Breaking News

మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ బ్యూటిఫుల్ సీజన్ 2 వచ్చేస్తోంది!

Published on Tue, 04/15/2025 - 16:32

హైదరాబాద్ : హైదరాబాద్‌ వేదికగా ఇటీవలే నిర్వహించిన మిస్‌ అండ్‌ మిసెస్‌ స్ట్రాంగ్‌ అండ్‌ బ్యూటీఫుల్‌ ఈవెంట్‌ విజయవంతం కావడంతో సక్సెస్ మీట్ నిర్వహించారు. దీనిలో భాగంగా మిస్‌ అండ్‌ మిసెస్‌ స్ట్రాంగ్‌ అండ్‌ బ్యూటీఫుల్‌ సీజన్ 2ను ప్రకటించారు. రెండో సీజన్ కు సంబంధించిన పోస్టర్ ను ఫౌండర్ కిరణ్మయి అలివేలు , సీజన్ 1 విజేతలతో కలిసి ఆవిష్కరించారు. 

ఔత్సాహిక యువతులకు ఇది మంచి వేదికని కిరణ్మయి చెప్పారు.  నిత్య జీవితంలోని ఆలోచనలు, ఆశయాలకు పెళ్లి ముగింపు కాదనీ,  మరో అద్భుత ఆరంభమన్నారు. మగువ సౌందర్యాన్ని మరింత గ్రాండ్ గా ప్రదర్శించడానికి ఈ ఈవెంట్ ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో పలు ఫ్యాషన్ షోలు, బ్యూటీ కాంటెస్ట్స్ లో పాల్గొన్న అనుభవంతో, ఔత్సాహికులకు అవకాశాన్ని కల్పించాలనే లక్ష్యంతో ఈ వేదికను ఏర్పాటు చేశామన్నారు. వయసుతో సంబంధం లేకుండా మహిళలను ఫ్యాషన్ వేదికపై ప్రోత్సహించడమే లక్ష్యమన్నారు. అలాగే  క్యాన్సర్ వంటి వ్యాధులపై అవగాహన కల్పించడంతో పాటు సామాజిక బాధ్యతతో కొన్ని సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్టు మిస్‌ అండ్‌ మిసెస్‌ స్ట్రాంగ్‌ అండ్‌ బ్యూటీఫుల్‌ ఫౌండర్ కిరణ్మయి అలివేలు చెప్పారు.

ఈ సందర్బంగా తమ విజయంలో భాగమైన కుటుంబాలు, స్పాన్సర్లు, పాల్గొనేవారు, నిర్వాహక బృందానికి, మీడియాకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.  ఈ లక్ష్యంలో కలిసి నడిచినందుకు ధన్యవాదాలన్నారు. సీజన్ 2 ప్రకటన సందర్భంగా మొదటి సీజన్ లో విజేతలుగా నిలిచిన వారంతా ర్యాంప్ వ్యాక్ తో అలరించారు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌