Breaking News

తెలిసి చెడు కర్మలు చేయకుండా ఉండటమే కర్తవ్యం

Published on Mon, 07/07/2025 - 11:42

జీవులు అనుభవించే మంచి చెడు ఫలితాలకు వాళ్ళు గతంలో చేసిన కర్మలే కారణమన్నది భగవద్గీత సారాంశం. అయినా, మనుషులు మాయలో పడి, తమకు జరిగే అనుభవాలకు ఇతరులెవరో కారణం అని భావిస్తారు. 

భీష్మునితో ధర్మరాజు... ‘పట్టుదలతో చుట్ట పక్కాలను చంపుకున్నాను. దుర్యోధనుడు రాజ్యం పంచుకోవటానికి ఇష్ట పడలేదు. నేనైనా కోపం మాని, అతడిని రాజ్యం అనుభవించనీయలేదు. మా ఇద్దరి వల్ల ఇంత జన నష్టం జరిగింది’ అని బాధ పడ్డాడు. అప్పుడు భీష్ముడు ‘చంపటానికి మనిషి కర్త కాడు’ అని ఉదాహరణ పూర్వకంగా ఒక కథ చెపుతాడు.

గౌతమి అనే వనిత కుమారుడు పాము కాటుకు చనిపోతాడు. ఆమె దుఃఖిస్తుండగా ఒక వేటగాడు ఆ పామును చంపబోయాడు. ఆమె వారించి, ‘పామును చంపితే నా బిడ్డ బతుకుతాడా? శత్రువునైనా చేత చిక్కితే చంపటం న్యాయం కా’దంది.

పాము తాను మృత్యు దేవత పంపగా వచ్చాను కానీ, స్వయం కర్తను కాదంది. అంతలో మృత్యువు వచ్చి, తాను యముడు పంపగా వచ్చానని, తాను ఆ బాలుడి మరణానికి కారణం కాదంది. యమధర్మరాజు వచ్చి... పాము, మృత్యువు, తాను ఈ బాలుడి మరణానికి కారణం కాము; అతడి కర్మలే కారణం. జీవుడు కర్మఫలాన్ని తప్పించుకోలేడని చెబుతాడు. వేటగానికి జ్ఞానోదయమై వెళ్ళిపోతాడు. కాబట్టి, ‘యుద్ధంలో బంధు మిత్రులు మరణించటానికి వారి కర్మలే కారణం కానీ, నీవు గానీ, దుర్యోధనుడు గానీ కారణం కాదు’ అని భీష్మ పితామహుడు చెప్పాడు.  తెలిసి చెడు కర్మలు చేయకుండా ఉండటమే మనుషుల కనీస కర్తవ్యం. 
– డా.చెంగల్వ రామలక్ష్మి

#

Tags : 1

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు