Breaking News

Manuka Paudel: పాడాలి... వినపడుతుంది

Published on Thu, 12/21/2023 - 06:05

'శక్తి లేదనిపిస్తుంది. ప్రయత్నించాలి. కాళ్లలో బలం లేదనిపిస్తుంది. కదలాలి. ఎవరూ తోడు నిలవడం లేదనిపిస్తుంది. ఒంటరిగా పోరాడాలి. లేదని ఓడేది మనిషే. ఉందని గెలిచేది మనిషే. మేనుకా పౌడెల్‌కు చూపు లేదు. నేపాల్‌ నుంచి ఇండియాకు పాటను నమ్ముకుని వచ్చింది. తన పాటతో ఎందరినో కదిలించింది. ఇండియన్‌ ఐడెల్‌ కంటెస్టెంట్‌గా ఎంపికై ఇప్పుడు ‘సలార్‌’లో పాడి దేశం మొత్తానికి వినపడుతోంది.' స్ఫూర్తిదాయకమైన ఈ గాయని గురించి..

‘ఓ పాలన్‌ హారే నిర్గుణ్‌ ఔర్‌ న్యారే తుమ్రె బిన్‌ హమ్రా కోనొ నహీ’... ‘లగాన్‌’లోని ఈ పాటను మేనుకా పౌడెల్‌ (25) పాడుతున్నప్పుడు, ఆ పాటలోని ఆర్తికి, అర్పణకి, ఆరాధనకి న్యాయ నిర్ణేతల్లో ఒకరైన శ్రేయా ఘోషల్‌ ఏడుస్తూనే ఉంది. మరో జడ్జి విశాల్‌ దద్లానీ పరిస్థితీ అంతే. ఇంకో జడ్జయిన ప్రముఖ గాయకుడు కుమార్‌ షాను ‘వహ్వా’లు కొడుతూనే ఉండిపోయాడు. కన్ను తెరిచినా, కన్ను మూసినా చీకటి తప్ప, గాఢాంధకారం తప్ప, ఓడించాలని చూసే నలుపు తప్ప మరేమీ ఎరగని ఆమె తన పాటతో దివ్వె వెలిగించింది. వెలుతురు చూస్తోంది. వెలుతురు చూపిస్తోంది.


నేపాల్‌కు చెందిన అంధురాలు మేనుకా పౌడెల్‌కు ఆడిషన్స్‌ రౌండ్‌లో గోల్డెన్‌ మైక్‌ దొరికింది. ఇండియన్‌ ఐడెల్‌ సీజన్‌ 14లో ఇంకా ఆమె టాప్‌ కంటెస్టెంట్‌గా కొనసాగుతూ ఉంది. ముఖేష్‌ స్పెషల్‌లో ముఖేష్‌ తనయుడు నితిన్‌ ముఖేష్‌ సమక్షాన ‘ఏ ప్యార్‌ కా నగ్మా హై’ పాడితే ఆయన ఎంతో సంతోషించాడు. దర్శకుడు మహేశ్‌ భట్‌ సమక్షంలో ‘జఖ్మ్‌’ సినిమాలోని ‘గలి మే ఆజ్‌ చాంద్‌ నిక్‌లా’ పాటను పాడితే ఆయన స్పందిస్తూ ‘హృదయం దగ్గర ఒక కన్ను ఉంటుందని నువ్వు నిరూపించావు’ అన్నాడు.

వాద్యాలు చూడకుండా, పాటను అక్షరాల్లో చూడకుండా, అంత పెద్ద సెట్‌ను చూడకుండా, తన ఎదుట ఉన్న జడ్జిలు ఎలా ఉంటారో చూడకుండా  మేనుకా పౌడెల్‌ ఎంతో నిబ్బరంతో పాటలు పాడటం వల్ల కోట్లమంది అభిమానులను సంపాదించుకుంది. ఇంతకుముందు రియాల్టీ షోలలో కొంతమంది అంధులు పాడటానికి ప్రయత్నించారు కానీ ఇలా నిలువలేదు. మేనుకా పౌడెల్‌ గొంతులోని మాధుర్యం చివరకు ఆమెను‘సలార్‌’ లో పాడే వరకూ తీసుకెళ్లింది. ‘సలార్‌’ హిందీ వెర్షన్‌లోని ‘సూరజ్‌ హీ ఆజ్‌ తన్‌కే’ పాటను మేనుకా పౌడెల్‌ పాడింది. దీనివల్ల ఆమె బాలీవుడ్‌ ఎంట్రీ ఒక భారీ సినిమాతో జరిగిందని చెప్పాలి. ఇదంతా ఆమె పాడాలి అనుకోవడం వల్ల. ఓడాలి అని అనుకోకపోవడం వల్ల.


నేపాల్‌ అమ్మాయి
మేనుకా పౌడెల్‌ది నేపాల్‌లోని జాపా. పుట్టుకతో చూపు లేకపోయినా తల్లిదండ్రులు ఆ లోటు తెలియనీకుండా పెంచారు. బాల్యం నుంచి గానం పట్ల ఆమె ఆసక్తిని ప్రోత్సహించారు. తండ్రి మలేసియాలో ఉపాధిని వెతుక్కుంటూ వెళ్లగా ఇంటి బాధ్యత ఇప్పుడు మేనుక మీదే ఉంది. ముంబైలోని సురేష్‌ వాడ్‌కర్‌ అకాడెమీలో కొన్నాళ్లు పాడటం నేర్చుకున్న మేనుక గాయనిగా తన ప్రతిభను చాటేందుకు ప్రయత్నిస్తూనే వచ్చింది. సాయిబాబా భజనలు పాడుతూ ఉపాధి పొందింది. ‘సాయిబాబా నా కుటుంబ సభ్యుడు’ అని చెప్పుకుంటుంది. బహుశా ఆ సాయి దయ వల్లే ఆమెకు ఇప్పుడు గొప్ప గుర్తింపు లభించింది. ఆమె పాటను మీరు ఇండియన్‌ ఐడల్‌లో వినచ్చు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)