Breaking News

అంతలోనే ఎంత విషాదం : మాజీ మిస్‌ ఇండియా కన్నుమూత

Published on Thu, 02/29/2024 - 14:04

మిస్ ఇండియా త్రిపుర 2017 రింకీ చక్మా కన్నుమూసింది. కేన్సర్‌తో సుదీర్ఘ పోరాటం  చేస్తున్న ఆమె 28 ఏళ్లకే ప్రాణాలు  కోల్పోయింది. ఫిబ్రవరి 22న ఆసుపత్రి చేరిన రింకీ పరిస్థితి విషమించడంతో  తుదిశ్వాస తీసుకుంది. రింకీ చక్మా మరణాన్ని సోషల్‌మీడియా ద్వారా ప్రకటించిన  మిస్‌ఇండియా ఆర్గనైజేషన్‌ సంతాపాన్ని తెలిపింది.

2022 నుండి రింకీ రొమ్ము కేన్సర్‌తో బాధపడుతోంది. చికిత్స తీసుకుంటున్న క్రమంలో తగ్గినట్టే తగ్గి,  మహమ్మారి మళ్లీ విజృంభించింది. ఊపిరితిత్తులు, తలకు బాగా వ్యాపించింది. ఫలితంగా బ్రెయిన్ ట్యూమర్  వచ్చింది. సంబంధిత ట్రీట్‌మెంట్‌  తీసుకుంటున్న క్రమంలో ఆరోగ్యం క్షీణించి, సెలవంటూ వెళ్లిపోయింది.

గత నెలలో, రింకీ తన ఇన్‌స్టాలో ఒక  పెద్ద పోస్ట్‌  పెట్టింది. “నాకు మాలిగ్నెంట్ ఫైలోడ్స్ ట్యూమర్ (2022లో బ్రెస్ట్ క్యాన్సర్) ఉన్నట్లు నిర్ధారణ అయింది.  ఆపరేషన్‌ అది నా ఊపిరితిత్తులలోకి , ఇప్పుడు నా తలలో (మెదడు కణితి)  చేరింది. ఇపుడు  బ్రైన్‌ సర్జరీ ఇంకా పెండింగ్‌లో ఉంది,  ఇప్పటికే ఇది  బాడీలో చాలావరకు వ్యాపించింది. 30శాతం ఆశలే ఉన్నాయి’’ ప్రస్తుతం కీమోథెరపీ చికిత్స నడుస్తోందంటూ తన  బాధను ఫ్యాన్స్‌తో పంచుకుంది. అంతేకాదు రెండేళ్లుగా ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నాం.. దాచుకున్న సొమ్మంతా కరిగిపోయింది. డొనేషన్స్‌ తీసుకుంటున్నాఅంటూ ఆర్థిక సహాయాన్ని అర్థించారు.  కానీ అంతలోనే వి ఆమె కన్నుమూయడం విషాదం. త్రిపురకు చెందిన రింకీ 2017లో మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనలిస్టుగా నిలిచారు.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?