Breaking News

ఉద్యోగం కోసం వెళ్లి, 42 ఏళ్లు అక్కడే మగ్గిపోయాడు...చివరికి

Published on Thu, 04/24/2025 - 17:19

విదేశాల్లో చిక్కుకుపోయిన వ్యక్తి నాలుగు దశాబ్దాల తరువాత తిరిగి స్వదేశానికి చేరుకున్నాడు.  చక్కటి ఉద్యోగం,మంచి జీతం సంపాదించి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఆలోచనలో  పొట్టచేత పట్టుకొని వెళ్లాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో చిక్కుకుని ఒకటీ రెండూ కాదు ఏకంగా 42 ఏళ్లు అక్కడే ఉండిపోయాడు.  చివరికి అక్కడినుంచి ఎలా బైటపడ్డాడు? కుటుంబాన్ని ఎలా కలుసుకున్నాడు? ఈ హృదయ విదారక గాథకు సంబంధించిన వివరాలు  తెలుసుకుందాం రండి!

కేరళలోని త్రివేండ్రంలోని పౌడికోణం సమీపంలోని ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్న గోపాలన్  గల్ఫ్‌ దేశాలకు వెళ్లి డబ్బులు సంపాదించి, కుటుంబాన్ని ఆదుకోవాలని కలలు కన్నాడు.   ఎంతో మంది వలస కార్మికుల మాదిరిగానే ఎన్నో ఆశలతో  ఇల్లు వదిలాడు.  1983 ఆగస్టు 16న బహ్రెయిన్‌కు  వెళ్లాడు. కానీ విధి రాత మరోలా ఉంది. 

ఏమైందంటే..
గోపాలన్‌  బహ్రెయిన్‌కు చేరుకున్నాడో లేదో, అతని యజమాని అకాల మరణం చెందాడు. గోపాలన్‌ పాస్‌పోర్ట్ పోయింది. దీంతో గోపాలన్‌ అయోమయంలో పడిపోయాడు. ఇమ్మిగ్రేషన్ చిక్కులతో   బహ్రెయిన్‌లో చిక్కుకు పోయాడు.  నాలుగు గోడల మధ్య  మౌనంగా రోదిస్తూ ఉండిపోయాడు.

అయితే భారతదేశం, విదేశాలలో అన్యాయాన్నిఎదుర్కొంటున్న భారతీయుల కోసం పోరాడే రిటైర్డ్ న్యాయ మూర్తులు, న్యాయవాదులు , జర్నలిస్టులతో కూడిన ప్రవాసీ లీగల్ సెల్ (PLC) అనే NGO ద్వారా అతని పాలిట వరంగా అవతరించింది.  గోపాలన్‌ విషయం తెలుసుకుని అతనికి సాయపడింది.  పీఎల్‌సీ బహ్రెయిన్ చాప్టర్ ప్రెసిడెంట్ సుధీర్ తిరునిలత్, తన బృందంతో కలిసి బహ్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం, అక్కడి ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్‌తో సమన్వయం చేసుకుని, అష్టకష్టాలు పడి  చివరికి 74 ఏళ్ల వయసులో గోపాలన్ తిరిగి వచ్చేలా  చేశారు.

ఫలించిన తల్లి ఎదురు చూపులు 
 గోపాలన్ చివరకు 95 ఏళ్ల తల్లిని చూడటానికి ఇంటికి తిరిగి వచ్చాడు.  అలా కొడుకు కోసం  ఆమె  చూసిన ఎదురు చూపులు ఫలించాయి. ఒట్టి చేతులతో కేవలం ఎన్నో జ్ఞాపకాలు, మరెంతో కన్నీళ్లభారంతో స్వదేశానికి పయనమయ్యాడు. కుటుంబంతో తిరిగి కలవాలనే కలతో విమాన మెక్కిన రోజు అతని జీవితంలో మరపురాని రోజుగా మిగిలిపోయింది. కాసింత దయ,  మానవత్వం, న్యాయం, అవిశ్రాంత  పోరాటం ఫలితంగా వచ్చిన ఫలితమిది. ఎంతోమంది వలసదారులకు ఆశలకు ప్రాణంపోసిన ఉదంతమిది. ‘స్వాగతం గోపాలన్, ఇంటికి స్వాగతం’  అంటూ పీఎల్‌సీ తన ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్‌లో పేర్కొంది.
 

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)