అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్
Breaking News
Pooja Dhingra వంటల రాణి, గేమ్ చేంజర్
Published on Sat, 06/28/2025 - 11:20
పేస్ట్రీ గేమ్ చేంజర్ అవార్డు అందుకున్న మొట్టమొదటి ఇండియన్ చెఫ్‌గా పూజా ధింగ్రా (Pooja Dhingra) పేరు రికార్డులకెక్కింది. సాధారణంగా వంట అనగానే ఆడవాళ్లు చేసేదే కదా అని అనుకుంటాం కానీ రోడ్డు పక్కన ఉండే చిన్నా చితక కాకా, పాకహోటళ్ల నుంచి బిల్లు కట్టాలంటే చుక్కలు చూపించే స్టార్ హోటళ్ల వరకు మగవాళ్లే చెఫ్‌లుగా ఉంటారు. అయితే ముంబైకి చెందిన పూజా ధింగ్రా ఆ సంప్రదాయాన్ని తిరగరాసింది. తనకెంతో ఇష్టమైన వ్యాపకమైన వంటలనే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుని స్టార్ చెఫ్‌గా పేరు తెచ్చుకున్న పూజ భారతదేశపు మొట్టమొదటి మాకరోన్ దుకాణాన్ని ప్రారంభించి... బేకరీ చెయిన్ లీ 15 పాటిస్సేరీకి యజమానిగా... మహిళా వ్యాపారవేత్తగా ఆంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఇవేమీ కొత్త విషయాలు కావనుకోండి... ముంబాయ్ మాకరోనీ క్వీన్‌గా ఇప్పటికే మకుటం ఉన్న పూజాధింగ్రాకు పేస్ట్రీ గేమ్ చేంజర్ అవార్డు అందులో మరో విలువైన రాయిగా ఒదిగి΄ోయింది. దాంతో ఆమె ఈ అవార్డు అందుకున్న మొదటి ఫీమేల్ చెఫ్‌గా కూడా రికార్డు సృష్టించింది.
ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయమేంటంటే... ఎప్పుడూ చేసే వంటలే కదా అనో. రోజూ తినే రుచులే కదా అనో చప్పరించేయడం కాదు... ఆ వంటలకు ఒక ప్రత్యేకతను తీసుకురావాలి. ఆ రుచులు చూడటంలో... అంటే రుచులను పసిగట్టడంలో కూడా నేర్పును సంపాదించాలి. టీ, కాఫీ, ఇతర పానీయాలను టేస్ట్ చూస్తూ... హాయిగా కంటì నిండా నిద్రపోతూ కూడా లక్షలు కాదు.. కోట్లు సంపాదించే వారున్నారన్నది జ్ఞాపకం చేసుకోవాలి.
చదవండి: Today tip : ఈజీగా బరువు తగ్గాలంటే ఇవిగో ఆసనాలు
Tags : 1