Breaking News

బెండకాయ వడలు,జిగురు లేకుండా, క్రిస్పీగా ఫ్రై ట్రై చేశారా? ​

Published on Sun, 04/20/2025 - 16:54

బెండకాయలు(lady Finger) తినడం వల్ల  చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.  బ్లడ్ షుగర్ బ్యాలెన్స్ ఉంచుతుంది. గుండెను ఫిట్‌గా ఉంచుతుంది.  అంతేనా బెండకాయ తింటే తెలివితేటలు పెరుగుతాయని పెద్దలు అంటుంటారు. బెండకాయలో విటమిన్లు, ఖనిజాలు, పీచు మాత్రం పుష్కలంగా దొరుకుతాయని పోషక నిపుణులు చెబుతున్నారు. బెండలోని ఫోలేట్లు అనేక రకాల కేన్సర్లను అడ్డుకుంటాయట. బెండకాయతో చేసుకునే  వంటకాలను ఇపుడు చూద్దామా! 
 

బెండకాయల్లో జిగురు ఎక్కువగా ఉంటే, కొద్దిగా నిమ్మరసం వేసి ఆ జిగురుని పోగొట్టొచ్చు. అభిరుచిని బట్టి వెనిగర్‌ కూడా వాడుకోవచ్చు. అలాగే వాడిపోయిన బెండకాయలను తిరిగి తాజాగా మార్చడానికి, ఐస్‌ క్యూబ్స్‌ వేసిన చల్లటి నీటిలో వాటిని 10 నిమిషాల పాటు ఉంచాలి. వంట చేసేటప్పుడు బెండకాయలనుమరీ ఎక్కువసేపు ఉడికించకూడదు, అలా చేస్తే అవి బాగా మెత్తగా అయిపోతాయి. 

ఇదీ చదవండి: ముఖేష్‌ అంబానీ బర్త్‌డే బాష్‌, ఇదే హైలైట్‌!

బెండకాయ ఫ్రై
లేత బెండకాయ శుభ్రంగా కడిగి కిచెన్ టవల్ తో శుభ్రం చేసి, పొడిగా తుడుచుకోవాలి.  చిన్న చిన్న  ముక్కలుగా గుండ్రంగా  కోసి పక్కన పెట్టుకోవాలి. కోసే తడి లేకుండా ఉండాలి.

బాండ్లీ పెట్టుకొని ఆవాలు చిటపటలాడించి, శనగపప్పు మినపప్పు , ఎండుమిర్చి, ఎండు ఎర్ర మిరపకాయలు వేసి వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగాక ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి సన్న మంట మీద వేగనివ్వాలి. ఇవి కూడా వేగాక తరిగిన  బెండకాయ ముక్కలు వేసి, పాన్ మీద  మూతపెట్టకుండా తక్కువ మంట మీద వేయించుకోవాలి. మధ్య మధ్యలో ముక్క విరిగిపోకుండా కలుపుకోవాలి. ఆ తరువాత కొద్దిగా కొబ్బరిపొడి (ఆప్షనల్‌) తగినంత ఉప్పు, కారం,  పసుపు చల్లి మరికొంచెం వేగనిచ్చిదింపేసుకోవాలి.  సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే మంచి రుచి వస్తుంది. వేడి వేడి అన్నంలోగానీ,  సాంబారు, రసంతో కానీ  నంజుకొని తినవచ్చు.  చపాతీ లేదా సాదా పరాఠాతో కూడా లాగించొచ్చు. 

బెండకాయ వడలు
కావలసినవి:  బెండకాయలు–  5 (మీడియం సైజ్, చిన్నగా తరగాలి), శనగపప్పు–  ఒక కప్పు (15 నిమిషాలు నీళ్లల్లో నానబెట్టుకోవాలి), దాల్చినచెక్క– 2 (చిన్న ముక్కలు), వెల్లుల్లి– 5, జీలకర్ర– అర టీ స్పూన్, ఎండుమిర్చి– 4, ఉల్లిపాయ– 1 (చిన్నగా కట్‌ చేసుకోవాలి), పచ్చిమిర్చి– 2 (చిన్నగా తరగాలి), ఉప్పు– తగినంత, నూనె– సరిపడా

తయారీ: ముందుగా మిక్సీ బౌల్‌లో దాల్చినచెక్క ముక్కలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అందులోనే నానబెట్టిన శనగపప్పు వేసుకుని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. అనంతరం ఒక బౌల్‌ తీసుకుని, బెండకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని బాగా కలిపి, దానిలో శనగపప్పు మిశ్రమం వేసుకోవాలి. అందులో సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలిపి, వడల్లా చేసుకుని నూనెలో దోరగా వేయించుకోవాలి. వీటిని సాస్‌తో సర్వ్‌ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి.

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు