Breaking News

''మాకు పెళ్లి అవసరం లేదు'' అనుకునేవారు ఇది చదవాల్సిందే..

Published on Tue, 07/11/2023 - 13:04

దమ్మారో ధం... జీనత్ అమన్ నటించిన హరే రామ హరే కృష్ణ సినిమా లోని పాట. హిప్పీలు గంజాయి కొడుతూ ఎంజాయ్ చేసే సీన్ ఇది. వాసిరెడ్డి సీత రచించిన మారీచిక నవలను, కొంతకాలం ఆనాటి ప్రభుత్వం నిషేధించింది.

ఇందులో ఒక అమ్మాయి హిప్పీగా మారిపోతుంది.. మరో అమ్మాయి నక్సల్స్‌లో చేరిపోతుంది. కోర్టు ఆదేశాల మేర ఆ నిషేధాన్ని ప్రభుత్వం తొలగించింది. అప్పుడు ఆ నవలను చదివాను. అసలే చిన్న వయసు. రెండు రోజులు పిచ్చెక్కిపోయింది.

హిప్పీ ఉద్యమం..
1965లో అమెరికాలో మొదలయ్యింది. 1970 కల్లా ప్రపంచంలోని అనేక దేశాలకు పాకింది. సమాజం ధోరణి నచ్చని యువత చేసిన ఒక రకమయిన తిరుగుబాటు ఇది. తిరుగుబాటు అనడం కన్నా దారి తప్పిన పెడధోరణి అనడం సబబు. పొడవాటి చింపిరి జుట్టు .. బెల్ బాటమ్ పాంట్స్ .. ఇల్లు వదలి పెట్టి  తనలాంటి తిక్క సన్నాసులతో చేరి  గ్రూప్ లు గ్రూప్ లుగా  దిమ్మరిలా ఊరూరా తిరగడం. నీది నాది అనేది లేదు. అంతా మనదే అనే ఫిలాసఫీ.  సామూహిక జీవనం, నచ్చిన వారితో సెక్స్‌, మాదక  ద్రవ్యాలు... 1970లలో  తెగ నడిచింది. అప్పట్లో ఓ ట్రెండ్ అయ్యింది. గోవాలో అయితే ఆరంభోల్ బీచ్ అంతా వీరే ఉండేవారట. వీరు తయారు చేసిన వస్తువుల అమ్మకం కోసం అంజునా మార్కెట్ ఉండేది. 

ఇక భవిషత్తు అంతా ఇలాగే ఉంటుంది అని అప్పట్లో మేధావుల అంచనా. ఏమయ్యింది?  1980 వచ్చేటప్పటికి హిప్పీ ఉద్యమం మాయమయింది. ఆ నాటి హిప్పీ హీరోలు హీరోయిన్‌లు మాయమయిపోయారు. మాదక ద్రవ్యాలు తిని అప్పుడే ఎంతో మంది పోయారు. ఎవరైనా బతికున్నా వృద్ధాప్యంతో పోయుంటారు. యాభై ఏళ్ళ నాడు వారు 25 ప్లస్  వయసు వారు.. అంటే ఇప్పుడు 75 ప్లస్. ఏ వెర్రి అయినా కొంత కాలం ట్రెండింగ్‌ కావొచ్చు. కానీ అదే భవిషత్తు కాదు. ఇక పై పెళ్లిళ్లు వుండవు .. కుటుంబాలు ఉండవు అనుకొనే వారు ఈ నిజాన్ని గమనించాలి.

ఆ నాటి హిప్పీలు శారీరక సమస్యలు, వివిధ రోగాలతో పోయారు. నేటి వివాహ కుటుంబ వ్యవస్థపై తిరుగుబాటు చేసిన కొత్త తరం హిప్పీలు మానసిక రోగాలతో  పోతారు. ప్రకృతి అనేది ఒకటుంటుంది. అన్ని విషయాలను అది చూసుకొంటుంది. కాలం అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. సొంత అనుభవంతో ప్రతి విషయాన్ని నేర్చుకోవాలనుకునే వాడు వెబ్ పేజీలలో కేసు స్టడీ  కీర్తి శేషుడిగా మిగిలిపోతాడు. మిగతా వారి అనుభవం నుంచి నేర్చుకొనేవాడు తెలివయినవాడు. బతకడం తెలిచినవాడు. 

మీరు కేస్ స్టడీ అవుతారా? తెలివిగా బతుకుతారా? తేల్చుకోండి

వాసిరెడ్డి అమర్ నాథ్
మానసిక శాస్త్ర పరిశోధకులు, ప్రముఖ విద్యావేత్త

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)