Breaking News

ప్రశాంతతే ఆరోగ్యానికి మూలం

Published on Mon, 08/24/2026 - 00:53

మనిషి జీవితం బయట కనిపించే దానికంటే లోపల జరిగేదే ఎక్కువ.  నవ్వుతున్న ముఖాల వెనుక ఎన్నో మౌనవేదనలు దాగి ఉంటాయి. చుట్టూ మనుషులు ఉన్నా, లోపల ఒంటరితనం వెంటాడుతుంటుంది. శరీరం అలసిపోయిందంటే విశ్రాంతి కోరుకుంటుంది. కానీ మనసు అలసిపోతే జీవితం మొత్తమే భారంగా అనిపిస్తుంది.  అందుకే మానసిక ప్రశాంతత మనిషి ఆరోగ్యానికి అసలైన పునాది.

ఇప్పటి ప్రపంచం వేగంగా పరుగులు పెడుతోంది. అయితే ఆ పరుగులో మనిషి తన మనసునే వెనక్కి వదిలేస్తున్నాడు. ఉదయం కళ్లుతెరిచిన క్షణం నుంచే ఆలోచనల రభస మొదలవుతుంది. ఎంత సంపాదించాలి? ఎలా నిలబడాలి? ఇతరులకంటే ఎలా ముందుండాలి? అనే పోటీ భావన మనిషిని నిరంతరం మానసిక ఒత్తిడిలోకి నెట్టేస్తోంది. ఈ ఆందోళనల మధ్య ప్రశాంతంగా జీవించడం కూడా ఒక కళగా మారిపోయింది. మనసు అనేది విచిత్రమైన ప్రపంచం. ఒక్క క్షణంలో ఆకాశమంత ఆనందంలో విహరిస్తుంది. మరోక్షణంలోనే అగాధమైన నిరాశలోకి జారిపోతుంది. గత జ్ఞాపకాలను మళ్లీ మళ్లీ తడిమి చూస్తుంది. జరిగిపోయిన సంఘటనలను వదలలేక బాధపడుతుంది. రానున్న భవిష్యత్తును ఊహిస్తూ భయపడుతుంది. ఈ రెండిటి మధ్య వర్తమానాన్ని ఆస్వాదించడం మరిచిపోతుంది. అందుకే మనిషి జీవితం బయట కంటే మనసులోనే ఎక్కువగా అలసిపోతుంది.

మనిషి ఎదుర్కొనే ప్రతి బాధకు కారణం పరిస్థితులే కావు. ఆ పరిస్థితులను మనసు స్వీకరించే విధానం కూడా కారణమే. చిన్న అపజయాన్ని జీవితాంతం మోస్తూ ఉండటం, ఇతరుల మాటలను గుండెల్లో పెట్టుకోవడం, ప్రతి విషయాన్ని మనసుకు భారం చేసుకోవడం ఇవే మానసిక ప్రశాంతతను దూరం చేస్తున్నాయి.

ఈ కాలంలో మనుషులు మాట్లాడటం తగ్గించి, మనసులో దాచుకోవడం పెంచేశారు. బాధను బయటపెడితేబలహీనులమవుతామనుకుంటున్నారు. కానీ మౌనం కూడా ఒక్కోసారి ప్రమాదకరం. మనసులో పేరుకుపోయిన వేదన నెమ్మదిగా మనిషిని లోపల కుంగదీస్తుంది. అందుకే మన భావోద్వేగాలను పంచుకోవాలి. మనల్ని అర్థం చేసుకునే వాళ్లతో మాట్లాడాలి. ఒక చిన్న ఓదార్పు కూడా కొన్నిసార్లు మనిషిని మళ్లీ నిలబెడుతుంది. 

జీవితంలో డబ్బు, హోదా, విజయాలు అన్నీ అవసరమే. కానీ వాటికంటే ముఖ్యమైనది ప్రశాంతమైన మనసు. రాత్రి నిద్రపోయేటప్పుడు మనసులో భయం లేకపోవడం, ఉదయం లేచినప్పుడు జీవితం మీద ఆశ ఉండటమే నిజమైన ఆనందాలు. ఎందుకంటే మానసిక ప్రశాంతత లేని జీవితం వెలుగులేని దీపంలాంటిది. అందుకే మనిషి ముందుగా తన మనసును ప్రేమించుకోవాలి. ఆలోచనలకు అదుపు నేర్పుకోవాలి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిలబడే సహనాన్ని పెంపొందించుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మనసు ఆరోగ్యంగా ఉంటే జీవితం అందంగా మారుతుంది. మానసిక ప్రశాంతతే ఆరోగ్యానికి మూలం. అదే జీవితానికి అసలైన అర్థం. 

అనవసరమైన పోలికలు కూడా మనిషిని లోపల ఖాళీ చేస్తుంటాయి. ఇతరుల విజయాన్ని చూసి తన జీవితాన్ని తక్కువగా అంచనా వేసుకునే అలవాటు నెమ్మదిగా ఆత్మన్యూనతాభావంగా మారుతోంది. నిజానికి ప్రశాంతత బయట దొరికేది కాదు. అది మన ఆలోచనలలో పుడుతుంది. మనిషి తనను తాను అర్థం చేసుకున్నప్పుడు, తన పరిమితులను అంగీకరించినప్పుడు, జీవితాన్ని సహజంగా స్వీకరించినప్పుడు మనసు నెమ్మదిగా ప్రశాంతతను అందుకుంటుంది. ప్రతిసమస్యను గుండెల్లో మోస్తూ జీవించడం కన్నా, దాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని పెంపొందించుకోవడం ముఖ్యం. ఎందుకంటే ప్రతి చీకటి శాశ్వతం కాదు. ప్రతి బాధకు ఒక ముగింపు ఉంటుంది.

మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ముందుగా మనసుకి విశ్రాంతి ఇవ్వాలి. రోజంతా శరీరం పని చేసినట్టే, మనసు కూడా అలసిపోతుంది. అందుకే కొంత సమయం మనతో మనం గడపాలి. ప్రకృతిని ఆస్వాదించాలి. మంచి పుస్తకాలు చదవాలి. మనసుకు హాయినిచ్చే సంగీతం వినాలి. ధ్యానం, యోగా,ప్రాణాయామం వంటి సాధనలు అలవాటు చేసుకోవాలి. ఇవి కేవలం వ్యాయామాలు కాదు మనసును నిలకడగా ఉంచే మార్గాలు.

– ఎన్‌. లహరి

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)