Breaking News

ఇక్కడ జిమ్‌లో చేరాలంటే నెలకు తొమ్మిది లక్షలు!

Published on Sat, 03/15/2025 - 10:05

#Continuum: జిమ్‌లో చేరాలంటే నెలకు ఎంత కడతాం? మిగిలిన చోట్ల ఎంత ఉన్నా, న్యూయార్క్‌ (NewYork) లోని గ్రీన్‌విచ్‌కి దగ్గరలోని ఒక గ్రామంలో కొంటినూమ్‌ (Continuum )అనే వెల్‌నెస్‌ సోషల్‌ క్లబ్‌లో జిమ్‌ చేయాలంటే అక్షరాలా 8000 పౌండ్లు కట్టాలి. గత ఏడాది ఏప్రిల్‌లో ఆరంభం అయిన ఈ జిమ్‌లో లగ్జరీ లాంజ్‌ ఉంది. సభ్యులకు ఫిట్‌నెస్‌ పెంచుకోవడం కోసం టాప్‌క్లాస్‌ జిమ్‌ తరగతులు జరుగుతుంటాయి. 25000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ వెల్‌నెస్‌ సెంటర్‌ 250 మంది సభ్యులకు మాత్రమే పరిమితం. చిత్రం ఏమిటంటే,  కళ్లు తిరిగేటంత సభ్యత్వ రుసుము కండలు పిండి మరీ వసూలు చేస్తున్నా కూడా ఇక్కడ మెంబర్‌షిప్‌ తీసుకోవడం కోసం వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్న వారి జాబితా చాలానే ఉందట. 

చదవండి: #WomenPower :హంపీ టెంపుల్‌లోని ఈ సారథుల గురించి తెలుసా?

ఇక్కడ చేరి శారీరక దృఢత్వాన్ని పెంచుకుంటున్న వారందరికోసం ఇంటి దగ్గర ఉండి మరీ కసరత్తులు చేసేందుకు ఆన్‌లైన్‌లో ప్రత్యేకమైన హోమ్‌ వర్క్‌ (వర్కవుట్లు చేయిస్తారట) కూడా ఇస్తారట. డబ్బు కట్టగానే ఇక్కడ సభ్యులకు పూర్తి వివరాలతో కూడిన ‘ఆన్‌బోర్డింగ్‌ అసెస్‌మెంట్‌’ ఉంటుంది. శరీరంలోని ప్రతి పార్ట్‌నూ స్కాన్‌ చేసి, ఉండవలసిన దానికన్నా హెచ్చుతగ్గులు ఏమైనా ఉంటే పరీక్షించి, వాటిని బ్యాలన్స్‌ చేసుకునేందుకు తగిన స్పెషల్‌ వర్కవుట్లు చేయిస్తారు. అంతేకాదు, శరీరంలో బ్లడ్‌ సర్క్యులేషన్‌ ఎలా ఉంది, ఆక్సిజన్‌ లెవెల్స్‌ ఎలా ఉన్నాయి, నిద్ర నాణ్యత ఎలా ఉంది... వంటి పరీక్షలన్నీ చేసి అందుకు తగ్గట్టు జిమ్‌ చేయిస్తారట. ఏమైనా.. పిండికొద్దీ రొట్టె అన్నట్టు మనం చెల్లించిన డబ్బుకు తగ్గట్టు వర్కవుట్లు చేయించి మన ఫిట్‌నెస్‌ను పరిరక్షిస్తారన్నమాట!

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)