Breaking News

శుభ కార్యాలకు విరామం!

Published on Sat, 11/29/2025 - 13:33

పెళ్లికి అతి ముఖ్యమైనది ముహుర్తం. బలమైన ముహుర్తంలో వివాహం చేసుకుంటే నూరేళ్ల జీవితం సుఖమయం అవుతుందన్నది అందరి నమ్మకం. అందుకే వివాహ తంతులో ప్రతి కార్యక్రమానికి ముహుర్తాలు చూసుకుంటాం. అందుకు పురోహితులు, పండితుల చుట్టూ తిరుగుతాం. అలాంటి ముహుర్తాలకు శుక్రవారం నుంచి బ్రేక్‌ పడనుంది. ఈ నెల 30న ప్రారంభమయ్యే శుక్రమౌఢ్యమి (మూఢం) వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న మాఘ బహుళ అమావాస్య వరకు కొనసాగనుంది. అప్పటి వరకు శుభ కార్యాలకు విరామం ఏర్పడుతుంది. ఇప్పటికే వివాహాలు కుదుర్చుకుని సిద్దంగా ఉన్న వారు మంచి ముహుర్తాల కోసం మూఢమి ముగిసే వరకు వేచి ఉండాల్సిందే. జిల్లాలో కల్యాణ మండపాల్లో పెళ్లి బాజాలు, సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాలు 80 రోజుల పాటు వినిపించవు

మాఘమాసమూ మూఢంలోనే... 
మాఘమాసం ఎప్పుడొస్తుందా అని వివాహాలు చేసుకునేవారు ఆశగా ఎదురు చూస్తారు. ఎందుకుంటే ఆ మాసంలో బలమైన ముహుర్తాలు ఉంటాయి. అయితే ఈసారి మాఘమాసం మూఢంలో కలవడంతో ఒక్క ముహుర్తం కూడా లేదు. అంతే కాదు..గృహ ప్రవేశాలకు అనుకూలమైన రథసప్తమి, వసంతపంచమి,మాఘ పౌర్ణమి వంటి ముఖ్యమైన తిథులు కూడా మూఢంలో కలిసిపోయాయి.

వ్యాపారులకు గడ్డుకాలం 
శుభకార్యాలకు బ్రేక్‌పడనున్న ఈ 80 రోజులు వ్యాపారులకు గడ్డుకాలమనే చెప్పాలి. మదనపల్లెలో నీరుగట్టువారిపల్లెలో పట్టుచీరల వ్యాపారులు అధికంగా ఉన్నారు. పెళ్లిళ్ల సీజన్‌లో పట్టుచీరలకు మంచి డిమాండ్‌ ఉంటుంది. మౌడ్యమి చీరల వ్యాపారం పెద్దగా ఉండకపోవచ్చు. మండపాలు, ఫంక్షన్‌ హాల్స్, వస్త్రదుకాణాలు, స్వర్ణకారులు, నగల షాపుల యజమానులు, డెకరేషన్‌ , క్యాటరింగ్, ఫోటో, వీడియో గ్రాఫర్లు, టెంట్‌ హౌస్, పూల వ్యాపారులు, ట్రావెల్స్, లైటింగ్, డీజె బాక్సుల అద్దెకిచ్చేవారు ఇలా శుభకార్యాలపై ఆధారపడ్డ అన్ని రంగాల వారు ముఖ్యంగా పురోహితులు తీవ్రంగా నష్టపోనున్నారు.

శుభ సూచికం కాదు  
ఒక గ్రహం సూర్య కిరణాల్లో కనుమరుగవడాన్ని జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మూఢం అంటారు. గ్రహశక్తులు బలహీనమవడంతో శుక్రగ్రహం సూచించే ఫలితాలు అనుకూలంగా ఉండవు. శుభకార్యాలకు గురుడు ఎంత ప్రధాన కారకుడో,శుక్రుడు కూఆ అంతే ప్రభావం కలవాడు. శుక్రుడు బలహీనమైతే  సంబంధాలు వివాహ జీవితం, ఆర్థిక స్థిరత్వం వంటి విషయాల్లో ప్రతికూలతలు ఏర్పడుతాయమని పండితులు చెబుతున్నారు. శుక్రమౌడ్యం ఉన్న కాలంలో శుభకార్యాలు జరుపుకోవడం శుభసూచికం కాదని అంటున్నారు.  

ఒక్క ముహుర్తం కూడా లేదు
శుక్రమౌఢ్యమి ఈనెల 30 నుంచి ప్రారంభం కానుంది. 28న ఉద యం వివాహాలకు ఒక ముహుర్తం మాత్రమే ఉంది. ఆ తరువాత నుంచి ఫిబ్రవరి 17 వరకు ఒక్క ముహుర్తం కూడా లేదు. ఈసారి మాఘ మాసం కూడా మూఢంలోనే కలిసిపోయింది. నిశి్చతార్థాలు, పెళ్లిళ్లు, గృహప్రవేశాలు,ఇతర శుభకార్యాలు జరుపుకునే వారు మూఢమి ముగిసే వరకు వేచి ఉండక తప్పదు. ఎందుకంటే ఈ 80 రోజుల్లో మంచి ముహూర్తాలు లేవు.     
 –ఆలూరి ఫణికుమార్‌శర్మ, పురోహితులు, మదనపల్లె

సంపాదన తగ్గిపోతుంది
పెళ్లిళ్ల సీజన్‌ ఉంటే సంపాదన ఉంటుంది.  ముహుర్తాలు ఉంటే పూలకు  డిమాండ్‌ ఉంటుంది. ఈ సారి శుక్రమౌఢ్యమి 80 రోజులు రావడంతో చేతిలో పని తగ్గిపోతుంది.  దీనిపై ఆధారపడిన వారంతా ఇబ్బందులు పడకతప్పదు.      
–ఎంబీఎస్‌ బాషా, పూలవ్యాపారి, మదనపల్లె  

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)