Breaking News

మొలకెత్తిన గింజలతో వడలు చేయ‌డం వ‌చ్చా?

Published on Sat, 11/29/2025 - 19:33

ఆరోగ్యానికి మేలు చేసే మొలకెత్తిన గింజలను రోజూ ఒక కప్పు తినమని వైద్యులు సూచిస్తుంటారు. అయితే, వాటిని పచ్చి మొలకలుగానే తీసుకోలేరు. ఇలాంటప్పుడు వివిధ రకాల గింజధాన్యాల మొలకలతో వంటకాలను తయారుచేసుకొని, ఇంటిల్లిపాదికీ రుచినీ, ఆరోగ్యానీ పంచవచ్చు. మొలకలతో చేసిన వంటకాలతో ఈ వారం వంటిల్లు.

మొలకల వడ
కావల్సినవి: మొలకెత్తిన పెసర్లు –1 కప్పు; మొలకెత్తిన శనగలు – అర కప్పు; ఉల్లిపాయ – 1 (సన్నగా తరగాలి); పచ్చిమిర్చి – 2 (సన్నగా తరగాలి); అల్లం – చిన్న ముక్క (సన్నగా తరగాలి); కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు; బియ్యప్పిండి – 2 టేబుల్‌ స్పూన్లు; నూనె – వేయించడానికి తగినంత; శనగపిండి – 2 టేబుల్‌ స్పూన్లు; ఉప్పు – రచికి సరిపడా.

తయారీ: 
మొలకెత్తిన పెసర్లు, శనగలను మిక్సీ జార్‌లో వేసి, కొద్దిగా బరకగా గ్రైండ్‌ చేయాలి 
గ్రైండ్‌ చేసిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని, అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, బియ్యప్పిండి, శనగపిండి, ఉప్పు వేసి బాగా కలపాలి 
ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న వడలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి 
కడాయిలో నూనె వేడి చేసి, వడలను బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి 
వేయించిన వడలను టిష్యూ పేపర్‌ వేసిన ప్లేట్‌లోకి తీసుకోవాలి 
పుదీనా చట్నీ లేదా టొమాటో సాస్‌తో వేడి వేడిగా వడ్డించాలి.

స్ప్రౌట్స్‌ కిచిడీ
కావల్సినవి: మొలకెత్తిన పచ్చి శనగలు – ఒకటిన్నర కప్పు; బియ్యం – కప్పు; నెయ్యి – టీ స్పూన్‌; జీలకర్ర – టీ స్పూన్‌; దాల్చిన చెక్క – చిన్న ముక్క; పసుపు – అర టీ స్పూన్‌; మిరియాల పొడి – అర టీ స్పూన్‌; పచ్చిమిర్చి – 3 (నిలువుగా చీల్చినవి); క్యారెట్లు – 2 (సన్నని, చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి); క్యాలీఫ్లవర్‌ – 1 (చిన్నది. గుత్తులుగా ఉన్నవి, కట్‌ చేసుకోవాలి); ఉప్పు – రుచికి సరిపడా.

తయారీ: 
బాణలిలో నెయ్యి వేసి, వేడయ్యాక జీలకర్ర, దాల్చిన చెక్క, పసుపు, మిరియాలపొడి, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తర్వాత క్యారెట్‌ ముక్కలు, క్యాలీఫ్లవర్‌ ముక్కలు వేసి, వేయించాలి 
నానబెట్టిన బియ్యాన్ని వడకట్టి వేగుతున్న మిశ్రమంలో వేయాలి. రుచికి తగినంత ఉప్పు వేసి, రెండున్నర కప్పుల నీళ్లు పోసి కలపాలి 
బియ్యం ఉడుకుతుండగా స్ప్రౌట్స్‌ వేసి, మంటను తగ్గించి, ఉడకనివ్వాలి. మధ్య మధ్య కలుపుతూ కిచిడీ మెత్తగా అయ్యేవరకు ఉడికించి, దించి వేడి వేడిగా వడ్డించాలి.

స్ప్రౌట్స్‌ చాట్‌
కావల్సినవి: మొలకెత్తిన మినప్పప్పు – కప్పు; దోసకాయ – 1 (సన్నని ముక్కలుగా కట్‌ చేసుకోవాలి); టమోటా – 1 (సన్నని ముక్కలుగా కట్‌ చేసుకోవాలి); ఉల్లిపాయ – 1 (సన్నని ముక్కలుగా కట్‌ చేసుకోవాలి); పచ్చిమిర్చి – 2  (నిలువుగా చిన్నముక్కలుగా కట్‌ చేసుకోవాలి); కొత్తిమీర తరుగు – టేబుల్‌ స్పూన్‌; బంగాళాదుంప – 1 (ఉడికించి, ముక్కలుగా కట్‌ చేసుకోవాలి); ఉప్పు – రుచికి సరిపడా ; జీలకర్ర పొడి – ఒకటిన్నర స్పూన్‌; ధనియాల డి – పావు టీ స్పూన్‌; కారం – పావు టీ స్పూన్‌; నిమ్మకాయ – అర ముక్క రసం; చిక్కటి చింతపండు పేస్ట్‌ – 2 టేబుల్‌ స్పూన్లు; (చింతపండు, ఉప్పు, మిర్చి.. తగినంతగా చూసుకోవాలి).

తయారీ: 
ఒక పెద్ద గిన్నెలో పైవన్నీ వేసి బాగా కలపాలి 
చివరగా నిమ్మరసం పిండి, కొత్తిమీర చల్లి, సర్వ్‌ చేయాలి.

చికెన్ పెప్ప‌ర్ ర‌సం త‌యారు చేసే విధానం

బీన్స్‌ సలాడ్‌
కావల్సినవి: వైట్‌ బీన్స్‌ (మొలకెత్తిన బొబ్బర్లు) – ఉడికించినవి అర కప్పు; ఉల్లిపాయ తరుగు – పావు కప్పు; టమోటా –1 సన్నగా తరిగినది; ఎండు మిర్చి – 1; ఆవాలు – పావు స్పూన్‌; పసుపు – పావు టీ స్పూన్‌; ఓట్స్‌ – పావు కప్పు; ఉప్పు – తగినంత; గరం మసాలా లుదా పావ్‌ భాజీ మసాలా – అర టీ స్పూన్‌.

తయారీ: 
కడాయిలో నూనె వేడి చేసి, ఆవాలు చిలకరించి, ఎండు మిర్చి ముక్కలను వేసి, కొన్ని సెకన్ల పాటు వేయించాలి 
ఉల్లిపాయలను వేసి, వేయించి, తరువాత టమోటాలు వేసి ఒక నిమిషం వేయించాలి 
మొలకెత్తిన బొబ్బర్లు, నీళ్లలో వేసి, గట్టిగా పిండిన ఓట్స్‌ వేసి కలపాలి 
చివరగా మసాలా, ఉప్పు వేసి కలపాలి. ఓట్స్‌ ఉడుకుతున్నప్పుడు అదనపు నీటిని పీల్చుకుంటాయి 
సర్వింగ్‌ బౌల్‌ లోకి తీసి, వేడి వేడిగా సర్వ్‌ చేయాలి. 

#

Tags : 1

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)