జనసేన MLAపై బాబు సీరియస్
Breaking News
Yoga 9 ఏళ్లకే గిన్నిస్ రికార్డు‘యోగం’
Published on Sat, 05/31/2025 - 10:01
యోగాసనాలు వేయడం పూర్తిగా నేర్చుకోవాలంటే చాలా కాలం పడుతుంది. యోగా హెల్త్‌కు మంచిదని మనకు తెలుసు కదా. యోగాను తప్పకుండా గురువు దగ్గరే నేర్చుకోవాలి. అయితే రేయాంశ్ సురాని అనే బాలుడు తొమ్మిదేళ్లకే యోగా గురువుగా మారాడు. గిన్నిస్ బుక్‌లో చోటు కూడా సంపాదించాడు. ఇది చాలా ఇన్‌స్పయిర్ చేసే విషయం మనకు.
మన దేశానికి చెందిన రేయాంశ్ సురాని (Reyansh Surani) తల్లిదండ్రులతో కలిసి దుబాయిలో ఉంటున్నాడు. నాలుగేళ్ల వయసులో నానమ్మ, తాతయ్య యోగాసనాలు వేయడం చూశాడు. తనూ వారిని అనుసరించడం మొదలుపెట్టాడు. దీంతో వారు యోగాసనాలు నేర్పించారు. ఆ తర్వాత తల్లిదండ్రులతో కలిసి మన దేశంలోని రిషికేశ్ వచ్చి యోగా కోర్సులో చేరాడు. అక్కడ నెల రోజులు ఉండి శ్రద్ధగా యోగాసనాలు నేర్చుకున్నాడు. రోజూ ఉదయం 7 నుంచి సాయంత్రం ఏడున్నర దాకా యోగా క్లాసులోనే గడిపేవాడు. అక్కడ వారిని చూసి తను కూడా యోగా శిక్షకుడిగా మారాలని భావించాడు.
చదవండి: మెకంజీ షాక్, ప్రియురాలితో రెండో పెళ్లికిముందే జాగ్రత్తపడుతున్న జెఫ్ బెజోస్
అందుకోసం సుమారు 200 గంటల కోర్సు చేశాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా లెక్క చేయలేదు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో యోగా శిక్షకుడిగా మారాడు. ఆ సమయానికి అతని వయసు 9 ఏళ్లు. దీంతో 2021 జులైలో ‘ప్రపంచంలో అతి చిన్న వయసున్న యోగా శిక్షకుడు’గా గిన్నిస్ ప్రతినిధులు రికార్డు అందించారు. గాలిలో నిలబడి యోగాసనాలు వేయడాన్ని సైతం రేయాంశ్ సాధన చేశాడు. దీంతోపాటు ‘The Avid World of Reyansh' పేరుతో 2022లో ఓ పుస్తకం రాశాడు. ప్రస్తుతం అతనికి 13 ఏళ్లు. యోగాలో మరింత సాధన చేసి, ఉత్తమ శిక్షకుడిగా పేరు తెచ్చుకోవాలని ఆశపడుతున్నాడు.
ఇదీ చదవండి: World Anti Tobacco Day: 1, 2, 3 కేన్సర్ దాకా అవసరమా మిత్రమా!
Tags : 1