Breaking News

ఇవి మార్జాల పుష్పాలనుకుంటున్నారా!

Published on Sun, 05/26/2024 - 11:18

ఫొటోలో కనిపిస్తున్న పువ్వులను చూశారు కదా, అచ్చంగా పిల్లిపిల్లల్లా ఉన్నాయి కదూ! ఈ మార్జాల పుష్పాలు ఎక్కడివనేగా మీ అనుమానం? ఈ మార్జల పుష్పాలు దేవతా వస్త్రాల్లాంటివే! భూప్రపంచంలో ఎక్కడా కనిపించవు. మరి ఈ ఫొటో ఏమిటి అనుకుంటున్నారా? ఇదంతా కృత్రిమ మేధ మాయాజాలం.

చైనాకు చెందిన కొందరు సైబర్‌ మోసగాళ్లు ఈ మార్జాల పుష్పాల ఫొటోలను కృత్రిమ మేధతో సృష్టించి, బహుళజాతి ఈ–కామర్స్‌ సంస్థ ‘ఈబే’లో అమ్మకానికి పెట్టారు. ఇవి పూర్తిగా సేంద్రియ పద్ధతులతో పెంచిన తోటల్లో పూసినవని, ఈ పూలు అత్యంత అరుదైనవని, జన్యుమార్పిడి పద్ధతులేవీ లేకుండా సహజంగా పూసిన తాజా పూలు అని నమ్మబలుకుతూ, ఒక్కో పూలగుత్తిని 45 డాలర్లకు (రూ.3,757) అమ్ముతున్నట్లు ప్రకటించారు.

ఫొటోలోని పూలు ఎక్కడా చూడనివి కావడమే కాకుండా, చూడటానికి ముద్దొచ్చే పిల్లిపిల్లల్లా ఆకర్షణీయంగా ఉండటంతో కొందరు ఔత్సాహికులు వాటిని కొనడానికి డబ్బులు కూడా పంపారు. ఫేస్‌బుక్, ఎక్స్‌ (ట్విటర్‌) వంటి సోషల్‌ మీడియా సైట్లలోనూ ఈ ఫొటోలను జనాలు విరివిగా షేర్‌ చేశారు కూడా. కొందరు ఆశాజీవులు ఈ పూలమొక్కల విత్తనాలు కావాలంటూ కూడా కామెంట్లు పెట్టారు. కొద్దిరోజుల్లోనే ఇదంతా ఆన్‌లైన్‌ మోసమని బయటపడటంతో డబ్బులు పంపి చేతులు కాల్చుకున్న జనాలు లబలబలాడుతున్నారు.

ఇవి చదవండి: అవును.. అది నిజంగా మృత్యుగుహే!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)