Breaking News

భార్య..భర్త..ఓ మిడ్‌ వైఫ్‌..!

Published on Sun, 06/29/2025 - 12:11

నగరంలో ఇటీవల సహజ (నేచురల్‌) డెలివరీకి ప్రాధాన్యతతో పాటు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, ‘మిడ్‌ వైఫ్‌’ పేరిట ఓ ప్రాచీనమైన విధానమే తనదైన ఆధునిక రూపంలో విస్తృతంగా అందుబాటులోకి వస్తోంది. గర్భిణులకు మరింత సురక్షితమైన, మందుల రహితమైన, హాస్పిటల్‌ ఆధారిత,  సిజేరియన్‌ డెలివరీలకు ప్రత్యామ్నాయంగా ఈ మిడ్‌ వైఫ్‌ సేవలు నగరంలో వేగంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. 

ఒకప్పుడు అంటే మన అమ్మమ్మల కాలంలో మంత్రసాని పేరిట కాన్పులు చేసే మహిళలు ఉండేవారు. ఏ శిక్షణా లేకపోయినా వంశపారంపర్య వృత్తిగా వీరు అత్యంత చాకచక్యంగా ఇంటికి వచ్చి మరీ తమ సేవలు అందించేవారు. ఇప్పుడు దాదాపు అదే కాన్సెప్‌్టతో మిడ్‌ వైఫ్‌ గా తిరిగి ఆధునికులకు చేరువైంది. మిడ్‌ వైఫ్‌ అంటే ప్రత్యేక శిక్షణ పొందిన ప్రసూతి నిపుణురాలు అని పేర్కొనవచ్చు. 

వీరు గర్భిణులు, మహిళలకు గర్భధారణ నిర్ధారితమైన దగ్గర నుంచి సహజ ప్రసవం వరకూ వెన్నంటి ఉంటారు. అంతేకాదు వీరు ప్రసవానంతర కాలంలో సహాయం చేస్తారు. నేచురల్‌ బర్త్‌కు వీరు అత్యంత ప్రోత్సాహం ఇస్తారు. ప్రసవ సమయంలో ప్రత్యక్ష పర్యవేక్షణ, భావోద్వేగ సహాయం అవసరమైన మద్దతునూ అందిస్తారు. 

ప్రత్యేక ఆస్పత్రులు సైతం.. 
నగరంలో పలు కార్పొరేట్‌ ఆస్పత్రులతో పాటు మిడ్‌ వైఫ్‌ సేవలు అందించే ప్రత్యేక ప్రసవ కేంద్రాలు సైతం ఏర్పాటవ్వడం విశేషం. గచి్చ»ౌలి, బంజారాహిల్స్, మాదాపూర్‌ వంటి సంపన్న నివాస ప్రాంతాల్లోనే ఇవి ఎక్కువగా నెలకొన్నాయి. కొన్ని ప్రసూతి కేంద్రాలు, డౌలా క్లినిక్స్, బర్తింగ్‌ సెంటర్లు ఇప్పుడు మిడ్‌ వైఫ్‌ సేవలను అందుబాటులోకి తెచ్చాయి. వీటిలో బర్త్‌ విలేజ్, ఫెర్నాండెజ్‌ ఫౌండేషన్, హెల్తీ మదర్‌ బర్త్‌ సెంటర్, ది సాంక్టమ్‌ నేచురల్‌ బర్త్‌ సెంటర్‌. వంటివి కొన్ని కేంద్రాల్లో మిడ్‌ వైఫ్‌ లు గర్భిణులకు సరైన ఆహార మార్గదర్శనం, ప్రీ–నాటల్‌ కౌన్సిలింగ్, ప్రసవ వ్యాయామాలు, మెడిటేషన్‌ తరగతులు, ఎమోషనల్‌ సపోర్ట్‌ కూడా అందిస్తున్నారు. 

మిడ్‌ వైఫ్‌ విధానానికి కారణాలివే.. 
డాక్టర్‌ ఆధారిత హాస్పిటల్‌ ప్రసవాల్లో అధిక జోక్యం, అధిక మందుల వాడకం పట్ల విముఖత కలిగిన వారు, ఎట్టి పరిస్థితుల్లోనూ సిజేరియన్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నవారు, సహజమైన, వ్యాధుల రహిత ప్రసవాన్ని ప్రసవానంతర సేవలు కోరుకునే వారు వీరిని ఎంచుకుంటున్నారు. 

ప్రభుత్వాస్పత్రుల్లోనూ.. 
నగరానికి చెందిన ఫెర్నాండెజ్‌ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో 2011లో దేశంలో మొట్టమొదటి మిడ్‌ వైఫ్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభమైంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా మిడ్‌ వైఫ్‌ విధానాన్ని ప్రభుత్వాస్పత్రుల వరకూ విస్తరించే దిశగా పరిశీలన చేస్తోంది. 

ఇటీవల నేషనల్‌ మిడ్‌ వైఫ్‌ కోర్సులు సైతం ప్రారంభమయ్యాయి. దీని వల్ల కొత్తగా ట్రైనింగ్‌ పొందిన మిడ్‌ వైఫ్స్‌ ఈ రంగంలోకి వస్తున్నారు. ఏదేమైనా నేచురల్‌ డెలివరీల పట్ల పెరుగుతున్న అవగాహన, ఆసక్తి వల్ల మిడ్‌ వైఫ్‌ విధానం నగరవాసులకు ఒక ఆరోగ్యకరమైన, భావోద్వేగపూరితమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. 

సేవల ధరలు ఇలా.. 
ఈ మిడ్‌ వైఫ్‌ సేవలు అందుకోవాలనుకునే వారి కోసం ప్రాథమిక ప్యాకేజీ రూ.40,000 నుంచి రూ.70,000 వరకూ ఉన్నాయి. ఇందులో గర్భధారణ సమయంలో రెగ్యులర్‌ కన్సల్టేషన్, 8–10 విజిట్లు, ప్రీ నాటల్‌ కౌన్సిలింగ్, బర్త్‌ ప్లాన్‌ తయారీ, ప్రసవ సమయంలో మిడ్‌ వైఫ్‌ సపోర్ట్‌ (ఇన్‌–సెంటర్‌), పోస్ట్‌నాటల్‌ ఫాలో–అప్‌ (1 లేదా 2 విజిట్లు) వంటివి ఉంటాయి. అలాగే అడ్వాన్స్‌డ్‌ బర్తింగ్‌ సెంటర్‌ ప్యాకేజీ : రూ.80,000 నుంచి రూ.1,50,000 వరకూ ఛార్జ్‌ చేస్తారు. 

దీనిలో ఉమెన్‌ ఎడ్యుకేషన్‌ సెషన్స్‌ లామాజ్‌ / బెర్తింగ్‌ క్లాసెస్‌ వాటర్‌ బర్త్‌ ఎంప్షన్, ఇంటిగ్రేటెడ్‌ డౌలా (పోషక సహాయం) సపోర్ట్, బర్తింగ్‌ టబ్, సౌండ్‌ థెరపీ, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటాయి. అదే విధంగా హోం బర్త్‌ ప్యాకేజీ ఎంచుకుంటే రూ.1,20,000 – రూ.2,00,000 వరకూ ఖర్చు అవుతుంది. దీనిలో భాగంగా మిడ్‌ వైఫ్‌ + అసిస్టెంట్‌ బృందం ఇంటికి వస్తారు. 

మానిటరింగ్‌ ఎక్విప్‌మెంట్‌ అమరుస్తారు. అత్యవసర జాగ్రత్తల కోసం  హాస్పిటల్‌ సపోర్ట్‌.. వంటివి ఉంటాయి. కొందరు మిడ్‌ వైఫ్స్‌ వ్యక్తిగతంగానూ సేవలు అందిస్తూ తమ ప్రతి విజిట్‌కూ రూ.2,000 నుంచి రూ.4,000 మధ్య ఛార్జ్‌ చేస్తున్నారు.  ప్రస్తుతానికి ఆరోగ్య బీమా సంస్థలు మిడ్‌ వైఫ్‌ సేవలను కవరేజ్‌ ఇవ్వడంలేదు. దీంతో  కొన్ని బర్తింగ్‌ సెంటర్లు తమదైన పాలసీలను కూడా అందిస్తున్నాయి. 

( చదవండి: హార్ట్‌ ఫెయిల్యూర్‌ అంటే..? ఈ పరిస్థితి ఎందువల్ల వస్తుంది..)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)