Breaking News

ఇది.. మైక్రోకరెంట్‌ ఫేస్‌ లిఫ్ట్‌ డివైస్‌!

Published on Sun, 09/15/2024 - 04:31

ఈరోజుల్లో సౌందర్యాభిలాషులకు తమ వయసును దాచే అద్భుతమైన పరికరాలు మార్కెట్‌లోకి చాలానే వస్తున్నాయి. ముడతలు, మచ్చలు, గీతలు లేకుండా చర్మానికి నిగారింపునిచ్చి, యవ్వనంతో కళకళలాడేలా మార్చే ఇలాంటి డివైస్‌లు వెంట ఉంటే, అందాన్ని కాపాడుకోవడం చాలా తేలిక. చిత్రంలోని ఈ మైక్రోకరెంట్‌ ఫేస్‌ లిఫ్ట్‌ మెషిన్‌ అధునాతన రేడియో ఫ్రీక్వెన్సీ, ఎలక్ట్రికల్‌ మజిల్‌ స్టిములేషన్‌ టెక్నాలజీతో పనిచేస్తుంది.

ఈ ప్రొఫెషనల్‌ ఫేషియల్‌ మసాజర్‌ వడలిపోయిన చర్మాన్ని బిగుతుగా మార్చడానికి, చర్మానికి ఉండే సహజ స్థితిస్థాపకతను మెరుగుపరచడానికి, చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడానికి, చర్మం నిగారింపును పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. ఈ పోర్టబుల్‌ మెషిన్‌ చూడటానికి టార్చ్‌లైట్‌లా కనిపిస్తుంది. రీచార్జ్‌ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది.

ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనిలోని రెడ్‌ లైట్‌ థెరపీ చర్మాన్ని బిగుతుగా మార్చడంతో పాటు దెబ్బతిన్న కొలాజెన్‌ పొరను సరిదిద్దడానికి సహాయపడుతుంది. అలాగే దీనిలోని బ్లూ కలర్‌ లైట్‌ థెరపీ మొటిమలను, మొటిమల వల్ల ఏర్పడే మచ్చలను తొలగిస్తుంది. దీనిలోని రెండు రకాల లైట్‌ థెరపీలకు మూడు స్థాయిల్లో వైబ్రేషన్‌ స్పీడ్‌ను కోరుకున్న విధంగా మార్చుకోవచ్చు. ఈ మెషిన్‌ ఆన్‌ అయిన ఆరు నిమిషాల్లో ఆటోమేటిక్‌గా ఆఫ్‌ అవుతుంది. దీని ధర 84 డాలర్లు (రూ.7,044) మాత్రమే!

ఇవి చదవండి: అందాలొలికే ఈ బొమ్మలు.. సుమనోహరం!

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)