Breaking News

అమ్మ ట్రైనింగ్‌కు టైమ్స్‌‘వంద’నం

Published on Fri, 04/17/2026 - 03:39

రోజులు ఎంత మారినా వంట చేసే మగవారిపైజోకులు ఉండనే ఉంటున్నాయి. కాని వంట కూడా ఒక గొప్ప విజయపథం కాగలదు అని నిరూపించాడు వికాస్‌ ఖన్నా.
వంట గదిలో తల్లి వెనుక తిరుగుతూ ఆమె ద్వారా వంట నేర్చుకున్న వికాస్‌ ఖన్నా మాస్టర్‌ షెఫ్‌గా ఎదిగి నేడు ‘టైమ్‌ 100– 2026’లో ఒకడిగా ఎంపికయ్యాడు. ఇది వికాస్‌ తల్లికి లభించిన గౌరవం కూడా.  ‘టైమ్‌ 100’లో కేవలం ముగ్గురు భారతీయులు ఉంటే వారిలో సుందర్‌ పిచాయ్, రణ్‌బీర్‌ కపూర్‌తోపాటు వికాస్‌ ఖన్నా ఉన్నాడు. వికాస్‌ ఖన్నాకు చోటు భారతీయ వంటగది విజయం.

ప్రతి ఏటా టైమ్‌ పత్రిక విడుదల చేసే అత్యంత ప్రభావపూరిత వ్యక్తుల పట్టిక్ట ‘టైమ్‌ 100’ 2026 సంవత్సరానికి బుధవారం విడుదలైంది. ఈసారి ఎంపికైన నూరుగురిలో భారతీయ స్త్రీలు ఒక్కరూ లేకపోయినా ముగ్గురు పురుషులకు చోటు దక్కింది. వారిలో గూగుల్‌ సి.ఇ.ఓ. సుందర్‌ పిచాయ్, ‘యానిమల్‌’ హీరో రణ్‌బీర్‌ కపూర్‌తో పాటు అమెరికాలో స్థిరపడ్డ ప్రఖ్యాత షెఫ్‌ వికాస్‌ ఖన్నాకు చోటు దొరికింది. షెఫ్‌గా, రెస్టరెంట్ల యజమానిగా ఉన్న గుర్తింపుకే కాదు...  అతను చేస్తున్న సామాజిక సేవకు కూడా ‘టైమ్‌’ ఈ గుర్తింపు ఇచ్చింది. అమృత్‌సర్‌ వంట గది నుంచి మొదలైన అతని ప్రయాణం  ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందడం కచ్చితంగా విశేషం. ఇందుకు అతడి తల్లి కారణం.

అమృత్‌సర్‌లో...
వికాస్‌ ఖన్నా పుట్టింది అమృత్‌సర్‌లో. చిన్నప్పుడు ‘క్లబ్‌ఫుట్‌ సమస్య’ వల్ల కాళ్లలో సత్తువ లేక సరిగా నడవలేకపోయేవాడు. స్కూల్లో పిల్లలు ‘పోలియో వాలా లడ్కా’ అని ఏడిపించేవారు. దాంతో స్కూలుకు వెళ్లడానికి నిరాకరించి ఇంట్లో అమ్మ బిందూ ఖన్నా వెంట వంటగదిలో ఎక్కువ ఉండేవాడు. అక్కడి బంగాళదుంపల వాసన, వేగే జీలకర్ర చిటపటలు, రొట్టె కాల్చే వేడి – ఇవే అతనికి ఊరటనిచ్చేవి. ఆ వంటగదికి పసుపు రంగు తలుపు ఉంటే రాను రాను వికాస్‌కి అది ‘హల్దీ’లా కనిపించేదట. ‘నేను నడవ లేకపోతే ఏంటి... నా చేతులు వంట చేయగలవు కదా’ అనిపించిందట!

అమ్మ వంట స్టైల్‌
అమ్మ వంట స్టైల్‌ను వికాస్‌ నిశితంగా గమనించేవాడు. ఆమె పంజాబీ వంట చేసేది. మిక్సీలు, అవెన్లు లేకపోయినా వంటలో ఓపిక, శుభ్రత తప్పేది కాదు. ఉదయం మార్కెట్‌లో తాజా కూరగాయలు బేరమాడటం, మోపెడ్‌ మీద గ్యాస్‌ సిలిండర్‌ తేవడం ఆమే చేసేది. ‘వంటవాడికి ఏ పనీ చిన్నది కాదు. గుర్తు పెట్టుకో’ అని కొడుక్కి చెప్పింది. 

ఆటా గూంద్‌నా... ఫుల్కే బనానా...
‘పిండిని ప్రేమతో కలిపి మెత్తగా, పొంగుతూ వచ్చేలా కాల్చడం నేర్చుకుంటే నీకు వంట వచ్చినట్టే’ అని చెప్పిందామె. అలా కొడుకు చేత తొలిపాఠం మొదలు పెట్టించింది. ఆ తర్వాత బెండకాయ, ఆలూ గోబీ, దాల్‌ లాంటి పది రకాల వంటల్ని రొటేషన్ లో చేయించేది. ఇక ఆమె శీతాకాలంలో చేసే స్పెషల్‌– గాజర్‌ కా హల్వా. ఇదంటే వికాస్‌కు  ప్రాణం. తల్లి నుంచి వంట నేర్చుకున్న వికాస్‌ 16 ఏళ్ల వయసులో సొంతగా ‘లారెన్స్ గార్డెన్‌’ అనే క్యాటరింగ్‌ నడిపేవాడు. బుకింగ్‌ తీసుకోవడం నుంచి డెలివరీ వరకూ అన్నీ తనే.  ‘కస్టమర్ల నమ్మకమే నిజమైన ధనం’ అని తల్లి వ్యాపార పాఠం వికాస్‌కు నేర్పింది. ‘వంటతో పాటు ఆప్యాయతను వడ్డించడం మరువకు’ అని చెప్పిందామె. 

వికాస్‌ కేవలం చెఫ్‌ మాత్రమే కాదు. రచయిత, ఫిల్మ్‌ మేకర్, మానవతావాది. 40కి పైగా వంటల పుస్తకాలు రాశాడు. ‘ది లాస్ట్‌ కలర్‌’ అనే సినిమా తీశాడు. ఎక్కడికి వెళ్లినా ‘నేను ముందు వంటవాడిని‘ అని గర్వంగా చెప్పుకుంటాడు. ‘వంట నాకు భాష నేర్పింది. అమెరికాలో నాకు ఇంగ్లీష్‌ సరిగా రానప్పుడు నా వంట మాట్లాడింది. నా బాధను, నా ప్రేమను, నా దేశాన్ని ప్లేట్‌లో పెట్టి ప్రపంచానికి అందించాను’ అంటాడు వికాస్‌ ఖన్నా.
తల్లి ఆశీస్సు.... చేసే పని పట్ల ఇంత నిబద్ధత, ఆర్తి, శ్రద్ధ, హృదయం ఉన్నవాడు ‘టైమ్‌ 100’లో చేరక ఎలా ఉంటాడు?

వంట నా ప్రార్థన
‘వంట నాకు వృత్తి కాదు, అది నా  ప్రార్థన’ అంటాడు వికాస్‌ తల్లి నుంచి నేర్చుకున్న వంట గురించి. చిన్న వయసులోనే అమృత్‌సర్‌లో షెఫ్‌గా పేరు పొందిన వికాస్‌ ఆ తర్వాత అమెరికా వెళ్లి న్యూయార్క్‌లో∙రెస్టరెంట్లు తెరిచాడు. అమెరికా సంస్థలు ఇండియన్‌ రెస్టరెంట్లకు ఇవ్వని ‘మిచెలిన్‌ స్టార్‌’ హోదాను పొందాడు. ఆ తర్వాత సామాజిక సేవ మొదలుపెట్టాడు. కోవిడ్‌ టైంలో భారత్‌లో లక్షల మందికి ‘ఫీడ్‌ ఇండియా’ పేరుతో అన్నం పెట్టాడు. ‘ఒకరి ఆకలి తీర్చడం కంటే గొప్ప సంతృప్తి ఇంకోటి లేదు’ అంటాడు. 

Videos

మైక్రో ఫైనాన్స్ స్కాంలో రామావత్ మధు అరెస్ట్, NEXT అరెస్ట్ ఎవరిది ?

హోదా పక్కన పెట్టి మానవత్వం.. తల్లీ, తండ్రి లేని మహిళా కానిస్టేబుల్ కు సీమంతం

నాకు రాజకీయాల్లో ఎన్నో విషయాలు నేర్పారు.. అవినాష్ కల్మషం లేని వ్యక్తి..

శ్రీయాస్ అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్, ముంబై ఫ్యాన్స్ కు ఇచ్చిపడేసాడు

జగనన్న చేసినంత ఎవరూ చేయలేదు.. మహిళలకు సొంత అన్న జగన్

ఇండస్ట్రీని షేక్ చేసే ప్రాజెక్ట్.. 4000 కోట్లు లోడింగ్..

కేంద్ర ఉద్యోగులకి జాక్ పాట్ కనీస వేతనం 69 వేలకు పెంపు

కుప్పం కోర్టు చీవాట్లు.. జగన్ టూర్ గ్రాండ్ సక్సెస్

లోక్ సభలో పరువుపాయే.. TDP MLAల రాసలీలల వీడియోలపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్..

శ్రీరాముడు వలస కూలి.. నటుడు ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు

Photos

+5

భూత్‌ బంగ్లా మూవీతో పంజాబీ బ్యూటీ వామికా గబ్బి ట్రెండింగ్‌ (ఫోటోలు)

+5

కోహ్లీ లైక్‌ కొట్టిన చిన్నది! ఈమె ఎవరంటే.. (ఫొటోలు)

+5

ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి పుట్టినరోజు వేడుక (ఫోటోలు)

+5

భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు (ఫోటోలు)

+5

ఏపీలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ దివ్యక్షేత్రం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

వైట్‌ డ్రెస్‌ ఔట్‌ఫిట్‌లో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

మహేశ్‌బాబు బ్యానర్‌ సినిమా ‘రావు బహదూర్‌’.. సాంగ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఆర్య కొత్త సినిమా.. ‘మిస్టర్‌ ఎక్స్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

‘శ్రీనివాస మంగాపురం’ మూవీ HD స్టిల్స్

+5

‘పాపం ప్రతాప్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)