Breaking News

దంపతుల ‘మొక్క’వోని దీక్ష, ఏడాదికి రూ. లక్ష ఖర్చు

Published on Tue, 07/15/2025 - 13:08

కోల్‌సిటీ(రామగుండం):  ఆ ఇంటి ఆవరణలోకి అడుగుపెట్టగానే చల్లని వాతావరణం.. ఆకట్టుకునే పచ్చని మొక్కలు.. తీరొక్కపూలు స్వాగతం పలుకుతున్నాయి. గోదావరిఖని మార్కండేయకాలనీకి చెందిన ఆడెపు రామకృష్ణ దంపతులు తమ ఇంటిని పచ్చదనంతో నింపేసి పొదరిల్లుగా మార్చుకుని.. పర్యావరణానికి ఊపిరిపోస్తున్నారు. ఓ స్కూల్‌లో విద్యాబోధన చేస్తున్న గీతాశ్రీ– రామకృష్ణ దంపతులకు మొక్కల పెంపకం అంటే చాలాఇష్టం. గతంలో రామకృష్ణ ఎకో క్లబ్‌లో చేరి మొక్కల పెంపకంపై శిక్షణ పొందారు. ఆ తర్వాత 24 ఏళ్లుగా తన ఇంటి ఆవరణలోనే వివిధ రకాల పూలు, పండ్లు, స్వచ్ఛమైన గాలి అందించే అనేకరకాల మొక్కలు పెంచుతున్నారు. ఆకుకూరలూ సాగు చేస్తున్నారు. వంటగదిలోని వ్యర్థాలు,  ఎండుఆకులు, కుళ్లిన కూరగాయలతో సేంద్రియ ఎరువు తయారు చేస్తూ మొక్కలకు వేస్తున్నారు. పనికిరాని వస్తువులు, ప్లాస్టిక్‌ డబ్బాలు, టోపీలు, బకెట్లు, పాడైన కూలర్లు, ఇంట్లోనే తయారు చేసిన సిమెంట్‌ కుండీలే మొక్కలకు నిలయాలుగా మార్చారు.  

ఏడాదికి రూ.లక్ష ఖర్చు 
నేను 24 ఏళ్లుగా మొక్కలు పెంచుతున్న. ఇది నాకు హాబీగా మారింది. ఎక్కడికి వెళ్లినా, ఎక్కడ శుభకార్యం జరిగినా అక్కడికి మొక్కతో వెళ్తాను. కొత్త మొక్కలు కనిపిస్తే ఖర్చుకోసం ఆలోచించకుండా కొంటాను. ఏడాదికి మొక్కల కొనుగోలుకు రూ.లక్ష వరకు ఖర్చు చేస్తుంటా. ఇంట్లోనే సేంద్రియ ఎరువు, సిమెంట్‌ తొట్టీలను తయారు చేస్తున్న. మొక్కల పెంపకంతో మాకు ఎంతో మానసిక ఆనందం కలుగుతుంది.    – ఆడెపు రామకృష్ణ, గోదావరిఖని

ఇదీ చదవండి: సింపుల్‌ చిట్కాలతో 15 కిలోలు తగ్గింది : నచ్చిన బట్టలు, క్రాప్‌ టాప్‌లు
 

Videos

Weather: ఏపీకి భారీ వర్ష సూచన

YSR జిల్లా బద్వేల్‌లో అంగన్వాడి సెంటర్లకు పురుగుపట్టిన కందిపప్పు సరఫరా

మసూద్ అజహర్ ఆచూకీ పసిగట్టిన నిఘావర్గాలు

అక్రమంగా పేదవారి భూమి లాగేసుకున్న టీడీపీ ఎమ్మెల్యే

YSRCP ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించిన మున్సిపల్ అధికారులు

హైదరాబాద్ లో భారీ వర్షం

రాబర్డ్ వాద్రాపై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలుచేయడంపై స్పందించిన రాహుల్ గాంధీ

పదేళ్లు సెక్రటేరియట్ కు రాకుండా ప్రజలకు దూరంగా కేసీఆర్ పాలన చేశారు

భాను ప్రకాష్... వ్యక్తిగత వ్యాఖ్యలు సరికాదు: వరుదు కల్యాణి

రోజాపై భాను గాలి ప్రకాష్ వ్యాఖ్యలు YSRCP పూర్ణమ్మ ఉగ్రరూపం..

Photos

+5

హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన..చెరువుల్లా మారిన రోడ్లు (ఫొటోలు)

+5

‘నా సీతా సీమంతం’ శ్రీమతి సీమంతంపై బిగ్‌బాస్‌ ఫేం పోస్ట్‌ (ఫొటోలు)

+5

‘నేను నా శివయ్య’ అంటున్న ఈ భక్తురాల్ని చూశారా?

+5

చందమామలా.. చీర సింగారించుకుని క్యూట్‌గా తెలుగు బ్యూటీ!

+5

ఆంధ్రా సరిహద్దులో.. ఉరకలేస్తున్న జలపాతాలు(చిత్రాలు)

+5

కుమారుడితో తొలిసారి తిరుమలలో హీరోయిన్ ప్రణీత (ఫొటోలు)

+5

'పరదా' సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)

+5

రెడ్‌ శారీలో ‘జూనియర్‌’మూవీ ఈవెంట్‌లో మెరిసిన శ్రీలీల (ఫొటోలు)

+5

ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ సీజన్ 2 ట్రోఫీ ఆవిష్కరించిన సల్మాన్ ఖాన్ (ఫొటోలు)

+5

కరీంనగర్ లో సినీనటి అనుపమ పరమేశ్వరన్ సందడి (ఫొటోలు)