Breaking News

బహు భాషల బంధువు

Published on Sun, 06/22/2025 - 00:46

యంత్రానికి అనువాదం చిక్కుతుందా? చిక్కినట్లు అనిపించినా... ఇంకా ఎన్నో చిక్కులు ఉండనే ఉన్నాయి. ఆ చిక్కు ముడులు విప్పడానికి, యంత్ర అనువాదంలో  సహజత్వాన్ని తీసుకురావడానికి,  ప్రాచుర్యం లేని భాషల్లోకి అనువాదాలను తీసుకురావడానికి నడుం కట్టారు మైక్రోసాఫ్ట్‌ రిసెర్చ్‌ ఇండియా సీనియర్‌ ప్రిన్సిపల్‌ 
రిసెర్చర్‌ కాళికా బాలి.

ఇంగ్లీష్‌ నుంచి ప్రాంతీయ భాషల్లోకి అనువాదం చేసే సైట్లు బోలెడు కనిపిస్తాయి. అయితే కొన్ని సందర్భాలలో ఆ అనువాదం అసలు అర్థానికి దూరంగా నవ్వు తెప్పించేలా ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కార మార్గం ఆలోచించాలనుకున్నారు కాళికా బాలి.

మైక్రోసాఫ్ట్‌ రిసెర్చ్‌ ఇండియా సీనియర్‌ ప్రిన్సిపల్‌ రిసెర్చర్‌ అయిన బాలి లాంగ్వేజ్‌ మోడల్స్‌ను మరింత సమర్థంగా తీర్చిదిద్దడానికి తన బృందంతో కలిసి రంగంలోకి దిగారు.

దిల్లీ, జెఎన్‌యూలో, యూనివర్శిటీ ఆఫ్‌ న్యూయార్క్‌లో లింగ్విస్టిక్స్, అకూస్టిక్‌ ఫొనెటిక్స్‌ చదువుకున్న కాళికా బాలి ఏఐ ప్రపంచంలోకి రావడానికి ముందు స్పీచ్‌ టెక్నాలజీపై పనిచేశారు. టెక్ట్స్‌–టు–స్పీచ్‌ సిస్టమ్‌లను నిర్మించారు.

లండన్‌కు చెందిన స్టార్టప్‌ల ఇంగ్లీష్‌ స్పీచ్‌ అప్లికేషన్‌లపై పనిచేశారు. 2002లో ఇండియాకు తిరిగివచ్చిన తరువాత బెంగుళూలోని హెచ్‌పీ ల్యాబ్స్‌లో చేరారు. 2006లో కొత్తగా వచ్చిన మైక్రోసాఫ్ట్‌ రిసెర్చ్‌ ల్యాబ్‌–ఇండియాలో చేరారు.

బాలి, ఆమె బృందం ఎన్‌ఎల్‌పీకి సంబంధించి సరికొత్త ప్రమాణాలను నెలకొల్పడంపై దృష్టి పెట్టారు. ‘హిందీ అనువాదంపై చేసిన కొన్ని వర్క్స్‌బింగ్‌తో పాటు, ఇతర ప్రాథమిక హిందీ–ఇంగ్లీష్‌ అనువాద వ్యవస్థలోకి వెళ్లాయి’ అంటున్నారు కాళిక. కోడ్‌ మిక్సింగ్, కోడ్‌ స్విచ్చింగ్‌కు సంబంధించి ఆమె కృషి చేశారు.

ఆ రోజుల్లో ఎన్నో ఎన్‌ఎల్‌పీ సిస్టమ్స్‌ మోనోలింగ్వల్‌గా ఉన్నప్పుడు, తన బృందంతో కలిసి ప్రాజెక్ట్‌ మెలాంజ్‌’ లాంచ్‌ చేశారు. ఇది కోడ్‌–మిక్స్‌డ్‌ ఎన్‌ఎల్‌పీ రూ΄÷ందించడానికి ఉపకరిస్తుంది.

తక్కువ వనరులు అందుబాటులో ఉండే ‘గోండీ’లాంటి భాషలపై కూడా ఆమె పనిచేశారు. ‘హిందీ, ఇంగ్లీష్‌ పుస్తకాలను గోండీలోకి అనువాదం చేయడానికి అవసరమైన పుస్తకాలు ఎన్నో ఉపయోగించుకున్నాం. ఇంగ్లీష్, హిందీ నుంచి తొలిసారిగా రెండు వందల గోండీ పుస్తకాలు తీసుకు వచ్చాం’ అంటున్నారు బాలి.

బాలి బృందం ప్రస్తుతం స్కేల్‌డ్‌–అప్‌ వెర్షన్‌ ‘సమీక్ష’ను అభివృద్ధి చేస్తోంది. ఇది రాజ్యాంగం గుర్తించిన 22 అధికారిక భారతీయ భాషలను కవర్‌ చేస్తుంది. ఉపాధ్యాయులకు ఉపయోగపడే ఏఐ అసిస్టెంట్‌ ‘శిక్ష కోపైలట్‌’ అభివృద్ధి చేయడంలో సహకారం అందించారు బాలి.

‘మన దేశానికి సంబంధించి ఏఐ ఎకోసిస్టమ్‌ను తీర్చిదిద్దడంలో కాళిక కీలక పాత్ర ΄ోషించారు. కమ్యూనిటీ–సెంటర్‌డ్‌ రిసెర్చ్‌ కు ప్రాధాన్యత ఇచ్చారు. గత ఎనిమిది సంవత్సరాలుగా ఆమెతో కలిసి పనిచేస్తున్నాను. నైతిక విలువలతోపాటు అరుదైన శాస్త్రజ్ఞానం ఆమెలో కనిపిస్తుంది. కాళిక నుంచి ఎంతో స్ఫూర్తి ΄÷ందాను’ అంటున్నారు ‘కార్య’ సీయీవో మను చో్రపా. ‘కార్య’ అనేది పేద ప్రజలకు ఏఐ డిజిటల్‌ వర్క్‌ ద్వారా అదనపు ఆదాయ మార్గాన్ని చూపించే సంస్థ.                            

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)