Breaking News

ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!

Published on Wed, 05/15/2024 - 12:15

అంతర్జాతీయ కుంటుబ దినోత్సవాన్ని ప్రతి ఏడాది మే 15న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. నేటికాలంలో సమాజంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న ఈ నేపథ్యంలో కుటుంబాల విలువలను తెలియజేయడంకోసం ఈ కుటుంబ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు అధికారులు. గతంలో మాదిరిగా ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు ఉండడం లేదు. ఈ పరిణామం వల్ల ఒంటరితనం పెరిగిపోయి వ్యసనాలకు బానిసలు కావడం, పట్టించుకునేవారు లేకపోవడంతో మహిళలపై పనిభారం పెరిగి వారి ఆరోగ్యం దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. 

దీని కారణంగా సమాజంలో జరిగే దుష్పరిణామాలు గ్రహించిన ఐక్యరాజ్య సమితి కుటుంబ వ్యవస్థను పటిష్టం చేయడం కోసం 1993, మే 15ని అంతర్జాతీయ కుంటుబ దినోత్సవం ప్రకటించి వేడుకగా జరపడం ప్రారంభించింది. ఈ రోజున కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడం అనే అంశాన్ని వివరిస్తూ ప్రజా చైతన్యంకోసం ప్రపంచవ్యాప్తంగా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడం వంటివి చేస్తారు అధికారులు. 1993 నుంచి మొదలైన ఈ కార్యక్రమంలో ప్రతి ఏడాది ఒక అంశం థీమ్‌గా ప్రకటించి ఆ దిశగా ప్రజా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ ఏడాది థీమ్‌ "వాతారణ మార్పులు కుటుంబాలను ఎలా ప్రభావితం చేస్తుంది" అనే అంశాన్ని హైలెట్‌ చేశారు. 

ఈ థీమ్‌ ఉద్దేశ్యం..
వాతావరణ మార్పు, కాలుష్యం కారణంగా కుటుంబాల ఆరోగ్యం, శ్రేయస్సుపై ఎలా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందనే దానిపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా దీన్ని ప్రకటించారు. అంటే తుపానులు, కరువులు, అనే వాతావరణ మార్పులు కారణంగా కుటుంబంలోని వ్యక్తులు జీవనోపాధిని కోల్పోతారు. తద్వారా ఆర్థిక పరిస్థితి వారి బాంధవ్యాలపై తీవ్ర ప్రభావం స్తుంది. కార్లమర్క్స్‌ చెప్పినట్లు ప్రతి బంధం ఆర్థిక సంబంధమే అన్న పదం అందరికీ స్ఫురణకు వచ్చేలా చేస్తుంది. 

ఈ ఒక్క వాతావరణ మార్పు మనిషి జీవన మనుగడను ప్రశ్నార్థకంగా మార్చి ఒంటిరిని చేస్తుంది. అందువల్ల ప్రతిఒక్కరూ ఈ వాతావరణ మార్పలు కోసం తమ వంతుగా బాధ్యత తీసుకుని వ్యర్థాలను తగ్గించి మంచి అలవాట్లతో వాతావరణాన్ని కాపాడుకునే యత్నం చేయాలి. ప్రతి కుటుంబం విద్యతోనే బలోపేతం కాగలదని గ్రహించాలి. సహజ వనురులను పునరుత్పత్తి చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. వాతావరణాన్ని ఎంత ఆహ్లాదభరితంగా ఉంచుకుంటే అంతలా మను కుంటుంబాలు, గృహాలు పచ్చగా పదికాలాలు ఉంటాయని చెప్పడమే ఈ ఏడాది థీమ్‌ ముఖ్యోద్దేశం. 

అంతేగాదు ఈ ఏడాది 30వ అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా వాతావరణ మార్పులు, కుటుంబ విలువలను హైలెట్‌ చేసేలా ఆ రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని వివరించేలా చాల చక్కగా థీమ్‌ని ఏర్పాటు చేసింది ఐక్యరాజ్యసమితి.  అంతేగాదు ఈ రోజు కుటుంబ 

(చదవండి: నాసా ఏరో స్పేస్‌ ఇంజనీర్‌గా తొలి భారతీయ యువతి!)
 

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)