మిస్‌ వరల్డ్‌ 2023 పోటీల్లో భారత్‌ తరఫున సినీ శెట్టి ప్రాతినిధ్యం!!

Published on Fri, 02/16/2024 - 16:26

భారతదేశం మిస్‌ వరల్డ్‌ 2023 అందాల పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 28 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఈ ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ అందాల పోటీలు భారత్‌లో నిర్వహించనుండటం విశేషం. ఇంకా తేదీలు ఖరారు కాకపోయినప్పటికీ ఈ మిస్‌ వరల్డ్‌ 71వ ఎడిషన్‌ నవంబర్‌ జరుగనుందని తెలుస్తోంది.  భారత్‌ చివరిసారిగా 1996లో ఈ అంతర్జాతీయ అందాల పోటీలకు ఆతిథ్యం ఇచ్చింది. ఇన్నేళ్ల విరామం తర్వాత భారత్‌కి ఈ ప్రపంచ వేదికపై తన ఆతిధ్యం, సాంస్కృతిక గొప్పతనాన్ని ‍ప్రదర్శించే గొప్ప అవకాశం ఇది.

ఇక ఈ అందాల పోటీల్లో భారత్‌ తరుఫున ఫెమినా మిస్‌ ఇండియా 2022 టైటిల్‌ విజేతగా నిలిచిన సినీ శెట్టి ప్రాతినిధ్యం వహించనుంది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ..తన తోటి సోదరిమణులకు భారతదేశం అంటే ఏమిటో, ఇక్కడ ఉండే వైవిధ్య సంప్రదాయాలు, విలువలను ప్రదర్శించడం పట్ల ఉత్సాహంగా ఉన్నానని పేర్కొంది. కచ్చితంగా మన సంప్రదాయాలు, ఆతిథ్యం చూసి ముగ్ధులవుతారని నమ్మకంగా చెప్పింది. అలాగే వాళ్లకు ఇక్కడ  గడపడం నచ్చుతుందని అన్నారు. 

ఎవరీ సినీ శెట్టి..
కర్ణాటక మూలాలు ఉన్న సినీ షెట్టి ముంబైలో పుట్టింది. ఆమె మిస్ ఇండియా 2022 పోటీలో కర్ణాటక రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించారు. సినీ శెట్టి అకౌంటింగ్  ఫైనాన్స్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ చదివారు. ప్రస్తుతం​ ఆమె సీఎఫ్‌ఏ (చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్) చేస్తున్నట్లు సమాచారం. అలాగే  సినీ శెట్టి తన 14 ఏటనే భరతనాట్యంలో ఆరంగ్రేటం చేసింది. ఇక ప్రియాంకా చోప్రా తన రోల్ మోడల్ అని తెలిపింది. 

(చదవండి: శాకాహారం మాత్రమే తీసుకుంటే..ఈ సమస్యలు వస్తాయట..!)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)