Breaking News

మాన్సూన్‌లో మోటార్‌ రైడ్స్‌..!

Published on Mon, 06/16/2025 - 09:45

వర్షాలు మబ్బుల్లోంచి కురిసే మధుర గీతాల్లా వినిపిస్తున్న ఈ మాన్సూన్‌ సీజన్‌కు నగర యువత నుంచి ప్రత్యేక స్వాగతం లభిస్తోంది. సాధారణంగా జూన్‌ రెండో వారం నుంచి మొదలయ్యే ఈ సీజన్, ఈసారి కాస్త ముందస్తుగానే ప్రారంభమైంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈసారి తక్కువ ఉష్ణోగ్రతలతో, ఎక్కువ మోస్తరు వర్షపాతం నమోదవుతుందనే ఊహతో యువతలో ప్రకృతిని ఆస్వాదించే ఆసక్తి భారీగానే పెరిగింది. నగరవాసులు ముఖ్యంగా యువత ఈ చల్లని మబ్బులు, మత్తెక్కించే వర్షపు వాసన, హత్తుకునే పచ్చటి ప్రకృతి దృశ్యాలు అన్నింటినీ ఆస్వాదించేందుకు గ్రూప్‌ రైడ్స్, ఔటింగ్స్, నేచర్‌ ట్రిప్‌లతో సందడి చేస్తున్నారు.  
   
సోషల్‌ మీడియా యుగంలో ప్రతి చినుకూ శీర్షికే..!! రీల్స్, స్టోరీస్, వ్లాగ్స్‌..ఇవన్నీ మాన్సూన్‌ థీమ్‌తో నిండిపోతున్నాయి. వర్షపు నీటిలో కళ్లకు తక్కువ కనిపించే పొగమంచు, డ్రోన్లతో తీసిన పచ్చటి దృశ్యాలు వీరిని ఆహ్లాదపరిచేలా ఉంటున్నాయి. మాన్సూన్‌ కేవలం వర్షపు చినుకుల సంగతి మాత్రమే కాదు.. ఇది ఒక మూడ్, ఒక ఉల్లాసం, రిలాక్సేషన్‌. పని ఒత్తిడి నుంచి కొన్ని గంటలు బయటపడేందుకు ఇదో సువర్ణావకాశం. 

హైదరాబాద్‌ యువత దీన్ని అందుకుంటోంది. ప్రకృతిని హత్తుకునేలా, జీవితాన్ని మరొక కోణంలో చూసేలా మాన్సూన్‌ సీజన్‌ మనల్ని ప్రేరేపిస్తోంది. హైదరాబాద్‌ శివార్లలోని అనంతగిరి హిల్స్, సంఘీ టెంపుల్‌ పరిసర ప్రాంతాలు, శామీర్‌పేట్‌ లేక్‌ వంటి ప్రాంతాలు డ్రైవ్‌ డెస్టినేషన్లుగా మారాయి. వారం చివరి రోజుల్లో ఈ ప్రాంతాలకు వెళ్లేవారి సంఖ్య రెండింతలు పెరిగింది. 

శివార్లలో ఇప్పుడిప్పుడే మొలకలొస్తున్న పొలాలు, మబ్బుల్లో నలుగుచేసే కిరణాలు, మోస్తరు జల్లుల్లో సాగే డ్రైవ్‌లు.. ఇవన్నీ యువత హృదయాలను తాకుతున్నాయి. వీకెండ్స్‌లో అయితే ఇంకొంచెం దూరమైనప్పటికీ నాగార్జున సాగర్, లక్నవరం వంటి ప్రాంతాలకు సైతం షార్ట్‌ ట్రిప్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు.  

వనాలవైపు పయనం.. 
సిటీ రైడింగ్‌కి అలసిన వారు మృగవాని పార్కులకు, అనుమతి ఉన్న శివార్ల అడవులకు, ఫారెస్ట్‌ ట్రెయిల్స్‌కు వెళ్లే ట్రెండ్‌ బాగా పెరిగింది. నగరం నుంచి మంచిర్యాల కవ్వల సర్వాయ్‌ ఫారెస్ట్, అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్, భాన్సువాడ గ్రీన్‌ కవర్‌ వంటి ప్రాంతాలు ఈ లిస్ట్‌లో చేరిపోతున్నాయి. ఇవన్నీ పచ్చదనంతో కళకళలాడుతున్న ప్రదేశాలుగా పేరుగాంచుతున్నాయి. ఇక్కడ వన్యప్రాణులను పరిశీలిస్తూ, వాన జల్లుల్లో నడకలు వేసేలా యూత్‌ ట్రెక్కింగ్‌ ప్లాన్‌ చేసుకుంటున్నారు.  

నగరంలో మాన్సూన్‌ మ్యాజిక్‌.. 
నగరం వదిలి వెళ్లలేని వారు కూడా తక్కువ సమయంలో ట్యాంక్‌ బండ్, హుస్సేన్‌ సాగర్, కేబీఆర్‌ పార్క్, దుమ్ముగూడ చెరువు వంటి ప్రదేశాలకు వెళుతున్నారు. ప్రత్యేకించి ప్రకృతి ప్రేమికులు, యువత, విద్యార్థులు, ఫొటోగ్రాఫర్స్‌ ఈ వర్షపు సీజన్‌ను కలర్‌ఫుల్‌గా మార్చేస్తున్నారు. 

ఇక నెక్లెస్‌ రోడ్డుపై సైక్లింగ్, బంజారాహిల్స్‌ కెఫేలో రేయిన్‌ వ్యూ టేబుల్స్, టెర్రస్‌ కాఫీ డేట్‌లు, రోడ్డు పక్కన స్వీట్‌కార్న్‌ బండ్లు, షావర్మ స్టాల్స్‌.. ఇవన్నీ మాన్సూన్‌ ఎక్స్‌పీరియన్స్‌. ఈ వర్షాల సీజన్‌కి సోషల్‌ మీడియా జనరేషన్‌ తమదైన హ్యాష్‌ట్యాగ్‌లు తయారుచేస్తోంది. 

హ్యాష్‌ రేయిన్‌రైడ్, హ్యాష్‌ మాన్సూన్‌మూడ్, హ్యాష్‌ చినుకులు క్రానికల్స్‌ లాంటి క్యాప్షన్లతో యువత సోషల్‌ మీడియాను మాన్సూన్‌ డైరీగా మార్చేస్తోంది. మాన్సూన్‌ ఏక కాలంలో రిలీఫ్, రొమాన్స్, రిఫ్రెష్‌మెంట్‌ తీసుకురావడమే కాదు, జీవితం కొంత నెమ్మదిగా, ప్రశాంతంగా సాగేలా చేస్తుంది.  

(చదవండి: 62 ఏళ్ల వయసులో నలుగురికీ స్ఫూర్తిగా..! ఏకంగా 136 సార్లు..)

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)