Breaking News

ప్రైవేట్‌ జెట్‌, రూ.100 కోట్ల లగ్జరీ బం​​గ్లా, యాడ్స్‌తో కోట్లు, ఎవరీ ‘తార’

Published on Fri, 03/15/2024 - 16:51

ఇతర రంగాలతో పోలిస్తే చిత్ర పరిశ్రమలో పురుషుల డామినేషన్‌ ఎక్కువగా ఉంటుంది. తెరమీద ఎలివేషన్లు, బీజీఏంలు హీరోల కున్నంతగా హీరోయిన్లకు ఉండవు.  ఇక రెమ్యునరేషన్ల సంగతి సరే సరి. అయితే ఈ అడ్డుగోడల్ని బద్దలుకొట్టి చాలా కొద్దిమంది అయినా కథానాయకలుగా, డైరెక్టరులుగా తమ సత్తాచాటుకుంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు,  బాక్సాఫీసు వసూళ్లతో మేమూ సూపర్‌ స్టార్లమే అని నిరూపించుకుంటున్నారు. డైరెక్టర్లు, నిర్మాతల ఫేవరెట్స్‌గా అవత రిస్తున్నారు. అలాంటి వారిలో భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటూ లేడి సూప‌ర్ స్టార్‌గా పాపులర్ అయిన న‌య‌న‌తార  ఒకరు.

పార్ట్ టైమ్ మోడల్‌గా మొదలై,  టెలివిజన్ ప్రెజెంటర్‌నుంచి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన తార నయనతార. స్టార్ హీరోల‌ని మించిన ఫ్యాన్ ఫాలోయింగ్‌, అంతకుమించిన క్రేజ్‌తో  న‌య‌న‌తార‌నా మ‌జాకానా అనిపించుకుంటోంది.  కరియర్‌లో కొన్ని ఎదురు దెబ్బలు తగిలినా డిజాస్టర్స్‌ వెక్కిరించినా వరుస సినిమాలతో ప్రేక్షకులను మదిలో స్టార్‌ హీరోయిన్‌గా ముద్ర వేసుకుంది.  

తాజాగా నయన్‌ 50 సెకన్ల యాడ్‌కు రూ. 5 కోట్ల రూపాయల దాకా వసూలు చేసిందన్న  వార్త హాట్‌ టాపిక్‌గా నిలిచింది.  పలు మీడియా కథనాల ప్రకారం నయనతార 50 సెకన్ల ఒక  కార్పొరేట్‌ ప్రకటన కోసం ఏకంగా రూ. 5 కోట్లు వసూలు చేసిందట. అంతేకాదు నయనతార ప్రతీ మూవీకి  రూ. 10 కోట్లు వసూలు చేస్తుందనే ప్రచారం కూడా ఉంది. 

అంతేకాదు ముంబైలో లగ్జరీ బంగ్లాతో సహా 4 విలాసవంతమైన ఇళ్లున్నాయి.  రూ 100 కోట్ల విలువైన లగ్జరీ బంగ్లాలో భర్త విఘ్నేష్‌తో, ఇద్దరు ప్లిలలతో నివస్తోంది. ఇంకా ఖరీదైన కార్ల కలెక్షన్‌, లగ్జరీ ప్రైవేట్ జెట్స్‌కూడా నయన్‌, విఘ్నేష్‌ సొంతం. ఇటీవల ఇద్దరూ విడిపో బోతున్నారన్న వార్తలను కూడా ఖండించారు ఈ స్వీట్‌ కపుల్‌.

కాగా  గత ఏడాది అట్లీ దర్శకత్వంలో వచ్చి జవాన్‌ మూవీతో  షారుఖ్‌తో కలిసి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.  యాక్షన్-ప్యాక్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేసింది. అయితే ఆమె నటించిన అన్నపూరణి  చిత్రం మాత్రం వివాదంలోచిక్కుకుంది. ఈ వివాదంపై క్షమాపణలు చెప్పినప్పటికీ ఫలితం లేకపోయింది.  

Videos

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)