Breaking News

ఆటిజం పిల్లలను పెంచే పేరెంటింగ్‌ టిప్స్..! వైరల్‌గా ఓ తల్లి గైడెన్స్‌..

Published on Fri, 07/03/2026 - 13:15

న్యూరోడైవర్జెంట్ పిల్లలను పెంచడం అనేది అత్యంత సవాళ్లతో కూడుకున్నది. అయితే వీళ్ల పెంపకం ప్రతి పేరెంట్‌కు.. భావోద్వేగాలు, అనుబంధం, నమ్మకం వంటి వాటిని అర్థం చేసుకోవడానికి కొత్త మార్గాలను అందిస్తుంని అంటున్నారు కంటెంట్‌ క్రియేటర్‌ ఫాతిమా. ఆమె తన ఆటింజ ఉన్న కొడుకుతో ఒక అద్భుతమైన పేరెంటింగ్‌ టిప్‌ని పంచుకున్నారు. ఆ వీడియోలో ఒక జర్నీ దృశ్యాన్ని పంచుకున్నారు. అలాంటి ఆటిజం పిల్లల పెంపక విధానంలో నియంత్రణ, భావోద్వేగ భద్రత, సహనం ప్రాముఖ్యతలను నొక్కి చెబుతోంది. ఇవి అలాంటి పిల్లల పెంపకంలో అత్యంత కీలకమైనవి అంటూ..ఇలా వివరించింది పోస్ట్‌లో.

ఆటిజం ఉన్న పిల్లలకు పెద్ద శబ్దాలు, పరిచయం లేని ముఖాలు, ఆకస్మిక ఇంద్రియ మార్పుల కారణంగా బహిరంగ ప్రదేశాలు తరచుగా ఆందోళనను ప్రేరేపిస్తాయి. తద్వారా వాళ్లు విపరీతమైన ఒత్తిడికి గురవ్వుతారు. దాన్నే కంటెంట్‌ క్రియేటర్‌ తన ఆటిజం కొడుకు జర్నీలో ఎలా ఫీలవ్వుతున్నాడో వీడియోలో స్పష్టంగా చూపిస్తుంది. ముందుగా ఆ ఒత్తిడిని తగ్గించేలా..వాళ్లకు సురక్షితమైన ప్రదేశాన్ని కనుగొనాలి, ఆ తర్వాత అతని చుట్టూ ఉన్నవారికి ఎలాంటి హాని జరగకుండా చూసుకోవాలని నొక్కి చెబుతున్నారు. 

" వీడియోలో ఆ కార్యక్రమంలో మొట్టమొదటగా చేయాల్సింది బిడ్డకు ప్రశాంతమైన వాతావరణాన్ని అందించడం. శారీరక, భావోద్వేగ భద్రత రెండూ ఆటిజం పెంపకానికి గట్ట పునాది. అందుకోసం కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ చేయమని ప్రోత్సహించాలి. ఇది కేవలం లెక్కించడం కాదు, ఆటిజం ఉన్న పిల్లలకు సూచనలను లేదా భావోద్వేగ మార్పులను గ్రహించడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల ఇలా కౌంట్‌డౌన్‌ సంభాషణ బలవంతం కాకుండా తమకేదో సహాయం చేస్తున్నారనే భరోసా అందిస్తుంది వాళ్లకు. 

ఆ తర్వాత కొవ్వొత్తి ఊదే పద్ధతిని ఫాలో అవ్వాలి. చిన్నారికి తన శ్వాసను నెమ్మదింప చేసేలా కొవ్వొత్తి ఊదుతున్నట్లు చేయమని చెప్పాలి. ఇది శరీరం ఒత్తిడి ప్రతిస్పందనను నియంత్రించడంలో సహాయపడుతుంది. పైగా ఆ చిన్నారి ఒక అంశంపై దృష్టిపెట్టేలా చేస్తుంది కూడా. ఆ తర్వాత ఆ చిన్నారిని దగ్గరకు తీసుకుని హగ్‌ చేసుకోవాలి. ఇక్కడ వాళ్లకు సహ నియంత్రణ అనే భావోద్వేగ సమతుల్యతను అందిచడానికి వాళ్లను ఆలింగనం చేసుకోవాలి. అది వాళ్లకు సురక్షితంగా ఉన్నావు, మనం వాళ్లతో ఉన్నామనే ఫీల్‌ని అందిస్తుందట. 

ఇలాంటి దృశ్య, శారీరక సంకేతలు ఆటిజం ఉన్న పిల్లల్లో భావోద్వేగ నియంత్రణను సులభతరం చేస్తాయి." అంటూ తన వీడియోని ముగించింది లియా ఫాతిమా. ఆమె పేరెంటింగ్‌ చిట్కా..అలాంటి బిడ్డల పట్ల ఓర్పు, సానుభూతి, భావోద్వేగ భద్రత ఎంత అవసరమో తెలియజేయడమే కాకుండా..ఆటిజం ఉన్న పిల్లల పెంపకానికి సృజనాత్మకత, సౌమ్యత, అవగాహన అవసరం అని నొక్కి చెబుతోంది. చూడటానికి సింపుల్‌గా కనిపించే ఈ టెక్నిక్‌లు..ఆటిజం పిల్లల్లో అద్భుతమైన మార్పుని తీసుకొచ్చే అద్భుత సాధనాలు కదూ..!.

 

(చదవండి: పేదరికం మేకలు కాయిస్తే.. జానపద కళతో పద్మశ్రీ వరించింది)
 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)