Breaking News

నరకలోకంలో... భూలోక ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (బీ.ఈ.టీ)!

Published on Fri, 06/19/2026 - 09:15

నరకలోకవాసులకు బీ.ఈ.టీ (భూలోక ఎంట్రెన్స్‌ టెస్ట్‌) నిర్వహించారు. జూనియర్, సీనియర్‌లు అనే తేడా లేకుండా అందరూ ఈ పరీక్ష రాశారు. ఈ పరీక్షలో పాసైతే... భూలోకంలో కొంతకాలం పాటు సకల సౌకర్యాలు అనుభవించే అపురూప అవకాశం వస్తుంది. అందుకే... ఈ పరీక్ష అంటే అంత క్రేజ్‌! ఆ పరీక్షలో వచ్చిన రెండు కీలక ప్రశ్నలు...
∙∙ 
‘డియర్‌ నరకవాసీ, ఈ క్రింది ప్రశ్నకు జవాబు వ్రాయుడి. మార్కులు: 10’
అనగనగా ఒక అప్పారావు. ఇతడు ఒకరోజు ఊరి చివర చెరువు దగ్గర విషాదంగా కూర్చున్నాడు.
దారిన పోయే దానయ్య...
‘ఏమిటిరా అప్పీ....ఏడుస్తూ కూసున్నవు?’ అని అడిగాడు.
‘ఈరోజు మా ఆవిడ బర్త్‌డే’ అన్నాడు అప్పారావు.
‘మీ ఆవిడకు బర్త్‌డే గిఫ్ట్‌ ఇవ్వాలిగానీ, ఇలా ఏడుస్తూ కూర్చుంటారా?’ అన్నాడు దానయ్య.
‘ఇచ్చాను కదా!’ కోపంగా అన్నాడు అప్పారావు.
‘ఏమిచ్చావు?’ అడిగాడు దానయ్య.
‘చైన్‌ ఇచ్చాను. ఇచ్చానో లేదో చీపురు కట్ట అందుకొని ఇంట్లో నుంచి తరిమి కొట్టింది’  ఆవేదనగా అన్నాడు అప్పారావు.
ప్రశ్న:
∙ ‘బర్త్‌డే కానుకగా భార్యకు చైన్‌ కొనివ్వడం తప్పు కాదు కదా! మరెందుకు అప్పారావు భార్యకు అంత కోపం వచ్చింది?’
∙∙ 
రెండో ప్రశ్న: మార్కులు: 15
’అలా అయితే నాకు నరకమైనా స్వర్గమే’ అన్నాడు దేవడోస్‌.
అతడు అలా అనడానికి కారణం ఏమిటో క్లుప్తంగా వివరించండి.
∙∙ 
భూలోక ఎంట్రెన్స్‌ పరీక్షలో దబ్బనూరు అబ్బయ్యకు ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చింది. పై రెండు ప్రశ్నలకు అతడు రాసిన జవాబులు...
∙మొదటి ప్రశ్నకు జవాబు:
భార్య బర్త్‌డేకు అప్పారావు ఇచ్చింది గోల్డ్‌ చైన్‌ కాదు. కనీసం రోల్డ్‌ గోల్డ్‌ చైన్‌ కూడా కాదు. అతడు ఇచ్చింది సైకిల్‌ చైన్‌! అందుకే ఆమె అంత కోపం వచ్చింది.
∙రెండో ప్రశ్నకు జవాబు:
దేవడోస్‌ ప్రతిరోజులాగే లిక్కర్‌ షాప్‌ నుంచి ఫుల్‌బాటిల్‌ తీసుకొని ఇంటికి వెళుతున్నాడు. అతడికి దారిలో ఒక పెద్దాయన ఎదురుపడి...
‘ఏమయ్యా... రోజూ పీపాలకు పీపాలు తాగుతున్నావు. తాగిన వారు నరకానికి పోతారనే విషయం తెలియదా నీకు?’ అన్నాడు.
‘నా సంగతి సరే, మందు అమ్మే పీపారావు నరకానికి వెళతాడా?’ అని అడిగాడు దేవ్‌డోస్‌.
‘యస్‌’ అన్నాడు పెద్దాయన,
‘బార్‌ ముందు చికెన్‌ కబాబులు, గుట్కా, సిగరెట్‌ ΄్యాకెట్లు అమ్మే శీనయ్య వెళతాడా?’ అని అడిగాడు దేవడోస్‌.
‘యస్‌’ అన్నాడు డోస్‌.
‘రోజూ నాకు మందు పార్టీలో కంపెనీ ఇచ్చే రమేష్, వెంకటేషం,  రాజు కూడా వెళతారా?’ అని అడిగాడు దేవడోస్‌.
‘యస్‌’ అన్నాడు పెద్దాయన.
‘నేను నరకానికి వెళితే ఏం! నాకు ఇష్టమైన ఇంతమంది వ్యక్తులు నాతో ఉన్నప్పుడు అది నరకమైనా నాకు స్వర్గమే!’ అని బాటిల్‌ మూత తీశాడు దేవడోస్‌. – యాకుబ్‌ పాషా 

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)