Breaking News

Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు

Published on Tue, 05/07/2024 - 11:04

మెట్‌గాలా 2024 ఈవెంట్‌లో అంబానీ కుమార్తె,  రిలయన్స్‌ రీటైల్‌ ఎండీ ఇషా అంబానీ మరోసారి మెరిసి పోయింది. ఈ ఏడాది ఇషా అంబానీ మెట్ గాలా వేదికపైకి రావడం ఇది నాలుగోసారి. మెట్ గాలా 2024లో భారతీయ డిజైనర్ రాహుల్ మిశ్రా డిజైన్‌ చేసిన కస్టమ్-మేడ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ కోచర్ చీర గౌనులో తళుక్కున మెరిసింది. ఆరు గజాల 3డీ గౌనుకు  కార్సెట్ బ్లౌజ్‌తో గ్లామర్‌ లుక్‌ను మరింత  ఎలివేట్‌ చేసుకుంది. 

పువ్వులు, సీతాకోకచిలుకలు, తూనీగల సిగ్నేచర్‌ మోటిఫ్‌లతో  తయానైన  గౌనులో అందరి దృష్టినీ తన వైపు తిప్పుకుంది. పూర్తిగా ప్రకృతి ప్రేరణగా తీర్చిదిద్దిన ఆభరణాలు, చేతితో నేసిన గౌను, నెమలి ఫీచర్డ్‌ బ్యాగ్‌తో వనదేవతలా కనిపించింది.

ఫ్యాషన్‌లో ప్రపంచంలోనే అతి పెద్ద ఈవెంట్‌  మెట్ గాలా వేదికపై  రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, నీతా అంబానీల  కుమార్తె  ఇషా అంబానీ తన ఫ్యాషన్‌ స్టయిల్‌ను చాటుకుంది. న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్  వేదికపై ఇండియాలోని గ్రామాలలో చేతితో ఎంబ్రాయిడరీ చేసిన గౌనుతో  ప్రత్యేకంగా కనిపించింది.

ఈ ఏడాది మెట్ గాలా  థీమ్ "స్లీపింగ్ బ్యూటీస్: రీవేకనింగ్ ఫ్యాషన్." "ది గార్డెన్ ఆఫ్ టైమ్" అనే దుస్తుల కోడ్‌కు అనుగుణంగా, తన డ్రెస్‌లో పువ్వులు, సీతాకోక చిలుకలు, తూనీగలు ఉండేలా చూసుకున్నారు. అలాగే చేతికి ట్రెడిషనల్‌  లోటస్‌ బ్రేస్‌లెట్‌,  ప్యారెట్‌ ఇయర్‌ రింగ్స్‌, ఫ్లవర్ చోకర్‌లతో పాటు, నకాషి  మినియేచర్ పెయింటింగ్ వంటి భారతీయ కళ పద్ధతుల్లో స్వదేశ్ రూపొందించిన క్లచ్‌ను కూడా ఆమె ధరించింది. జాతీయ పక్షి మయూరం పెయింటింగ్‌ డిజైన్‌ క్లచ్‌ బ్యాగ్‌ చూడాల్సిందే. ఈ పెయింటింగ్‌ను జైపూర్‌కు చెందిన హరి నారాయణ్ మరోటియా రూపొందించారు. 

డిజైనర్, రాహుల్ మిశ్రా, ఇషా అంబానీ స్టైలిస్ట్ అనైతా ష్రాఫ్ అడజానియా ప్రకారం ఆమె ధరించిన  3డీ గౌను  పూర్తి చేయడానికి 10,000 గంటలు పట్టిందట.  ఫరీషా, జర్దోజీ, నక్షి , దబ్కా వంటి అప్లిక్, ఎంబ్రాయిడరీ  డిజైన్స్‌ ఇందులో ఉన్నాయి. ఈ  గౌనులో ఫ్రెంచ్ నాట్లు కూడా ఉన్నాయి.

2017లో మెట్ గాలా అరంగేట్రం చేసింది ఇషా అంబానీ. 2019 లో,భారతీయ డిజైనర్ ప్రబల్ గురుంగ్ రూపొందించిన లిలక్ గౌను ధరించింది. ఇక 2023లో, మళ్లీ గురుంగ్‌ని  డిజైన్‌ చేసిన బ్లాక్‌ పట్టు గౌను ధరించిన సంగతి తెలిసిందే.
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)