Breaking News

స్మోకింగ్స్‌ .. ఆ గర్భ శత్రువులే..!

Published on Sun, 10/20/2024 - 08:39

చివరకు సిగరెట్‌ తాగే అలవాటు ఉంటే ప్యాసివ్‌ స్మోకింగ్‌ దుష్ప్రభావాలతో ఆ పొగ తాలూకు దుష్ప్రభావాలు దంపతులిద్దరిపైనా ఉంటాయన్న విషయం అనేక పరిశోధనల్లో తేలిందే. అయితే భర్త ఇంటి బయటెక్కడో సిగరెట్‌ తాగి ఇంటికి వచ్చినా ఆ పొగ దుష్ప్రభావం దంపతులిద్దరితోపాటు భార్య తాలూకు గర్భధారణపై కూడా పడుతుందంటున్నారు పరిశోధకులు. 

భర్తకి స్మోకింగ్‌ అలవాటు ఉన్నప్పుడు అతడి పార్ట్‌నరైన భార్యకు గర్భధారణ బాగా ఆలస్యం కావచ్చు. దీనికి అనేక కారణాలున్నప్పటికీ... ముఖ్యంగా అతడి స్మోకింగ్‌ వల్ల భార్యలోని హార్మోన్‌ సైకిళ్లలోని జీవరసాయనాల్లో మార్పు రావచ్చు. ఫలితంగా ఆమెలో అండాల సంఖ్య బాగా తగ్గవచ్చు. ఒకసారి అండాల సంఖ్య తగ్గితే వాటిని తిరిగి పొందడం సాధ్యంకాదు.

మామూలు ఆరోగ్యవంతులైన దంపతులతో పోలిస్తే భర్తకు పొగతాగే అలవాటు ఉంటే... అతడి భార్యకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోతాయి. అంతేకాదు... గర్భస్రావమయ్యే అవకాశాలూ పెరుగుతాయి. ఒకవేళ గర్భధారణ జరిగాక కూడా బిడ్డ నెలలు నిండకముందే పుట్టే (ప్రీమెచ్యుర్‌ డెలివరీకి) అవకాశాలూ పెరుగుతాయి. 

అలా పుట్టే పిల్లల బరువు కూడా చాలా తక్కువగా ఉండే అవకాశముంది. భవిష్యత్తులో వాళ్లకు డయాబెటిస్, గుండెజబ్బులు, స్థూలకాయం వచ్చే అవకాశాలూ ఎక్కువే. ఇక నేరుగా పొగతాగే పురుషుల విషయానికే వస్తే... ఆ దురలవాటు వల్ల వాళ్ల  వీర్యంలోని శుక్రకణాల సంఖ్య, నాణ్యత, కదలిక, చురుకుదనం, వాటి ఆరోగ్యం తగ్గుతాయి. అది నేరుగా వారి సంతాన సాఫల్యంపై ప్రభావం చూపుతుంది. 

అందుకే సమయానికి గర్భధారణ, మంచి ఆరోగ్యకరమైన శిశువును కోరుకునేవారు ఈ దురలవాటుకు దూరంగా ఉండటమే మంచిది. పొగతాగే అలవాటుకు దూరంగా ఉండటమన్నది కేవలం సంతాన సాఫల్యం అనే ఒక్క విషయంలోనే కాకుండా పురుషుల సంపూర్ణ ఆరోగ్యంతో ΄ాటు, భవిష్యత్తులో వారి పిల్లల పూర్తి ఆరోగ్యానికీ అది మేలు చేస్తుంది.  

(చదవండి: పొడవాటి రోడ్డు సొరంగంగా రికార్డు..!)

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)