Breaking News

స్లిమ్‌గా మిచెల్‌ ఒబామా..! ఆమె కూడా ఒజెంపిక్‌ తీసుకున్నారా..?

Published on Tue, 11/25/2025 - 18:06

అధిక బరువు అనేది సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, ప్రముఖులు వరకు అందరూ ఫేస్‌ చేస్తున్న సమస్య. ఓ పట్టాన బరువు తగ్గలేక చాలామంది ఇటీవల కాలంలో ఒజెంపిక్‌ ఇంజెక్షన్ల బాట పడుతున్నారు. తాజాగా ఆ జాబితాలోకి అగ్రరాజ్యం మాజీ ప్రథమ మహిళ మిచెల్‌ ఒబామా కూడా చేరిపోయారా, ఆమె కూడా దీన్ని వినియోగిస్తున్నారా అనే ఊహగానాలు వెల్లువెత్తాయి. అందుకు కారణం ఇటీవల ఆమె నెట్టింట పోస్ట్‌ చేసిన ఫోటోలే. అందులో మిచెల్‌ ఎంత నాజుకుగా అయిపోయారంటే..చూపుతిప్పుకోనివ్వనంత అందంగా మారిపోయారామె.

గత వారాంతంలో 61 ఏళ్ల మిచెల్ ఒబామా ప్రముఖ అమెరికన్ ఫోటోగ్రాఫర్ అన్నీ లీబోవిట్జ్ ప్రచార ఫోటో షూట్‌కి సంబంధించిన ఫోటోలను నెట్టింట షేర్‌ చేసుకున్నారామె. అందులో ఆమె లైట్‌కలర్‌ జీన్స్‌, ప్లెయిన్ గ్రే టీ-షర్టు విత్‌ గోధుమ రంగు సూడ్ బూట్‌లతో చాలా ఫిట్‌గా కనిపించారు. దాంతో అందరూ ఆమె అంతలా సన్నగా ఎలా మారిపోయిందనే సందేహాలు మొదలయ్యాయి. 

ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రముఖులు వ్యాయమం కంటే ఈజీగా బరువు తగ్గించే ఒజెంపిక్‌ ఔషధాన్ని ఉపయోగించినట్లు అంగీకరించారు. బహుశా ఆమె కూడా వారి బాటలోనే నడిచారా అని నెటిజన్లలో ఊహాగానాలు ఊపందుకున్నాయి. 

ఇదిలా ఉండగా మిచెల్‌ తన పుస్తకం  "ఉమెన్" మాదిరిగా చేశారామె. మనం స్త్రీలను ఎలా చూస్తామో..అంతకుమించి అన్నట్లు సాగిపోవడమే కాదు తన దృక్పథంతో లైఫ్‌ని లీడ్‌ చేయగలదు కూడా. ఈ రోజు మహిళలు చాలా రకాలుగా తనను తాను నిరూపించుకుంటున్నారు. మీరు కూడా నాలాగే ఈ డెవలప్‌మెంట్‌ని స్ఫూర్తిదాయకంగా భావిస్తారని ఆశిస్తునన్నా అని క్యాప్షన్‌ జోడించి మరి పోస్ట్‌లో రాసుకొచ్చింది. 

కాగా, ఓజెంపిక్ అనేది టైప్ 2 డయాబెటిస్‌ను నిర్వహించడానికి ఆమోదించబడిన మందు. ఇది వారానికొకసారి ఇచ్చే మందు. బరువు నిర్వహణ ప్రయోజనాల నిమిత్తం ప్రజాధరణ పొందిన ఔషదం. గత సెప్టెంబర్‌లో ఆ ఔషధం తయారీదారు డానిష్‌ నోవో నార్డిస్క్, భారతదేశంలో కూడా దీన్ని ప్రారంభించాలని ప్లాన్‌ చేస్తున్నాడు.

 

(చదవండి: ప్రకృతి వైద్యమే మంచిదా..! నటి సోనాలి బింద్రే సైతం..)

 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)