Breaking News

బాంబుల మోతలు వింటూనే...జేఈఈలో సక్సెస్‌!

Published on Sat, 06/14/2025 - 10:46

అన్ని విజయాలను ఒకే గాటన కట్టలేము. అన్నీ అనుకూలంగా ఉండడం వల్ల కొన్ని విజయాలు నల్లేరు మీద నడక అవుతాయి. కొన్ని విజయాలు అలా కాదు... కారుమేఘాల్లాంటి ప్రతికూల పరిస్థితులను చీల్చుకొని వెలుగు కిరణాలు అవుతాయి.  ఇందుకు సాక్ష్యం కశ్మీరి అమ్మాయి జెనిస్‌... ఇండియా-పాక్‌ల మధ్య యుద్ధవాతావరణ ఉద్రిక్తతల నేపథ్యంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులను తట్టుకొని మరీ జేఈఈ (జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌)లో  విజయం సాధించింది.

పరీక్షకు ప్రిపేర్‌ కావాలంటే వాతావరణం ప్రశాంతంగా ఉండాలి. ఏకాగ్రతతో చదవాలి. అయితే జెనిస్‌ ప్రిపరేషన్‌కు అవేం లేవు. ‘జేఈఈ’ పరీక్షలకు కొన్నిరోజుల ముందు... పాకిస్తాన్‌ బాంబుల శబ్దం వినిపించేది. మరోవైపు విరామం ఇవ్వని సైరన్లు.  భయపెట్టేలా ఆకాశంలో డ్రోన్లు.ఎటు చూసినా భయానకమైన వాతావరణం.‘జేఈఈ పరీక్ష వాయిదా పడితే బాగుండేది’ అని మనసులో చాలాసార్లు అనుకుంది జెనిస్‌.‘ఇంత భయానక పరిస్థితుల్లో పరీక్ష రాయగలనా అనుకున్నాను’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంది. ప్రిపరేషన్‌ సంగతి ఎలా ఉన్నా ‘పరీక్ష కేంద్రానికి సురక్షితంగా చేరుకోగలనా? అసలు వెళ్లగలనా?’ అనే సందేహం ఆమె మనసులో సుడులు తిరిగేది. ‘ఇలాంటి పరిస్థితుల్లో అమ్మాయిని పరీక్షకు పంపడం సరిౖయెనదేనా?’ అని జెనిస్‌ తల్లిదండ్రులూ ఆలోచనలో పడ్డారు.

ఇదీ చదవండి: Air India plane crash కలల ఇంట్లోకి రాకముందే..అందని తీరాలకు!

‘స్కూలు రోజుల్లో నాకు జేఈఈ గురించి బొత్తిగా తెలియదు. కశ్మీర్‌లో చాలామంది తల్లిదండ్రులకు జేఈఈ గురించి తెలియదు. తమ పిల్లలను మెడిసిన్‌ చదివించా లనుకుంటారు. కశ్మీర్‌లో జేఈఈ కోచింగ్‌ సెంటర్‌లు కూడా చాలా తక్కువ. ఇంటర్మీడియెట్‌లో జేఈఈ గురించి తెలిసిన తరువాత నాలో ఆసక్తి పెరిగింది. జేఈఈ ఎగ్జామ్స్‌ రాయాలనుకున్నాను. గూగుల్‌ నాకు కోచింగ్‌ సెంటర్‌గా మారింది. జేఈఈ పరీక్షకు సంబంధించిన కంటెంట్‌ను సెర్చ్‌ చేసేదాన్ని’ అంటుంది జెనిస్‌.

మొదటి ప్రయత్నంలో విఫలం అయినా రెండో ప్రయత్నంలో ‘జేఈఈ’లో విజయం సాధించింది. మొదటిసారితో పోల్చితే రెండోసారి ‘జేఈఈ’ కోసం ప్రిపేరవుతున్నప్పుడు బయటి పరిస్థితులు కల్లోలంగా ఉన్నాయి. ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి.
ఇంటర్‌నెట్‌ షట్‌డౌన్‌ మరో సమస్య. కరెంట్‌ కోతలు సరేసరి. ‘ఇంటర్‌నెట్‌ లేకపోతే ఆ ప్రభావం ప్రిపరేషన్‌పై పడుతుంది. ఎందుకంటే నేను కోచింగ్‌ సెంటర్‌లో చేరలేదు’ అంటుంది జెనిస్‌. అయినప్పటికీ ‘ఈసారి ఎలాగైనా సాధించాల్సిందే’ అనే గట్టి పట్టుదలతో విజయం సాధించింది పుల్వామాకు చెందిన జెనిస్‌.

‘మా  ప్రాంతంలో ఇంజనీరింగ్‌ అంటే అబ్బాయిలకు మాత్రమే అన్నట్లుగా ఉండేది. నా తల్లిదండ్రులకు జేఈఈ గురించి తెలియదు. నన్ను మెడిసిన్‌ చదివించాలనేది వారి కోరిక. నేను వారికి జేఈఈ గురించి వివరించాను. నాకు మ్యాథ్స్, ఫిజిక్స్‌ అంటే ఇష్టం. జేఈఈ గురించి చెప్పినప్పుడు నువ్వు మెడిసిన్‌ చదవాల్సిందే అనకుండా నన్ను ప్రోత్సహించారు’ అని చెప్పింది జెనిస్‌. ‘జేఈఈ’ ప్రిపేర్‌ కావడానికి ముందు ఎంతోమంది బంధువులు జెనిస్‌ తల్లిదండ్రులతో.. ‘జేఈఈ అంటే అబ్బాయిలు రాసే పరీక్ష. మీరు జెనిస్‌తో మెడికల్‌ ఎంట్రెన్స్‌ రాయించండి ఇంజనీరింగ్‌ ఫీల్డ్‌లో అబ్బాయిలు మాత్రమే ఉంటారు’ అనేవాళ్లు. అయితే వారి మాటలను జెనిస్‌ తల్లిదండ్రులు పట్టించుకోలేదు.

చదవండి: 41 కాదు 24 ఏళ్లే : వయసు తగ్గించుకున్న లండన్‌​ డాక్టర్‌ సీక్రెట్‌ ఇదే!

‘నువ్వు సాధించగలవు’ అని కూతురికి ధైర్యాన్ని ఇచ్చారు.తల్లిదండ్రులు ఇచ్చిన ్ర΄ోత్సాహబలంతో తన ‘ఐఐటీ’ కలను నిజం చేసుకుంది జెనిస్‌.‘జేఈఈ’ ఎగ్జామ్‌ కోసం ప్రిపేరవుతున్నప్పుడు సైరన్లు, బ్లాకవుట్స్‌ వల్ల ఏకాగ్రత కుదిరేది కాదు. 

‘జేఈఈ’ అడ్వాన్స్‌డ్‌ ఫామ్స్‌ ఫిల్‌ చేయలేనేమో అని భయపడ్డాను. అదృష్టవశాత్తు చేయగలిగాను. ఆపరేషన్‌ సిందూర్‌ మే 7న జరిగింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఎగ్జామ్‌ మే 18. ఈ మధ్య కాలంలో ఎంతో ఉద్రిక్తత నెలకొని ఉంది. ఎక్కడెక్కడి నుంచో బాంబుల శబ్దాలు వినిపించేవి. అంతా భయంలోనూ ఈసారి ఎలాగైనా సీటు సాధించాల్సిందేనని అనుకున్నాను. – జెనిస్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)