Breaking News

అమ్మ కోరిక తీర్చాలనే పట్టుదలతో టాప్‌లో నిలిచాడు : సక్సెస్ స్టోరీ

Published on Wed, 01/22/2025 - 16:04

పిల్లల ఎదుగుదలకు, అభివృద్ధిలో తల్లి తండ్రుల పాత్ర చాలా కీలకమైంది.  అమ్మానాన్న ప్రోద్బలంతోనే బాగా చదువుకుంటే, మంచి జీవితం ఉంటుందని, సాధించాలనే పట్టుదల ఉంటే, ఎలాంటి కలల్ని అయినా  సాకారం చేసుకోవచ్చనే గుణం అలవడుతుంది. అలా బాగా చదువుకుని తన కుటుంబానికి పేరు తేవడమే కాదు  యూపీఎస్సీ సివిల్స్(UPSC Civils) మంచి  ర్యాంకు సాధించాడు. అతని పేరే మర్రిపాటి నాగభరత్(Marripati Naga Bharath).  పదండి నాగ భరత్‌ సక్సెస్‌గురించి తెలుసుకుందాం.

వైఎస్సార్ కడప జిల్లాకు నాగభరత్‌ చిన్నప్పటినుంచి చదువులో బాగా రాణించాడు. ఉన్నత విద్య పూర్తైన తర్వాత సాఫ్ట్ వేర్ జాబ్ సాధించాడు.  చక్కటి జీవితం. సంతృప్తికరమైన జీతం. కానీ కలెక్టర్‌ అవ్వాలన్న అమ్మ కోరిక నెరవేరలేదనే వెలితి అతడిని వెంటాడింది. అందుకే 15 లక్షల రూపాయల వేతనాన్ని వదులుకొని మరీ యూపీఎస్సీపై దృష్టి పెట్టాడు.  2023 యూపీఎస్సీ సివిల్స్( UPSC Civils ) ఫలితాల్లో  విద్యార్థి ఉన్న‌త ర్యాంక్ సాధించాడు.

నాగ భరత్ ఖరగ్ పూర్ ఐఐటీలో( Kharagpur IIT ) బీటెక్ పూర్తి చేయడంతో పాటు అక్కడే ఎంటెక్ కూడా పూర్తి చేశాడు. అయితే సివిల్స్‌ కొట్టాలనే ప్రయత్నాల్లో  2022లో ఇంటర్వ్యూ వరకు వెళ్లి వెనక్కు వచ్చాడు. అయినా సరే పట్టువీడలేదు. ఆశించిన ఫలితాలు రాకపోయినా నాగభరత్ మాత్రం వెనుకడుగు వేయలేదు. నిపుణుల శిక్షణలో మరింత రాటు దేలాడు. చివరికి  580వ ర్యాంక్ సాధించాడు.

తల్లి కోరిక (ఈమె 2013లో  చనిపోయింది.) మేరకు బాల్యం నుంచి కలెక్టర్ కావాలని నిర్ణయం తీసుకున్న నాగభరత్ భవిష్యత్తుపై చాలా ధీమా వ్యక్తం చేశాడు. ఐఏఎస్‌గా ఎంపికై పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తానని వెల్లడించాడు. రైతుల కష్టాలు తీర్చడానికి తన వంతు ప్రయత్నిస్తానని చెప్పడం విశేషం. అంతేకాదు తన చిన్నతనంలో తండ్రి కలెక్టర్‌ అంటే ఏంటి? ఈ పదవి ద్వారా ఎలాంటి అభివృద్ధి  పనులు చేపట్టవచ్చు అనేది చెప్పేవారట. పేదలకు ఎలా సాయం  చేయవచ్చో కూడా వివరించేవారట. తన తల్లి కోరిక,కల కూడా అదేనని, అమ్మనాన్నలే తన విజయానికి స్ఫూర్తి అని చెప్పాడు గర్వంగా. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని  ముస్సోరిలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో శిక్షణలో ఉన్నాడు. (ఒకే ఒక్క మాటతో 94 నుంచి 71 కిలోలకు : ఏం చేసిందో తెలిస్తే ఫిదానే!)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)