Breaking News

Kamala Sohonie భారతీయ తొలి మహిళా డాక్టరేట్‌

Published on Mon, 04/21/2025 - 11:14

తొమ్మిది దశాబ్దాల క్రితం ఓ యువతి విజ్ఞాన శాస్త్రంలో ఎంఎస్సీ చేయడం కోసం ఒక పోరాటమే చేయాల్సివచ్చింది. ఆవిడ పోరాడింది చిన్న వ్యక్తితో కాదు. నోబెల్‌ బహుమతి గ్రహీత సీవీ రామన్‌తో! ఆ యువతి కమలా సోహానీ Kamala Sohonie). ఈవిడే సైన్సు విభాగంలో పీహెచ్‌డీ పొందిన తొలి భారతీయ మహిళ! 

బొంబాయిలో 1911 జూన్‌ 18న జన్మించారు కమలా భాగ వత్‌. బొంబాయి ప్రెసిడెన్సీ కళాశాల నుంచి రసా యన శాస్త్రంలో బీఎస్సీ పట్టా పొందారు. తర్వాత సీవీ రామన్‌ డైరెక్టర్‌గా ఉన్న టాటా సైన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ (నేడు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్, బెంగ ళూరు)లో ఎమ్మెస్సీ చదవాలని ప్రయ త్నించారు. ఆ రోజుల్లో ఉన్నత చదు వుకు మహిళలు అర్హులు కాదని భారతీయ సమాజం భావించేది. సీవీ  రామన్‌ కూడా దాన్నే నమ్మి ఆమెకు ప్రవేశాన్ని నిరాకరించారు. అయితే ఆ నిర్ణయాన్ని స్వీకరించక, గాంధీజీ ఆదర్శాలను బలంగా నమ్మిన కమలా భాగవత్‌ సత్యాగ్రహం చేయాలని నిర్ణయించుకున్నారు. తొలుత రామన్‌ మహాశ యుడు కమల పట్టుదలను గమనించ లేకపోయారు. ఆమె మౌనంగా రోజుల తరబడి నిరసన తెలపడంతో రామన్‌ దిగిరాక తప్పలేదు. చివరకు ప్రవేశ మిచ్చారు. అయితే కొన్ని నిబంధనలతో! అది కూడా రెగ్యులర్‌ విద్యార్థిగా తీసుకోలేదు. ఒక సంవత్సరం పాటు ప్రొబేషనరీగా చేరవలసి వచ్చింది. ‘అవసరమైతేనే రాత్రింబవళ్ళు కష్టపడాలి. ప్రయోగశాల వాతావరణాన్ని పాడు చేయకూడదు’– ఇలాంటివి ఆ అధ్వాన్నపు నిబంధనలు! 

అయితే లక్ష్యసాధన కోసం ఓర్చుకుని కష్టపడి 1936లో ఎమ్మెస్సీ డిగ్రీ పొందారు. పాలు, పప్పు, చిక్కుళ్ళలో ప్రొటీన్ల గురించి కమల శోధించి ఎమ్మెస్సీ పట్టా కోసం సిద్ధాంత గ్రంథం రాశారు.దీంతో రామన్‌ మహిళాశక్తిని గుర్తించి ఆ సంవత్సరం నుంచే విద్యార్థినులకు అవకాశం కల్పించడంప్రారంభించారు. అలా కమల విజ్ఞాన శాస్త్రాల అధ్య యనానికి సంబంధించి మహిళలకు తొలి దారి దీపమయ్యారు.     పీహెచ్‌డీ కోసం కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చేరారు. తన 16 నెలల పరిశోధనలో ‘సైటోక్రోమ్‌ సి’ అనే ఎంజైమ్‌ ఉందనీ, అన్ని మొక్కల కణాలలో జరిగే ఆక్సీకరణలో దీని పాత్ర ఉంటు న్నదనీ కనుగొన్నారు. తన పరిశోధనా ఫలితాలను కేవలం 40 పుటలు ఉన్న సిద్ధాంత గ్రంథంగా కేంబ్రిడ్జి యూని వర్సిటీకి సమర్పించి పీహెచ్‌డీ పట్టా పొందారు. విజ్ఞాన

శాస్త్ర రంగంలో పీహెచ్‌డీ పొందిన తొలి భారతీయ మహిళగా కమల అవతరించారు.ఇండియా వచ్చి వివిధ ఉద్యోగాలు చేస్తున్న సమయంలో ఎం.వి. సోహా నీతో 1947లో వివాహం జరిగింది. అప్పటి నుంచి కమలా భాగవత్‌పేరు కమలా సోహానీగా మారింది. ఆమె చేసిన పరిశోధనలు భారతీయ సమాజానికి చాలా విలువైనవి. పప్పు ధాన్యాలు, చిక్కుళ్ళు, తాటి బెల్లం, నీరా లేదా ఈత కల్లు,  తాటి మొలాసిస్, బియ్యప్పిండి మొదలైన వాటి పోషక విలువలకు సంబంధించి ఆమె చేసిన పరిశోధనలు తిరుగు లేనివి.
ఎనభయ్యారేళ్ళ వయసులో న్యూఢిల్లీలో తనను గౌరవించడానికి ఏర్పాటు చేసిన సమావేశంలో 1998 జూన్‌ 28న ఆమె హఠాత్తుగా మరణించడం ఆమె జీవన యాత్రకు ఆశ్చర్యకరమైన ముగింపు!

– డా.నాగసూరి వేణుగోపాల్, ఆకాశవాణి మాజీ ఉన్నతాధికారి
 

#

Tags : 1

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి