Breaking News

ప్రపంచ సుందరి పోటీలకు ‘మెట్రోరైల్‌’ విస్తృత ప్రచారం

Published on Mon, 05/26/2025 - 07:47

సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ప్రపంచసుందరి పోటీలపై హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. మరికొద్ది రోజుల్లో పోటీలు ముగియనున్న దృష్ట్యా మిస్‌వరల్డ్‌ పోటీలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వివిధ రూపాల్లో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మరోవైపు తెలంగాణ పర్యాటక, చారిత్రక, వారసత్వ కట్టడాలపై ప్రజల్లో, ప్రయాణికుల్లో అవగాహన కలి్పంచేందుకు పోస్టర్లు, కటౌట్లు, చిత్రాల ప్రదర్శనకు ఏర్పాట్లు చేసింది. 

నగరంలోని గోల్కొండ, చారి్మనార్‌ వంటి చారిత్రక కట్టడాలతో పాటు పోచంపల్లి, రామప్ప, లక్నవరం, ఆమ్రాబాద్‌ పులుల అభయారణ్యం, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వంటి ఆధ్యాత్మిక, చారిత్రక ప్రదేశాలపై ఆకర్షణీయమైన దృశ్యాలను వివిధ ప్రాంతాల్లో ఆవిష్కరించారు. ప్రపంచసుందరి పోటీల్లో హైదరాబాద్‌ మెట్రో రైల్‌ తనవంతు భాగస్వామ్యాన్ని నిర్వహిస్తోందని  మెట్రోరైల్‌ ఎండీ ఎనీ్వఎస్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఈ పోటీలపై  ప్రత్యేక ప్రదర్శనలను ఏర్పాటు చేయడంతో పాటు తెలంగాణ ప్రాశస్త్యాన్ని ప్రజల్లోకి  తీసుకెళ్లేందుకు ఈ ప్రచారకార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.  

తెలంగాణకు పరిచయం చేసేలా..  
పోటీల్లో పాల్గొంటున్న ప్రపంచ సుందరీ మణులను తెలంగాణకు పరిచయం చేసేవిధంగా హైటెక్‌ సిటీ నుంచి నాగోల్‌ వరకు, మియాపూర్‌ నుంచి ఎల్‌బీనగర్‌ వరకు పలు ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లు, మెట్రో స్తంభాలు, రహదారులకు ఇరువైపులా ఉన్న మెట్రో రైలింగ్‌లపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆకర్షణగా నిలిచాయి. మరోవైపు మెట్రో రైళ్లలోనూ  స్క్రీన్లపై, మెట్రో స్టేషన్‌ ప్లాట్‌ఫాంలు, కాన్‌కోర్స్‌లలోనూ మిస్‌ వరల్డ్‌ వేడుకలను ప్రతిబింబించేలా అనేక ఏర్పాట్లు చేశారు. అలాగే మెట్రో స్టేషన్‌ల ప్రవేశ ద్వారాలను సైతం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆరీ్చలతో అలంకరించారు. 

నగరంలోని వివిధ మార్గాల్లో ప్రతిరోజు సుమారు 4.5 లక్షల నుంచి 5 లక్షల మంది ప్రయాణికులు మెట్రోల్లో  రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే  తెలంగాణ వారసత్వ సంపదను ప్రయాణికులకు తెలియజేసే బృహత్‌ కార్యక్రమంలో భాగంగా వివిధ రూపాల్లో ప్రచారాన్ని కొనసాగిస్తున్నట్లు ఎనీ్వఎస్‌ చెప్పారు. తెలంగాణ సంప్రదాయాలకు కీర్తి పతాకగా నిలిచిన బోనాలు, బతుకమ్మ, చార్మినార్‌ వంటి విశేషాలతో కూడిన ఆకర్షణీయ దృశ్యాలను ’మెట్రో రైల్‌’ ఈ వేడుకల సందర్భంగా మరింత విస్తృత ప్రచారం కల్పించిందని ఎండీ వెల్లడించారు.  

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)