Breaking News

గర్భం దాలుస్తున్నాను... కానీ...

Published on Sun, 04/12/2026 - 03:31

నాకు 30 సంవత్సరాలు. మా పెళ్లై ఐదు సంవత్సరాలు అయ్యింది. ప్రతిసారి నేను గర్భం దాల్చుతున్నాను, కానీ రెండు నుంచి మూడు నెలల్లోనే మిస్‌క్యారేజ్‌ అవుతోంది. ఇది మూడుసార్లకు పైగా జరిగింది. మాకు ఒక హెల్దీ బేబీ కావాలి. దీనికి కారణం ఏమిటి? ఎలా ట్రీట్‌ చేయాలి?
– సుజాత, విజయవాడ.

మూడుసార్లకు పైగా రిపీటెడ్‌గా మిస్‌క్యారేజ్‌ అవుతుంటే దాన్ని రికరెంట్‌ ప్రెగ్నెన్సీ లాస్‌ అంటారు. అంటే ప్రతిసారి ఎందుకు మిస్‌క్యారేజ్‌ అవుతోంది అన్నది తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు చేసి కారణాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఈ పరిశీలనలో ముందుగా డీటెయిల్డ్‌ హిస్టరీ తీసుకోవాలి. 

అసలు స్కాన్‌ చేయించారా లేదా, ఎన్ని రోజులకు లేదా ఎన్ని వారాలకు మిస్‌క్యారేజ్‌ అవుతోంది అన్నది తెలుసుకోవాలి. రెండు నెలలు పూరై్తన తర్వాత జరుగుతుందా, లేక ప్రెగ్నెన్సీ టెస్ట్‌ పాజిటివ్‌ అయిన వెంటనే జరుగుతుందా అన్నది కూడా అడగాలి. అలాగే స్కాన్‌ లో బేబీ హార్ట్‌బీట్‌ ఫార్మేషన్‌ ఉందా లేదా, ఒకసారి హార్ట్‌బీట్‌ వచ్చి పోయాక మిస్‌క్యారేజ్‌ అవుతోందా అన్నది కూడా డీటెయిల్డ్‌గా తెలుసుకోవాలి. ఇలా ఎందుకు జరుగుతోంది అన్నది పూర్తిగా పరిశీలించాలి. సాధారణంగా మొదటి మూడు నెలల్లో, అంటే 12 వారాల లోపల రిపీటెడ్‌గా మిస్‌క్యారేజ్‌ కావడానికి కారణాలు; అలాగే మూడు నెలల తర్వాత మిస్‌క్యారేజ్‌ కావడానికి కారణాలు వేర్వేరుగా ఉంటాయి. ఈ పేషెంట్‌కు మొదటి మూడు నెలల్లోనే జరుగుతోంది కాబట్టి ముఖ్యమైన కారణాలు ఏమిటంటే, ముందుగా తల్లికి, తండ్రికి జెనెటిక్‌ పరీక్షలు చేసి, జెనెటిక్‌ సమస్యలు ఉన్నాయా అని చెక్‌ చేయాలి. 

అలాగే మిస్‌క్యారేజ్‌ అయినప్పుడు బయటికి వచ్చిన టిష్యూ ఉంటే దానికి కూడా జెనెటిక్‌ పరీక్షలు చేసి, ఏదైనా జెనెటిక్‌ సమస్య ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. అలా ఉంటే జెనెటిక్‌ కౌన్సెలింగ్‌ ద్వారా సరైన మార్గదర్శకాలు తీసుకోవచ్చు. వయస్సు కూడా చాలా ముఖ్యమైన అంశం. సాధారణంగా తల్లి వయస్సు 35 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండటం లేదా తండ్రి వయస్సు 40 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండటం వల్ల మిస్‌క్యారేజ్‌ వచ్చే ప్రమాదం కొంచెం పెరుగుతుంది. అలాగే మధుమేహం ఉందా, థైరాయిడ్‌ సమస్య ఉందా, లేదా ఇతర వ్యాధులు ఉన్నాయా అన్నది కూడా పరిశీలించాలి. ముఖ్యంగా రక్త సంబంధిత లేదా ఇతర శరీర వ్యవస్థల సమస్యలు ఉన్నా కూడా మిస్‌క్యారేజ్‌ వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఒక స్కాన్‌ ద్వారా గర్భసంచి ఆకారం ఎలా ఉంది అన్నది చూడాలి. గర్భసంచిలో ఏదైనా నిర్మాణ లోపం ఉందా లేదా గర్భసంచి ఆకారం సాధారణంగా ఉందా అన్నది చెక్‌ చేయాలి. 

మంచి స్కాన్‌ ద్వారా గర్భసంచిలో ఏదైనా పొర లాంటిది ఉండి, దాని వల్ల బ్లడ్‌ సప్లై సరిగ్గా అందకపోతుందా అన్నది తెలుసుకోవచ్చు. ఇలాంటి సమస్య ఉంటే కొన్ని సందర్భాల్లో చిన్న ప్రొసీజర్‌ ద్వారా దాన్ని సరిచేసే అవకాశం కూడా ఉంటుంది. ఇంకో ముఖ్యమైన కారణం రక్తం గడ్డకట్టే సమస్యలు. వీటిని థ్రాంబోఫీలియాస్‌ అని అంటారు. అంటే రక్తంలో ఉండే గడ్డకట్టే లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల గర్భానికి సరైన రక్తప్రసరణ జరగక మిస్‌క్యారేజ్‌ కావచ్చు. ఇందులో కొన్ని ప్రత్యేక పరీక్షలు చేసి, ఏదైనా తేడా ఉంటే దానికి సరైన మందులు ఇవ్వవచ్చు. కొన్నిసార్లు అన్ని పరీక్షలు చేసినా కూడా కారణం స్పష్టంగా కనిపించకపోవచ్చు. అలాంటి సందర్భాలను అనెక్స్‌ప్లెయిన్‌  మిస్‌క్యారేజ్‌ అంటారు. అయినప్పటికీ, చిన్న చిన్న కారణాలు గుర్తించినా వాటిని ట్రీట్‌ చేయడానికి ప్రయత్నించి, భవిష్యత్తులో ఒక హెల్దీ బేబీ కోసం తల్లిదండ్రులు డాక్టర్‌ కలిసి ప్రయత్నించవచ్చు. 

మేని మాట

శరీరం ‘తనను తానే శుభ్రం’ చేసుకుంటుంది!
రోజూ స్నానం చేస్తూ శరీరాన్ని మీరు శుభ్రంగా ఉంచుకుంటున్నారని అనుకుంటున్నారా? కానీ, అసలు క్లీనింగ్‌ మాత్రం లోపలే జరుగుతోంది!  మన శరీరంలో ‘అటో ఫాగీ’  ప్రక్రియ నిరంతరాయంగా పనిచేస్తూ, పాడైన కణాలను తొలగించి కొత్త కణాలను సృష్టిస్తుంది. ముఖ్యంగా మనం నిద్రపోతున్నప్పుడు, ఉపవాసం చేస్తున్నప్పుడు ఈ ‘ఇన్నర్‌ క్లీనింగ్‌’ స్పీడ్‌ మరింత పెరుగుతుంది.  

డా. కె. అపర్ణ 
సీనియర్‌ గైనకాలజిస్ట్, అబ్‌స్టెట్రీషియన్, ల్యాపరోస్కోపిక్‌ సర్జన్, సికింద్రాబాద్‌ 

Videos

షూతో తన్నుతూ.. నా భార్య ముందే బూతులు తిడుతూ..

ఆమె సాక్ష్యం చెప్తుందని ఎవరు ఊహించలేదు.. వాళ్ళకి శిక్ష రద్దయితే రేవతి పరిస్థితి ఇదే.

ఆశా భోస్లే మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

చిక్కుల్లో విష్ణు ప్రియ.. అసభ్యకర ఫోటోలు పెట్టి సబ్ స్క్రిప్షన్ పేరుతో డబ్బులు వసూల్

సంగీత ప్రపంచానికి తీరని లోటు..

ABN రాధాకృష్ణ కు సపోర్ట్ చేస్తూ వెంకయ్య నాయుడు వ్యాఖ్యలు.. అంబటి రాంబాబు స్ట్రాంగ్ కౌంటర్

ఎక్కడ ఆపాడో అక్కడ్నుంచే మొదలెట్టాడు.. చెన్నైలో చితకొట్టిన చెట్టా...

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా

లెజెండరీ సింగర్ ఆశా భోస్లే కన్నుమూత

నారాయణ స్వామి నివాసానికి అంబటి రాంబాబు

Photos

+5

‘డెకాయిట్‌’ మూవీ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

కరీనకపూర్‌ రాజసం ఉట్టిపడేలా కుర్తాసెట్‌ స్టైలిష్‌ లుక్‌..!

+5

ఆశా భోంస్లే కన్నుమూత.. జీవితంలో ఇవన్నీ పదిలం (పోటోలు)

+5

హైదరాబాద్ లో మండుతున్న ఎండలు (ఫొటోలు)

+5

తమిళ హీరోయిన్‌ అతుల్య రవి డీసెంట్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

‘పాపం ప్రతాప్‌’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

ఆర్టెమిస్‌-2 గ్రాండ్‌ సక్సెస్‌...నాసా విడుదల చేసిన (ఫొటోలు)

+5

శర్వానంద్‌ 'బైకర్‌' థాంక్యూ మీట్‌ (ఫోటోలు)

+5

ట్రెండింగ్‌లో తెలుగు హీరోయిన్‌ మానస వారణాసి (ఫోటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు (ఫొటోలు)