Breaking News

ఒక్కరి మరణం తెచ్చిన కార్చిచ్చు..ఏకంగా 700 మందికి జైలు శిక్ష!

Published on Wed, 07/19/2023 - 15:42

ఫ్రాన్స్‌లో గత నెలలో ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించాడన్న ఆరోపణలపై ఒక యువకుడిపై పోలీసులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఆ ఘటన ఫ్రాన్స్‌ను ఒక్క కుదుపు కదుపేసింది. ఒక్కరాత్రిలో ఫ్రాన్స్‌ రణరంగంలా మారిపోయింది. మైనార్టిలపై పోలీసులు అకృత్యాలు కొత్తేమి కాదంటూ ప్రజాగ్రహం ఒక్కసారిగా కట్టలు తెచ్చుకుంది. ఆ యువకుడిని చంపడాన్ని నిరశిస్తూ పౌరులు పెను విధ్వంసమే సృష్టించారు. పోలీసులు కావలనే ఇలా చేశారంటూ ప్రజలు మండిపడ్డారు. ఒక్కసారిగా ఫ్రాన్స్‌లోని వివిధ ప్రాంతాలు ఉద్రిక్తంగా మారిపోయాయి.

 దీంతో వేలాది మంది యువతీయువకులు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.  ప్రభుత్వ ఆస్తులకు నిప్పు పెట్టారు. దీంతో దేశం ఒక్కసారిగా అగ్ని గుండలా మారిపోయింది. నాటి ఘటనలో పరిస్థితిని అదుపు చేసేందకు పోలీసులు వేలాదిమందిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై పలు ఆరోపణలు మోపి అరెస్టు చేశారు. ఈ మేరకు ఫ్రాన్స్‌ కోర్టుల వారిపై మోపిన అభియోగాలను విచారించి నాటి ఘటనలో అల్లర్లకు పాల్పడిని సుమారు 700 మందికి జైలు శిక్ష విధించింది.

వారంతా పోలీసు అధికారులపై దాడిచేయడం, ప్రభుత్వా ఆస్తులను పాడుచేయడం తదిత వాటిల్లో దోషులుగా నిర్థారించి ఈ శిక్ష విధించింది న్యాయస్థానం. ఈ మేరకు న్యాయశాఖ మంత్రి మాట్లాడుతూ..న్యాయస్థానం నాటి ఘటనపై సీరియస్‌గానే స్పందించింది. దేశ శాంతి భద్రతలకే కోర్టు ప్రాముఖ్యతనిస్తుంది. ఇలాంటి విషయంలో కోర్టు కఠినంగానే వ్యవహరిస్తుందని అన్నారు. కాగా,  ఫ్రాన్స్‌లో ఇలాంటి ఘటనలు కొత్తేమి గాదు గతంలో కూడా ఇలాంటి పలు ఉదంతాలు చోటు చేసుకోవడం గమనార్హం. 

(చదవండి: అమ్మా! తల్లి ఏం డేరింగ్‌?..ఏకంగా సింహంతో ఒకే ప్లేట్‌లో..)

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌