Breaking News

యస్‌... ఇది గణేష్‌ బండి!

Published on Fri, 08/15/2025 - 10:16

‘అవసరమే ఆవిష్కరణకు దారి చూపిస్తుంది’ అనే మాట తెలంగాణ రాష్ట్రం ముస్తాబాద్‌ మండలం సేవాలాల్‌తండాకు చెందిన లకావత్‌ గణేశ్‌ విషయంలోనూ నిజమైంది. పుట్టుకతో పోలియోతో రెండు కాళ్లు చచ్చుపడిపోయిన గణేశ్‌ ఎనిమిదో తరగతి వరకు చదివాడు. సెల్‌ఫోన్‌  రిపేరును సొంతంగా నేర్చుకొని ఇంట్లోనే షాపు పెట్టుకున్నాడు.  

ప్రభుత్వం ద్వారా వచ్చిన మూడు చక్రాల బండి తరచూ రిపేరుకు రావడం, ఎత్తైన ప్రదేశాలు ఎక్కలేక పోవడంతో గణేశ్‌ ఇబ్బంది పడ్డాడు. విడిభాగాలు కాలిపోవడంతో బండిని మూలన పడేశాడు. అప్పటి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా మరొకరు సాయం చేసే వారు. 

కొన్నిసార్లు ఎవరూ సాయం రాకపోవడంతో గణేశ్‌ ఆలోచన మూడు చక్రాల బండిపై పడింది. దీంతో ఒక సైకిల్‌ కొని దానికి బ్యాటరీ, మోటర్‌ బిగించాడు. కొన్ని విడిభాగాలను ఆన్‌లైన్‌లో, మరికొన్నింటిని ముస్తాబాద్‌లో కొనుగోలు చేశాడు. వాటిని సైకిల్‌కు బిగించి బ్యాటరీతో సులభంగా నడిచేలా ప్రయోగం చేశాడు. 

అది విజయవంతం కావడంతో ఆ బ్యాటరీ సైకిల్‌పై తిరుగుతూ తన పనులు చక్కబెట్టుకుంటున్నాడు. ప్రభుత్వం సాయం అందిస్తే మరిన్ని ప్రయోగాలు చేస్తానని ఎంతో ఆత్మ విశ్వాసంతో చెబుతున్నాడు గణేశ్‌.
– అవదూత బాలశేఖర్, సాక్షి, ముస్తాబాద్‌ 

(చదవండి: స్వేచ్ఛా తరంగాలు..! నవతరానికి స్ఫూర్తి ఈ నారీమణులు..)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)