Breaking News

చీరలో మగవాళ్లు కూడా స్టైలిష్‌గా కనిపించొచ్చు ఇలా..!

Published on Thu, 04/24/2025 - 14:01

ఫ్యాషన్‌కి లింగ భేదం, సరిహద్దులు లేవని చూపించారు చాలామంది. కొద్దిపాటి సృజనాత్మకతతో మహిళల అందాన్ని రెట్టింపు చేసే చీర కూడా పురుషులను అందంగా చూపించగలదని విన్నారా..?. అవును మీరు వింటుంది నిజమే..!. మగవాళ్లు చీర కట్టుకుంటారా ఏంటి..? అని అనుకోకండి..ఎందుకంటే చీరను మగవాళ్లు ధరించే వాటిలా మలిచి స్టైలిష్‌గా చూపించొచ్చట. పైగా ఫ్యాషన్‌కి సరికొత్త అర్థం ఇస్తున్నారు ఇలా..!.

అదెలా అంటే... భారతదేశపు తొలి పురుష మోడల్‌గా పేరుగాంచిన వ్యక్తి, బాలీవుడ్‌ నటుడు మిలింద్ సోమన్ అదెలాగో చేతల్లో చూపించాడు. ఫిట్‌నెస్‌ ఐకాన్‌గా పేరుతెచ్చుకున్న సోమన్‌..ఇటీవల ప్రముఖ ఫ్యాషన్‌ ర్యాంప్‌పై చాలా అందంగా మెరిశాడు. అతడి స్టైలిష్‌ లుష్‌ కళ్లు తిప్పుకోనివ్వలేనంతగా కట్టిపడేసింది. 

సంప్రదాయానికి ప్రతీగా చూసే బంగారు చీరలో తళుక్కుమని కనిపించాడు. అది కూడా ఓ సాధారణ చీర మగవాళ్లకు కూడా ఇంత మంచి లుక్‌ ఇవ్వగలదా అనే ఆశ్యర్యానికి గురిచేసేలా అతడి ఆహార్యం అందర్నీ ఆకర్షించింది. అందులోనూ రుద్రాక్షలను ధరించి.. రుద్ర అవతారాన్ని ఓ సరికొత్తఫ్యాషన్‌ లుక్‌లో చూపించాడు సోమన్‌. ఆ లుక్‌ చూడటానికి మన సాంస్కృతిక సంప్రదాయాలకు ఆధునికతను జోడిస్తే.. ఇంత అందంగా ఉంటుందా అని ఆశ్చర్యపోవడం ఖాయం. 

ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అనే నానుడికి అసలైన అర్థంలా అతడి స్టైలిష్‌ లుక్‌ ఆకర్షిస్తోంది. అంతేగాదు సోమన్‌ ఆ ఫ్యాషన్‌ ర్యాంప్‌పై చెప్పులు లేకుండా ధోతీ కట్టులో వస్తున్న తీరు..మన సంప్రదాయ లుక్‌ ఇచ్చే ఆత్మవిశ్వాసమే వేరేలెవెల్‌ అన్నట్లుగా ఉంది. అలనాటి రాజవంశికులు పండుగలు, పర్వదినాల్లో ధరించే వస్త్రధారణ తీరుని గుర్తు చేసింది సోమన్‌ ఫ్యాషన్‌ వేర్‌. ఆడ మగ అనే తారతమ్యం లేకుండా ధరించే రుద్రాక్షలు శక్తికి ప్రతీకలు. అందువల్లే ఈ ఫ్యాషన్‌ ర్యాంప్‌పై సోమన్‌ లుక్‌ శక్తిమంతంగా కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌గా మారింది.

 

(చదవండి: స్పేస్‌ ఫుడ్‌ టేస్ట్‌ని ఇలా పరీక్షిస్తారా..? వీడియో వైరల్‌)

 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?