Breaking News

బ్రూనైలో మోదీ లంచ్‌ మెనూ ఇదే..!

Published on Thu, 09/05/2024 - 11:25

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ బ్రూనే పర్యాటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ దేశ సుల్తాన్‌ హస్సనల్‌ బోల్కివయా మోదీకి ఘటన స్వాగతం పలికారు. ఇరువురి మద్య దౌత్య సంబంధాల‌ను బ‌లోపేతం  చేసే దిశగా చర్చలు జరిగాయి. రెండు రోజులు పర్యటనలో ప్రధాని మోదీకి ఆ దేశ సుల్తాన్‌​ బోల్కియా గొప్ప ఆతిథ్యం ఇచ్చారు. సుల్తాన్‌​ తన నివాసం ఇస్తానా నూరుల్‌ ఇమాన్‌లో ప్రధాని మోదీకి ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని భారత రాయబార కార్యాలయం అధికారిక సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేసింది. 

మోదీకి అందించిన లంచ్‌ మెనూలో.. మన భారతీయ ప్రసిద్ధ వంటకాల తోపాటు మన జాతీయ జెండాను తలపించే రంగులతో వంటకాలను ఆకర్షణీయంగా తయారు చేయడం విశేషం. మొదటి కోర్సులో అవోకాడో, దోసకాయ, ఆస్పరాగస్, ముల్లంగి పికిల్‌ వడ్డించారు. ఆ తర్వాత క్రిస్పీ టోర్టిల్లా, బ్రోకలీతో లెంటిల్‌ సూప్‌ అందించారు. మూడవ కోర్సులో వెజిటబుల్ క్విచ్, స్పినాచ్, ఫారెస్ట్ మష్రూమ్ విత్ బ్లాక్ ట్రఫుల్, గుమ్మడికాయ, గ్రీన్‌ పురీ ఉన్నాయి. ఇక్కడ గ్రీన్‌ పీస్‌ పూరీలో భారత త్రివర్ణ పతకాన్ని గుర్తుకు తెచ్చేలా ఆకర్షణీయమైన రంగులతో సర్వ్‌ చేశారు. 

అంతేగాదు ఈ మెనూలో జీరా రైస్, చన్నా మసాలా, వెజిటబుల్ కోఫ్తా, భిండి టామటర్, గ్రిల్డ్ పీతలు, టాస్మానియన్ సాల్మన్, కొబ్బరి బార్లీ రిసోట్టోతో రొయ్యల స్కాలోప్స్ వంటి రెసిపీలు కూడా ఉన్నాయి. ఈ మెనూ భారతీయ ప్రసిద్ధ స్వీట్‌ డెజర్ట్‌లు కూడా ఉన్నాయి. అవి వరుసగా.. మామిడితో చేసిన పేడా, మోతీచూర్‌ లడ్డూ, సూర్తి ఘరీ పిస్తా తదితరాలు. ఈ వంటకాలన్నీ అందమైన మెరూన్‌ కలర్‌, గోల్డ్‌ డిజైన్‌తో ఉన్న ప్లేట్‌లలో అందించారు. కాగా ఇరు దేశాల దౌత్య సంబంధాల 40వ వార్షికోత్సవం నేపథ్యంలో ప్రధాని మోదీ రెండు రోజుల బ్రూనే పర్యటన జరిగింది. అదీగాక మోదీకి ఈ పర్యటన తొలిసారి కావడం విశేషం.

 

(చదవండి: బాడీబిల్డింగ్ వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయా..?)
 

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు