Breaking News

నా చేతి రాత మారి.. నా బతుకు రాతను మార్చేసింది!

Published on Thu, 07/02/2026 - 11:32

నా వయసు 45 సంవత్సరాలు. నేను ఒక రచయితను, నా రచనలన్నీ చేత్తోనే రాసుకోవడం నా అలవాటు. కానీ గత రెండు సంవత్సరాల నుంచి సరిగా రాయలేక పోతున్నాను. కొంచెంసేపు రాసేటప్పటికి, వేళ్ళు విపరీతంగా నొప్పులు పుట్టి, అక్షరాలు చిన్నవిగా, వంకరగా మారిపోయి, ఇతరులకు అర్థం కావడం లేదు. పదినిమిషాలు వరుసగా రాస్తే మళ్ళీ పది నిమిషాలు రెస్ట్‌ తీసుకుంటే గానీ రాయలేకపోతున్నాను. దీనివల్ల ఈ మధ్య నా రచనా వ్యాసంగంలో బాగా వెనుకబడ్డాను. అదే నా బతుకు దెరువు. మా ఫ్యామిలీ డాక్టర్‌ను సంప్రదిస్తే, దీనికి చికిత్స లేదంటున్నారు. మీరే ఏదైనా పరిష్కారం చూపిస్తారనే ఆశతో రాస్తున్నాను. – సుబ్రహ్మణ్యం. అమలాపురం

మీరు ‘రైటర్స్‌ క్రాంప్‌’ అనే ఒక అరుదైన సమస్యతో బాధ పడుతున్నారు. మానసిక, నాడీ మండలానికి సంబంధించిన ఈ సమస్యతో బాధపడేవారిలో, రాసే సమయంలో చేతివేళ్లు పట్టేయడం, వంకర్లు తిరిగిపోవడం, విపరీతమైన నొప్పితో కొంతసేపు రాసిన వెంటనే ఆగిపోవడం ఈ సమస్య లక్షణం. కొన్ని రకాల వృత్తుల్లో ఉన్నవారు అంటే టైపిస్టులు, ఎక్కువగా పెన్నుతో రాసేవారు, ఏదైనా సంగీత వాద్యాన్ని, వేళ్ళతో ఎక్కువగా పని చేసేవారిలో ఈ సమస్యను చూస్తుంటాము. దీనివల్ల మొదట్లో కొన్ని వాక్యాలు బాగా రాసినా, సడన్‌గా చేతివేళ్ళు పట్టేసి, చేతిరాత అధ్వానంగా మారిపోతుంది.

నొప్పితో΄ాటు, చేతిలో వణుకు కూడా రావచ్చు. కొంత విరామం తర్వాత మళ్ళీ మామూలు స్థాయికి రావచ్చు. ఈ సమస్య వల్ల కొంత టెన్షన్‌కు లోనై, పోనుపోను బటన్స్‌ పెట్టుకోవడం, షేవింగ్‌ చేసుకోవడంలో కూడా ఇబ్బందులు రావచ్చు. గతంలో టెలిగ్రామ్‌ పంపే పోస్ట్‌ ఆఫీస్‌లో పనిచేసేవారు, చేత్తో తీరికలేకుండా టైపు చేయడం ద్వారా కూడా వారిలో ఈ సమస్య ఎక్కువగా వచ్చేది. అసలు సమస్యతో ΄ాటు దీనివల్ల పనిలో వెనుకబడి, మానసిక ఒత్తిడికి గురై ఈ సమçస్య మరింత జటిలమవుతుంది.

ఈ సమస్యకు కూడా చికిత్స ఉందనేది చాలామందికి తెలియక, ఉద్యోగాలు మానేసిన వారు కూడా ఉన్నారు. ‘బొటాక్స్‌’ ఇంజక్షన్‌’ ద్వారా ఈ సమస్యను చాలా వరకు నయం చేయవచ్చు. ‘సుపినేటా రైటింగ్‌’ అనే ఒక ప్రత్యేక మానసిక చికిత్సా పద్ధతితో΄ాటు, ఒత్తిడి తగ్గించేందుకు కొన్ని మందులు, రిలాక్సేషన్‌ ఎక్సర్‌సైజ్‌ ద్వారా ఈ ‘రైటర్స్‌ క్రాంప్‌’ సమస్యను నయం చేయవచ్చు. మీరు అధైర్యపడకుండా దగ్గర్లోని సైకియాట్రిస్టును సంప్రదించి తగిన చికిత్స చేయించుకోండి. ఆల్‌ ది బెస్ట్‌!


- డా. ఇండ్ల విశాల్‌ రెడ్డి, సీనియర్‌ సైకియాట్రిస్ట్, విజయవాడ.
- మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్‌ ఐడీ: sakshifamily3@gmail.com

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)