Breaking News

నా దారి రహదారి : రివర్స్‌ వాకింగ్‌

Published on Wed, 04/23/2025 - 14:23

ప్రతి రోజూ అందరూ వాకింగ్‌ చేస్తారు.. అతడు కూడా అందరిలానే వాకింగ్‌  చేస్తాడు.. అయితే అందరికన్నా భిన్నంగా వెనక్కి నడుస్తాడు.. అదే రివర్స్‌ వాకింగ్‌ అండి. అతడే కూకట్‌పల్లి, వివేకానందనగర్‌లో నివాస ముండే అన్య శ్రీధర్‌. నగరంలోని ఓ ఫార్మాకంపెనీలో మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ప్రతి రోజూ 5 గంటలకే వాకింగ్‌ మొదలుపెడతాడు. ఇంటి నుంచి బయలుదేరే సమయంలో అందరూ ముందుకు నడుస్తుంటారు.. ఆయన మాత్రం వెనుకవైపు నడుస్తూ.. వేగంగా పరుగెత్తటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పక్కనుంచి నడవడానికి కష్టంగా ఉన్న ఈ రోజుల్లో శ్రీధర్‌ మాత్రం వెనుక వైపు పరుగెత్తటం విశేషం.

ప్రతి రోజూ వివేకానందనగర్‌ కాలనీలోని వాకర్స్‌ రూట్‌లో యువకులతో సహా అందరూ ముందుకు నడుస్తుంటారు. అంతేకాకుండా వాకింగ్‌ చేసేవారు ఒకటిన్నర కిలోమీటర్లను సుమారు 15 నిమిషాలు నడుస్తుండగా.. శ్రీధర్‌ వెనుకవైపు 10 నిమిషాల్లోపు పరుగెత్తటం విశేషం. దాదాపు 17 నుంచి 20 నిమిషాల్లో రెండు రౌండ్లను రివర్స్‌లో పూర్తిచేస్తాడు. వ్యాయామం విషయంలో కూడా అందరూ నిలబడి కాళ్లను సైక్లింగ్‌లాగా వ్యాయామం చేసారు. తను మాత్రం తల కిందికి పెట్టి కాళ్ళను దాదాపు 5 నిమిషాల సేపు వాకింగ్‌ సైక్లింగ్‌ చేయటం విశేషం. అంతేకాకుండా తల కిందికి పెట్టి కాళ్లు పైకి పెట్టి 3 నిమిషాల సేపు ఉంటారు. ఈ విధంగా శ్రీధర్‌ ఆరు పదుల వయసులో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే విధంగా వ్యాయమం చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ‘తాను గతంలో సాధారణ వాకింగ్‌తో పాటు వ్యాయామం చేసేవాడినని, తాను ఒక ఆర్టికల్‌ చదివి హృదయ సంబంధిత వ్యాధులకు చెక్‌ పెట్టే విధంగా ఈ వ్యాయామం పనిచేస్తుందని గ్రహించినట్లు తెలిపారు. అప్పటి నుంచి ఈ వ్యాయామంపై ప్రత్యేక దృష్టి సారించి వాకింగ్‌ చేయటం మొదలు పెట్టానని, దాదాపు మూడు సంవత్సరాలుగా రివర్స్‌ వాకింగ్‌ చేస్తూ.. తనలాంటి మరికొందరికి శిక్షణ కూడా ఇస్తున్నట్లు ‘సాక్షి’తో తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూత్రాన్ని తాను పాటిస్తానని, తన వ్యాయామం వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే తనను మన్నించాలని కోరారు.  

 

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)