Breaking News

రూ.80 లక్షల ఉద్యోగాన్ని వదిలేసి, పూల సాగు..కట్‌ చేస్తే..!

Published on Thu, 05/09/2024 - 11:35

సౌకర్యవంతమైన జీవితం, ఇంగ్లాండ్‌లో దిగ్గజ టెక్‌ కంపెనీలో ఆకర్షణీయమైన జీతం. యూరప్‌ టూర్లు, వీకెండ్‌ పార్టీలు.. అయినా  మనసులో ఏదో వెలితి. ఏం సాధించాం అన్న ప్రశ్న నిరంతరం మదిలో తొలిచేస్తూ ఉండేది. కట్‌ చేస్తే, తాత ముత్తాతల వ్యవసాయ భూమిలో పూల వ్యాపారంతో కోట్లు సంపాదిస్తున్నాడు. అంతకు మించిన ఆత్మసంతృప్తితో జీవిస్తున్నాడు.  ఎవరా అదృష్టవంతుడు ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

ఉత్తర ప్రదేశ్‌లో  అజంగఢ్ జిల్లాలోని చిల్బిలా గ్రామానికి చెందిన అభినవ్ సింగ్  కష్టపడి చదివాడు. ప్రముఖ టెక్‌  కంపెనీ మైక్రోసాఫ్ట్  యూకేలో అధిక వేతనంతో  ఉద్యోగం వచ్చింది. రూ. 80 లక్షల ప్యాకేజీతో జీవనం సాఫీగా సాగుతోంది. కానీ తన వ్యవసాయ మూలాలతో తిరిగి కనెక్ట్ అవ్వాలనే  ఆశ  ఒక వైపు, తోటి వారికి అవకాశాలను సృష్టించాలనే  కోరిక మరోవైపు అభినవ్‌ సింగ్‌ను  స్థిమితంగా కూర్చోనీయలేదు.  రైతుల జీవన స్థితిగతులను మార్చడం. వ్యవసాయం గౌరవప్రదమైన వృత్తి అనేది నిరూపించాలనేది లక్ష్యం. చివరికి ఉద్యోగాన్ని వదిలేసి సొంత గ్రామానికి వెళ్లి వ్యవసాయం  చేయాలని నిర్ణయించుకున్నాడు.

అభినవ్ 2014లో ఇండియాకు తిరిగి వచ్చాడు. గుర్గావ్‌లో కొన్నాళ్లు పనిచేశాడు. 2016లో 31 ఏళ్ల వయసులో అభినవ్ తన ఉద్యోగాన్ని పూర్తిగా వదిలేయాలని నిర్ణయించుకున్నాడు.

సౌకర్యవంతమైన  ఉద్యోగాన్ని వదిలి ఇండియాలో ఒక చిన్న గ్రామంలో వ్యవసాయాన్ని ఎంచుకోవడం అంత సులభం కాదు. కానీ పట్టుదలతో నిలిచి గెలిచాడు. స్వగ్రామంలో పూర్వీకుల భూమిలో గెర్బెరా వ్యవసాయం మొదలు పెట్టాడు. మొదట్లో సేంద్రీయ కూరగాయల సాగును ప్రయత్నించాడు, కానీ పెద్దగా సక్సెస్‌ అవ్వలేదు. 

అయితే  ఉత్తరప్రదేశ్‌లో  పెళ్లిళ్ల  సీజన్‌లో అలంకరణకు కావాల్సిన రంగురంగుల పూలకు ఎక్కువ డిమాండ్‌ ఉందనీ, కానీ సప్లయ్‌ సరిగ్గా లేదని గుర్తించాడు. అంతే జెర్బెరా పువ్వుల సాగు వైపు మొగ్గు చూపాడు.   4వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న పాలీహౌస్‌లో పెట్టుబడి పెట్టాడు. మొత్తం రూ.58లక్షల పెట్టుబడిలో రూ.48 లక్షలు బ్యాంకు లోన్‌ కాగా, మిగతాది పొదుపు చేసుకున్నడబ్బు.  ఫిబ్రవరి 2021లో తొలి   పంటసాయం విజయవంతమైన వ్యాపారానికి నాంది పలికింది.

ప్రారంభించిన కేవలం  ఒక్క ఏడాదిలోనే జెర్బెరా సాగు నెలవారీ రూ. 1.5 లక్షల ఆదాయాన్ని సాధించాడు. అంతేకాదు  పూలసాగు, ప్యాకేజింగ్, రవాణా , విక్రయాలు ఇలా పలు మార్గాల్లో  100 మంది వ్యక్తులకు జీవనోపాధిని అందించాడు. జెర్బెరా  మొక్కలను స్థానికంగా ఇతర రైతులకు అందిస్తూ,  స్థిరమైన వ్యాపార నమూనాను సృష్టించాడు. తోటి రైతులకు స్ఫూర్తినిగా నిలిచాడు.  

“ఉద్యోగంతో సంపాదించే దానికంటే తక్కువ సంపాదించవచ్చు, కానీ ఇతరులకు జీవనోపాధిని కల్పించడం,  సొంత వూరిలో ఇష్టమైంది,  ప్రత్యేకమైనది చేయడం.  కుటుంబంతో కలిసి ఉండడం ఇన్ని ఆనందాల్ని ఎంత విలాసవంతమైన జీవితం మాత్రం అందిస్తుంది చెప్పండి’’ -అభినవ్.
 

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)