Breaking News

మిస్‌ గ్రాండ్‌ ఇంటర్నేషనల్‌ పోటీలకు ఆతిథ్యం దేశంగా భారత్‌ తొలగింపు!

Published on Fri, 09/04/2026 - 13:02

ఈ ఏడాది మిస్‌ గ్రాండ్‌ ఇంటర్నేషనల్‌(ఎంజీఐ) పోటీలకు భారత్‌ అతిధ్యం ఇవ్వాల్సి ఉండగా అర్థాంతరగా వాటిని నిలిపేసింది ఆ పోటీ సంస్థ. తమ ఒప్పంద కట్టుబాట్లను నెరవేర్చడంలో భారత్‌ విఫలమైందంటూ..ఆతిధ్య దేశంగా భారత్‌ని తొలగించింది ఎంజీఐ సంస్థ. ఆ నేపథ్యంలోనే భారత్‌లో ఆ పోటీకి సంబంధించిన కార్యకలాపాలను కూడా ముగించి, థాయిలాండ్‌కు తరలించనున్నట్లు ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. 

అంతేగాదు తమ ఒప్పందం ప్రకారం..‘ఫైవ్-స్టార్ ఆతిథ్యం,  నిర్మాణ ప్రమాణాలు’ అవసరం. కానీ భారత్‌ వాటిని అందుకోలేదని వెల్లడించింది మిస్‌గ్రాండ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ(ఎంజీఐ). ప్రస్తుతం మిస్‌ గ్రాండ్‌ ఇంటర్నేషనల్‌ 2026 సెప్టెంబర్‌ 18 నుంచి అక్టోబర్‌ 10 వరకు థాయిలాండ్‌లో జరగనున్నాయి. ఆ ‍ప్రకటనలో ఎంజీఐ ఇలా పేర్కొంది.  "తమ పోటీదారుల భద్రత, సౌకర్యం, మొత్తం అనుభవాన్ని నిర్ధారించడానికి, అలాగే మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ వృత్తిపరమైన ప్రమాణాలు, సమగ్రతను కాపాడుకోవడానికి  ఈ 5-స్టార్ ఒప్పంద ప్రమాణాలు అవసరం. 

అందుకోసం అన్ని చర్చలు, ప్రయత్నాలు చేసినప్పటికీ..అంగీకరించిన ఒప్పంద ప్రమాణాలు నెరవేరలేదు అందువల్ల ఆతిథ్య దేశంగా భారత్‌ని తొలగిస్తున్నట్లు వెల్లడించింది". సదరు అందాల పోటీ సంస్థ ఎంజీఐ. ఇదిలా ఉండగా రాచల్‌ గుప్తా వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 టైటిల్‌ విజేత రాచల్‌ గుప్తా తన టైటిల్‌ని వదులుకున్న ఏడాది తర్వాతే ఎంజీఐ నుంచి ఇలాంటి నిర్ణయం వెలువడటంతో నాటి ఘటనే కారణమని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఆమె తమ అనుమతి లేకుండానే ప్రాజెక్టులను చేపట్టి ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ టైటిల్‌ని రద్దు చేసినట్లు ప్రకటించింది ఎంజీఐ. అంతేగాకుండా థాయ్ వ్యాపారవేత్త, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు మిస్ యూనివర్స్ వైస్ ప్రెసిడెంట్ (ఆసియానా) అయిన నవాత్ ఇత్సరగ్రిసిల్ ఆమె శస్త్ర చికిత్స చేయించకుందంటూ ఆమె రూపాన్ని ఎగతాళి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే ఆమె ఇక్కడ విషపూరిత వాతావరణం, పదే పదే నెరవేర్చని వాగ్దానాలు కారణంగా తాను ముందుగానే తన పదవికిరాజీనామా చేస్తున్నట్లు ప్రకటించింది. 

గతంలో కూడా ఇలాంటి తొలగింపే..
2022లో మిస్‌గ్రాండ్‌ ఇంటర్నేషనల్‌ ఒప్పందం సమస్యలనే కారణాలుగా చూపి కంబోడియాను సహా ఆతిత్యం దేశంగా రద్దు చేసి మిగిలిన పోటీ కార్యకలాపాలను, పోటీదారులను థాయిలాండ్‌కు తరలించింది. ఆ తర్వాత మిస్‌ గ్రాండ్‌ కంబోడియా అంతర్జాతీయ సంస్థ నుంచి వైదొలుగుతున్నట్లు ఒక ప్రకటన జారీ చేసింది. 

కాగా, నెటిజన్లు మిస్‌ గ్రాండ్‌ ఇంటర్నెషనల్‌ సంస్థ నిర్ణయంపై మండిపడుతున్నారు. 72వ మిస్ వరల్డ్ పోటీతో సహా, భారతదేశం ఇన్ని ఏళ్లుగాగా అందాల పోటీలకు ఆతిథ్యం ఇవ్వగలిగినప్పుడు, ఆ దేశం ఖచ్చితంగా MGIకి కూడా ఆతిథ్యం ఇవ్వగల సామర్థ్యం ఉందని, థాయిలాండ్‌ కావాలనే డ్రామా చేస్తుందంటూ తిట్టిపోస్తున్నారు. 

 

(చదవండి: మీనాక్షి దేవతను తలపించేలా నికితా పోర్వాల్‌ అద్భుత నృత్యం..!)
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)