చిన్న వయసు నుంచే పర్యావరణ కోసం పోరాడుతోంది

Published on Sat, 09/27/2025 - 14:31

పిల్లలూ.... ఈ ప్రకృతి దానిలో భాగమైన భూమి మనకు దొరికిన వరం. ఇది మనుషులైన మనతోపాటు అనేక జీవాలకు ఆవాసం. మరి అంతటి విలువైన ప్రకృతిని సంరక్షించు కోవాల్సిన మనం ఏం చేస్తున్నాం? అనేక రూపాల్లో రోజు రోజుకీ ద్వంసం చేస్తున్నాం. 

కానీ మణిపూర్‌కు చెందిన లిసిప్రియా కంగుజాం (Licypriya Kangujam) మాత్రం ‘ఈ సమస్త భూమండలాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది’ అని తన ఆరేళ్ళ వయసు నుండి పర్యావరణ సమస్యల మీద అవగాహన కల్పించడం  ప్రారంభించింది. 

2011లో జన్మించిన ఈ బాలిక, 2018లో అంటే ఆరేళ్ళ వయసులో చైల్డ్‌ మూవ్‌మెంట్‌ అనే సంస్థను స్థాపించి, క్లైమేట్‌ చేంజ్‌ను ఎదుర్కొనేందుకు పిల్లలను సమీకరించింది. లిసిప్రియా 2019లో యునైటెడ్‌ నేషన్స్‌  క్లైమేట్‌ చేంజ్‌ కాన్ఫరెన్స్‌ లో మాట్లాడి, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఆమె ప్రసంగంలో పర్యావరణ రక్షణ కోసం యువత శక్తిని ఉపయోగించాలని నొక్కి చెప్పింది. 

భారతదేశంలో క్లైమేట్‌ చేంజ్‌ను పాఠ్యాంశంలో చేర్చాలని, శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించాలని కోరింది. సామాజిక మాధ్యమాల ద్వారా ఆమె సందేశం లక్షల మంది యువతకు చేరడంతో ఆమె  పోరాటానికి గుర్తింపుగా 2019లో డాక్టర్‌ ఎపిజె అబ్దుల్‌ కలాం చిల్డ్రన్స్‌ అవార్డ్, 2020లో గ్లోబల్‌ చైల్డ్‌  ప్రొడిజీ అవార్డ్‌ వంటి పురస్కారాలు అందుకుంది. లిసిప్రియా, సమకాలీన సమాజంలో యువతకు స్ఫూర్తిగా నిలిచి, పర్యావరణ రక్షణ కోసం అవిశ్రాంత కృషి చేస్తోంది, భవిష్యత్‌ తరాలకు మార్గం సుగమం చేస్తూ. అంతేకాకుండా ప్రపంచ నాయకులను పర్యావరణ సంక్షోభానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోమని ప్రేరేపించడమే లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా కషిచేస్తుంది.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)