంగా పాటించాలనే ఉద్దేశంతో ఒక బ్యూటీ కంపెనీ బాస్‌  కఠినమైన నియమం తీసుకొచ్చాడు.  ఆఫీసుకు ఆలస్యంగా వచ్చిన ఉద్యోగులెవరైనా రూ. 200 ఫైన్‌  చెల్లించాల్సిందే అంటూ రూల్‌ పెట్టాడు. అది తిరిగి తిరిగి బాస్‌కే చుట్టుకుంది.  దీంతో  ఆయన ఫన్నీగా ఒక పోస్ట్‌ పెట్టాడు.  ఇది వైరల్‌గా మారింది. ఈ స్టోరీలో అసలైన ట్విస్ట్‌ ఇంకోటి ఉంది. అదేంటో తెలియాలంటే స్టోరీ చదవాల్సిందే. 

ముంబైలోని ఈవోర్ బ్యూటీ వ్యవస్థాపకుడు కౌశల్ షా ఉద్యోగులకు సమయానికి రావాలని రూల్‌ విధించాడు. కంపెనీ ఉత్పాదక పెరగాలని, క్రమశిక్షణ అండాలంటూ ఉద్యోగులు ఉదయం 9:30 గంటలకు కార్యాలయానికి చేరుకోవాలనే కొత్త విధానాన్ని   అమల్లోకి తీసుకొచ్చాడు. అలాగే ఆలస్యంగా వచ్చిన వారికి రూ. 200 జరిమానా విధించారు. ఈ రూల్‌ అలా పెట్టాడో లేదో ఆయనే అయిదుసార్లు   లేట్‌ వచ్చినందుకు  స్వయంగా  షా వెయ్యి రూపాయలు జరిమానా చెల్లించాల్సి వచ్చింది. ఇదే విషయాన్ని ఆయన ఎక్స్‌లో  షేర్‌ చేశాడు. 

ఈ  రూల్‌తో తనకే ఎదురుదెబ్బ తగిలిందని హాస్యాస్పదంగా పేర్కొన్నాడు. దీంతో ఈ  పోస్ట్ వైరల్‌గా మారింది. అలాగేవిష సంస్కృతి అని కొందరు, “ఉద్యోగులందరికీ మీకున్నంత జీతం ఉందా?, మరి ఎక్కువ పనిగంటలకి అదనంగా చెల్లిస్తున్నారా?. ఇలా రక రకాల కమెంట్స్‌  వచ్చాయి.  ‘‘ఇది చాలా దారుణం. మీ నుండి ఇది ఊహించలేదు బ్రో రూ. 200 కోసం వారు తొందరపడితే, ఏదైనా అనుకోని ప్రమాదం జరిగదే ఎలా?’’  అంటూ మరికొందరు ఇంకొంచె ఘాటుగా స్పందించారు. దీంతో సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.   తన పోస్ట్‌కు వచ్చిన స్పందన నేపథ్యంలో  షా, తన ఉద్దేశాన్ని స్పష్టంగా వివరించాడు.

ఇదీ సంగతి!
తన పోస్ట్‌ వెనకాల ఉన్న ఉద్దేశాన్ని నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకున్నారని షా కామెంట్ సెక్షన్‌లో కమెంట్‌ చేశాడు.  కంపెనీ ఒక రూల్‌ పెట్టినపుడు, ఫౌండర్‌ నుంచి కింది స్థాయి ఉద్యోగి దాకా అన్ని స్థాయిల్లో అందరూ దీన్ని తు.చ. తప్పకుండా పాటించాలనే సూత్రాన్ని  నొక్కిచెప్పడమే తన ఉద్దేశమని  పేర్కొన్నాడు. 

అంతేకాదు లేటు ఫీజు ద్వారా సేకరించిన  డబ్బును  తన  సొంత  యూపీఐ వాలెట్‌కు చెల్లించడం గురించి కూడా వివరణ ఇచ్చాడు. దీన్ని ప్రత్యేక టీమ్ ఫండ్‌గా  చేసి  టీమ్ ఈవెంట్‌లకు, లంచ్‌కు ఉపయోగిస్తామని వెల్లడించాడు. 
 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి