Breaking News

అపుడు కటిక పేదరికం : ఇపుడు పూలసాగుతో కోట్ల ఆదాయం

Published on Sat, 10/19/2024 - 15:50

దిల్లు ఉన్నోడు దునియా మొత్తం ఏలతాడు అన్నది  సినిమా డైలాగే కానీ దీన్ని అక్షరాలా రుజువు చేసి చూపించాడు  రైతు కుటుంబంలో పుట్టిన శ్రీకాంత్ బొల్లాపల్లి. చిన్నతనంలో కడు పేదరికంలో గడిపాడు. పదవ తరగతి స్కూలు ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేకపోవడంతో ఏదో ఒక పని చేసుకోవాలని భావించాడు. బెంగళూరులో  వెయ్యి రూపాయలకు పనిచేశాడు. అక్కడ ఆయన జీవితం మలుపుతిరిగింది. లాభదాయకమైన పూలసాగు గురించి తెలుసుకుని సక్సెస్‌ అయ్యాడు. కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు.  

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో రైతు కుటుంబంలో పుట్టి పెరిగాడు శ్రీకాంత్‌.  అతని కుటుంబం వ్యవసాయ కుటుంబమే కానీ పెద్దగా లాభసాటిగా లేదు. చదువుకొని ఉద్యోగం చేయాలనుకున్నాడు. అదీ కుదరలేదు. అటుపేదరికం, ఇటు అప్పులు ఇలా అనేక సవాళ్లు కళ్లముందు కనిపించాయి. దీంతో16 ఏళ్లకే 1995లో  బెంగళూరులో బంధువులతో కలిసి పనిచేయాల్సి వచ్చింది. అక్కడ పూల పెంపకం గురించి తెలుసుకుని మళ్లీ వ్యవసాయం చేయాలన్న కోరిక పుట్టింది.

నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఏడాది పని చేసిన తర్వాత, శ్రీకాంత్ వ్యాపారానికి సంబంధించిన మెళకువలతో సిద్ధమయ్యాడు. పూలసాగు, కోత, మార్కెటింగ్ ,పువ్వుల ఎగుమతి ఇలా ప్రతిదీ నేర్చుకున్నాడు. తొలుత చాలా తక్కువ పెట్టుబడితో రైతుల నుండి పూలను సేకరించి వాటితో వ్యాపారం చేయడం ప్రారంభించాడు. 1997లో నగరంలో చిన్న పూల దుకాణాన్ని ప్రారంభించాడు. అలా ఒక పదేళ్లు పనిచేశాక ఇతర పూల పెంపకం దారులతో సహా పరిశ్రమలోని ఇతరులతో పరిచయాలు బాగా పెరిగాయి. దీంతో సొంతంగా పూలసాగులోకి దిగాడు.  

నేషనల్ హార్టికల్చర్ బోర్డును సంప్రదించి, ప్రభుత్వ రుణం తీసుకొని బెంగళూరులోని దొడ్డబళ్లాపుర సమీపంలోని  10 ఎకరాలతో ప్రారంభించిన పూలసాగు  ఆయన ఇప్పుడు 52 ఎకరాలకు చేరింది.  52 ఎకరాల పొలంలో గులాబీలు, జెర్బెరా, కార్నేషన్లు, జిప్సోఫిలా  ఇలా 12 రకాలకు పైగా పూలను పండిస్తున్నాడు శ్రీకాంత్.  ఏడాదికి దాదాపు 70 కోట్లదాకా సంపాదిస్తున్నాడు.

వ్యవసాయంలో ముఖ్యంగా వాతావరణ పరిస్థితులలో మార్పులకారణంగా కష్టాలు, సవాళ్లు చాలా ఉంటాయి. దృఢ సంకల్పం , సహనమే  తనను  ఉన్నత స్థితికి తీసుకువెళ్లింది అంటాడు శ్రీకాంత్‌.  తన సాగు అంతా సేంద్రీయంగా ఉంటుందనీ, గ్రీన్‌హౌస్‌లు, పాలీహౌస్‌లలో సేంద్రీయంగా పెంచుతానని తెలిపాడు. దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లతో, శ్రీకాంత్ రూ. 70 కోట్ల టర్నోవర్‌ను సాధించాడు. గ్రామీణ కర్నాటక చుటుపక్కల 200 మందికి పైగా ఉపాధి కల్పిస్తూ విజయబాటలో నడుస్తున్నాడు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)