Breaking News

ఇహలోక త్రిమూర్తులు ఎవరో తెలుసా?

Published on Mon, 05/26/2025 - 10:04

ఒక వ్యక్తి జీవితంలో తల్లి, తండ్రి, గురువు– ఈ క్రమంలో ఈ ముగ్గురికీ అత్యంత గౌరవనీయమైన, పూజనీయమైన స్థానం ఇవ్వబడింది. జన్మనిస్తుంది కనుక తల్లి, జన్మకు కారకుడై, బాల్య, యవ్వన దశలలో పోషణ భారాన్ని వహించి, రక్షణను కలిగిస్తాడు కనుక  తండ్రి, విద్యాబుద్ధులు నేర్పి సత్కార్యోన్ముఖుడిని, ప్రయోజకుడిని చేస్తాడు కనుక గురువు... సదా పూజనీయులనే అభిప్రాయాన్ని పండితులు, పూర్వ సాహిత్యవేత్తలు ప్రజలకు కలిగించారు. ఈ భావాన్ని ధ్రువీకరించిన వ్యాసుడి మహా భారతం, తల్లిదండ్రులను, గురువును పూజించడం వలన సమకూరే అధ్యాత్మిక, పారలౌకిక ప్రయోజనాలను గురించి, అనుశాసనిక పర్వం, సప్తమాధ్యాయంలోని ఈ క్రింది శ్లోకం ద్వారా, స్పష్టం చేసి చెప్పింది.

యేన ప్రీణాతి పితరం తేన ప్రీతః ప్రజాపతిః
ప్రీణాతి మాతరం యేన పృథివీ తేన పూజితా.
యేన ప్రీణాత్యుపాధ్యాయం తేన స్యాద్‌ బ్రహ్మ పూజితమ్‌.

ఒక వ్యక్తి తన తండ్రిని ప్రసన్నుడిని చేయడం ద్వారా ప్రజాపతినీ, తన తల్లిని పూజించడం ద్వారా భూదేవినీ, తన గురువును తృప్తి పరచడం ద్వారా బ్రహ్మదేవుడినీ పూజించిన వాడు అవుతున్నాడు అని పై శ్లోకం భావం. అలా, ఏ వ్యక్తి తన తల్లిని, తండ్రిని,  గురువును గౌరవించడం, ఆదరించడం అన్న మూడు ధర్మాలను శ్రద్ధగా ఆచరిస్తాడో, ఆ వ్యక్తికి అన్ని ధర్మాలూ సక్రమంగా నిర్వర్తించబడిన ఫలం దక్కుతుందని, అలా కాక ఏ వ్యక్తి ద్వారా ఈ మూడు ధర్మాలు సరిగా ఆచరించబడక, అనాదరించబడతాయో, ఆ వ్యక్తి నిర్వర్తించే యజ్ఞయాగాది క్రియల వలన సమకూరే ఫలములన్నీ నిరుప యోగంగా, నిష్ఫలములుగా మారిపోతాయని కూడా ఆ సందర్భంలోనే పై శ్లోకానికి కొనసాగింపుగా చెప్పబడింది. 

మిగతా జీవితం ఎలా గడిచినా, వృద్ధాప్యంలో మనిషి తన సంతానం సహా యాన్నీ, ఆసరానూ కోరుకుంటాడు. ఆ రోజులలో, తాను కని, ప్రేమగా చూసుకుంటూ పెంచి, పెద్దచేసిన తన సంతానం చేతిలోనే అగౌరవానికి, నిర్లక్ష్యానికి గురికావడాన్ని మించిన మానసిక క్షోభ మనిషికి వేరే ఉండదు. వృద్ధాప్యంలో ఏ వ్యక్తికీ ఆ బాధ కలగకూడదన్న సదుద్దేశంతో చేసిన నియమాలు, చెప్పిన విషయాలు పైవి. మానవీయమైన ఈ ధార్మిక విధిని పాటించని సమాజానికి ఆధ్యాత్మిక పురోగతి
ఉండగలదనుకోలేము. 
– భట్టు వెంకటరావు
 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)