నా భార్త సంసారానికి పనికిరాడు.. నేనెలా రుజువు చేయాలి

Published on Wed, 02/11/2026 - 07:43

మాకు పెళ్లి అయ్యి ఏడాది అవుతోంది. తొలిరాత్రి మేము కలవడానికి నా భర్త నన్ను కొంత సమయం కావాలి అని అడిగారు. నేను సరే అన్నాను. అయితే, ఆ తర్వాత కొద్దిరోజులకు నేను తనను సంతృప్తి పరచడం లేదు అని నాతో గొడవ పెట్టుకుని ఇంట్లో నుంచి వెళ్లి΄ పోమ్మని చెప్పాడు. బంధుమిత్రులందరి దగ్గరా అలాంటి దుష్ప్రచారమే చేస్తున్నాడు. అయితే అది తప్పు. అతను అసలు ఒకసారి కూడా కనీసం నాకు దగ్గరయ్యే ప్రయత్నం కూడా చేయలేదు. అతను సంసారానికి పనికిరాడు అని చెప్పి కోర్టులో కేసు వేశాను. రుజువు చేయండి అంటున్నారు. నేనెలా రుజువు చేస్తాను? 
– సరళ, విజయవాడ

పెళ్ళైన తర్వాత భర్త భార్యతో శారీరక సంబంధం కలిగి ఉండకపోవటం లేదా లైంగికంగా తగిన విధంగా లేకపోవటం వలన చాలా వివాహ బంధాలు విడాకులతో అంతమవుతున్నాయి. భార్య అయినా భర్త అయినా లైంగిక సంతృప్తి ఇవ్వకపోవడం మానసిక క్షోభకి గురిచేస్తుందని కోర్టులు చాలా సందర్భాలలో చెప్పాయి. లైంగిక సంబంధం లేని భర్తతో కలిసి కొంతకాలం ఉన్న తర్వాత, విడాకుల కోసం దరఖాస్తు చేసుకునే స్త్రీలు ‘ఇంపొటెన్సీ’ని (నపుంసకుడు / లైంగిక శక్తిహీనత/ సంసారానికి పనికిరాడు అని) కారణంగా చూపి కేసులు వేస్తున్నారు. ఇలా వేసే కేసులలో దాదాపుగా స్త్రీలకు వ్యతిరేకం అయ్యే దాఖలాలే ఎక్కువ.

ఎందుకంటే భర్త ఇంపొటెన్సీని రుజువు చేయలేని పక్షంలో, భర్త లైంగిక సమర్థతపై అబద్ధపు ప్రచారం చేశారు అని, సమాజంలో భర్త పరువును తీశారని.. ఇవన్నీ కూడా భాగస్వామిపై క్రూరమైన చర్యలే అని కోర్టు భావించే ఆస్కారం ఉంది. తనని నపుంసకుడు అని అందరిలో ప్రచారం చేస్తోందనే కారణం చూపి–దానిని రుజువు చేస్తే, విడాకులు అడిగే భర్తలకు కూడా కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది. ఎందుకంటే, పురుషులలో తరచుగా వుండే ప్రీమెచ్యూర్‌ ఎజాక్యులేషన్, స్తంభన సమస్యలని చాలా సందర్భాలలో నపుంసకత్వం అని చాలామంది, ముఖ్యంగా సరైన అవగాహన లేని స్త్రీలు భావిస్తుంటారు. అదే కోర్టులో కూడా చెప్పి, చివరికి రుజువు చేయలేక నష్టపోతారు. అందుకే, అలాంటి అంశం ఏదైనా ఉంటే, విడాకుల దరఖాస్తు వేసేముందు నిపుణులతో వివరంగా చర్చించి నిర్ణయం తీసుకుంటే మంచిది. 

మగవారు సైతం వారికి ఉండే సమస్యలు దాచి ఉంచి పెళ్ళి చేసుకోవడం, కొన్ని సందర్భాల్లో అయితే తాము సంసారానికి పనికిరామని తెలిసి కూడా పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. లేదా తమకి స్త్రీలపై ఎటువంటి ఆకర్షణా లేదు అని తెలిసి కూడా పెళ్లికి సిద్ధమవుతారు. కేవలం తమని తాము మగాడిలా చూపించుకోవాలి అనే తపనతో స్త్రీ హక్కులను, జీవితాన్ని పట్టించుకోకుండా కావాలని పెళ్ళి చేసుకుని, తర్వాత ఏదో ఒక కారణం చూపి విడిపోవాలని పథకం ప్రకారం చేసుకునే పెళ్ళిళ్ళు కూడా చాలానే వున్నాయి. అయితే, ఒకవేళ తన భర్త సంసారానికి పనికిరాడు అని రుజువు చేయగలిగితే మాత్రం, అన్ని రకాల పరిహారాలతో΄ాటు తగిన భరణం కూడా పొందవచ్చు. అంతేకాక క్రిమినల్‌ చేసు కూడా నిరూపించవచ్చు. విడాకులు తీసుకోవాలి అనుకునే స్త్రీలు అయినా పురుషులు అయినా, తన భాగస్వామి లైంగికతను తెలుసుకొని, సరైన కారణాలు, రుజువు చేయదగ్గ అంశాలను కోర్టుకు చూపగల్గితేనే సరైన ఉపశమనం దొరుకుతుంది. 

- శ్రీకాంత్ చింత‌ల, హైకోర్టు న్యాయ‌వాది

మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్‌ ఐడీ: sakshifamily3@gmail.com

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)