Breaking News

సమానత్వం..  సాధికారత సాధిస్తా!

Published on Mon, 06/02/2025 - 06:12

హాసెట్‌ డెరెజె అడ్మస్సు రెండవ స్థానంలో నిలిచి మిస్‌ వరల్డ్‌ చరిత్రలో అత్యున్నత ర్యాంకింగ్‌ సాధించింది. ఇథియోపియా దేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన ఈ అందాలభామ, ఫస్ట్‌ రన్నర్‌–అప్‌గా , మిస్‌ వరల్డ్‌ ఆఫ్రికా టైటిల్‌ను గెలుచుకున్నారు. కెమికల్‌ ఇంజినీరింగ్‌ చేస్తున్న పంతొమ్మిదేళ్ల హాసెట్‌ దక్షిణాఫ్రికాలో జరిగిన మిస్‌ టీన్‌ ఇథియోపియా, కిందటేడాది మిస్‌ వరల్డ్‌ ఇథియోపియా  పోటీలో విజేతగా నిలిచారు. 

ఇథియోపియాలోని మహిళల విద్య, ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా ఆమె సమాజంలో సానుకూల మార్పులు తీసుకు రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రామీణ సమాజాలలో తల్లీబిడ్డల ఆరోగ్యం, బాలికల విద్యపై దృష్టి సారించిన ఆమె ‘‘బ్యూటీ విత్‌ ఎ పర్పస్‌’’ ప్రాజెక్ట్‌ న్యాయమూర్తులను, ప్రేక్షకులను ఆకట్టుకుంది.

నా పనే నా కిరీటం
కిరీటం మరొకరికి వెళ్లచ్చు. కానీ, నా అంతర్గత అందం నేను చేసే పనిపైనే ఉంటుంది. అదే నాకు కిరీటం. స్థానికంగా, అంతర్జాతీయంగా ఆరోగ్య సమానత్వం, లింగ సాధికారత కోసం ఒక గొంతుకగా పనిచేస్తాను. ఈ  పోటీలలో  పాల్గొనడం ద్వారా భారతీయ సంప్రదాయ, సాంస్కృతిక పరిమళాన్ని అర్థం చేసుకున్నాను. ఆస్వాదించాను. ఈ ఫీలింగ్‌ చాలా సంతోషంగా ఉంది. ఓ పా గురించి చె ప్పాలంటే తను చాలా హార్డ్‌ వర్కర్‌. నేను తనకు చాలా పెద్ద అభిమానిని. తనకు కిరీటం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. తనలో భిన్నమైన క్వాలిటీస్‌ ఉన్నాయి. నిజానికి అందం అంటే అందరూ అనుకుంటున్నట్టు చర్మం, జుట్టు, గోళ్లు, డ్రెస్సింగ్‌.. ఇవి కావు. మన చుట్టూ ఉన్న సమాజం కోసం పనిచేయడమే. మా పేరెంట్స్‌ నా ఎదుగుదల కోసం ఎంతో కృషి చేశారు. నా ఈ విజయానికి నా కుటుంబ మద్దతు ఎంతో ఉంది.

మానసిక ఆరోగ్యంపై అవగాహన కోసం...
ఇథియోపియాలో మానసిక ఆరోగ్యంపై ప్రజలలో అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నాను. మాయా చారిటబుల్‌ ఆర్గనైజేషన్‌ కు అంబాసిడర్‌గా ఉంటూ ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తున్నాను. మిస్‌ వరల్డ్‌ అనేది కేవలం అందానికి సంబంధించినది మాత్రమే కాదు. నా దేశం నుంచి ఈ స్థాయికి చేరిన తొలి ఇథియోపియన్‌ నేనే. మిస్‌ వరల్డ్‌ ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం, ఇది ప్రపంచవ్యాప్తంగా తల్లులు, వారి పిల్లల జీవితాలలోనూ స్ఫూర్తి నింపేది’’ అని చె ప్పారు.

Videos

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)